సౌత్‌లో తొలి వందే భారత్‌.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ | Vande Bharat Train: South India First Trial Run Success | Sakshi
Sakshi News home page

సౌత్‌లో తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

Published Tue, Nov 8 2022 8:30 AM | Last Updated on Tue, Nov 8 2022 8:30 AM

Vande Bharat Train: South India First Trial Run Success - Sakshi

అతివేగంగా దూసుకెళ్లే.. వందే భారత్‌ రైలు పట్టాల మీద పరుగులు పెట్టింది. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ కావడంతో.. 

సాక్షి, చెన్నై: దక్షిణ భారత దేశంలో తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాల మీద పరుగులు పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూరు వెళ్లే వందే భారత్‌ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహణ సోమవారం విజయవంతమైంది.

చెన్నైలోని ఎంజీఆర్‌ సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఉదయం 5.50 గంటలకు బయలుదేరి 8.50 గంటలకు జోళార్‌పేటకు చేరింది. అక్కడి నుంచి బెంగళూరు మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు మైసూరుకు చేరుకుంది.

మధ్యాహ్నం 1.05 గంటలకు మైసూరులో తిరుగు పయనమై, రాత్రి 7.35 గంటలకు చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు చేరుకుంది.  అతివేగంగా దూసుకెళ్తున్న వందేభారత్‌ రైలును వీక్షించేందుకు దారి పొడవునా జనం బారులు తీరారు. ఈ రైలు ఈ నెల 11వ తేదీ నుంచి రెగ్యులర్‌గా పట్టాలెక్కనుంది.

ఇదీ చదవండి: మఠంలో మృగత్వం.. ఏకంగా పది మందిపై!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement