
సుమంత్
వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు హీరో సుమంత్. ఒక్కో సినిమా కోసం చాలా సమయం తీసుకుంటున్న ఈయన తాజాగా ఓ సినిమాకి పచ్చజెండా ఊపారు. 2018లో మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించిన ‘పాదయోట్టం’ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఇందులో సుమంత్ హీరోగా నటించనుండగా విను యజ్ఞ దర్శకత్వం వహించనున్నారు. ఈస్ట్ ఇండియా టాకీస్, ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై తమ్మినేని జనార్థన రావు, శర్మ చుక్క ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాతో ఐమా అనే కొత్త హీరోయిన్ పరిచయం కానున్నారు. ‘‘గ్యాంగ్‌స్టర్ కామెడీ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రమిది. డిసెంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షి. రాజ్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్: బాలాజీ శ్రీను.
Comments
Please login to add a commentAdd a comment