మంచి కథ ఉంటే ప్రాంతీయ, భాషా భేదాలుండవు అనేది నిజం. అందుకే అలాంటి కథలు ఏ భాషలో దొరికినా రీమేక్‌ల రూపంలో వాటిని మళ్లీ తెరకెక్కించి విడుదల చేస్తారు మేకర్స్. ఇప్పుడంటే ఈ ట్రెండ్ కాస్త తగ్గినప్పటికీ గతంలో ఎక్కువగా అరువు కథలకే ఎక్కవగా ప్రయారిటీ ఇచ్చేవారు.
ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమా నాలుగైదు భాషల్లోకి రీమేక్ కావడం అనేది సహజంగానే జరుగుతుంది. కానీ టాలీవుడ్‌లో విడుదలైన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రం ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయింది. సిద్ధార్థ్, త్రిష, శ్రీహరి నటించిన ఈ చిత్రాన్ని ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎస్ రాజు దీనిని నిర్మించారు. 2005లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది.
ధనిక కుటుంబానికి చెందిన అబ్బాయితో పేదింటికి చెందిన అమ్మాయి ప్రేమలో పడితే ఎలాంటి చిక్కులు వచ్చాయి అనేది ఈ చిత్రం కథ. ఆ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నిలిచింది. 35 సెంటర్స్‌లో వంద రోజులు ఆడింది. తొమ్మిది భాషల్లో రీమేకైన తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. 7 భారతీయ భాషల్లోకి, 2 విదేశీ భాషల్లోకి రీమేక్ అయింది. ఏ భాషలో ఏ పేరుతో విడుదలైందో మీరూ తెలుసుకోండి.
1. ఉనక్కం ఎనక్కం (తమిళం)
2. నీనెల్లో నానల్లే (కన్నడ)
3. రామయ్య వస్తావయ్యా (హిందీ)
4. సునా ఛాదీ మో రూపా ఛాదీ (ఒడియా)
5. నింగోల్ తజబ(మణిపురి)
6. తేరా మేరా కీ రిష్తా (పంజాబీ)
7. ఐ లవ్ యు (బెంగాలీ)
8. నిస్సా అమర్ తుమీ (బంగ్లాదేశ్ బెంగాలీ)
9. ది ఫ్లాష్ బ్లాక్: ఫర్కెరా హెర్దా (నేపాలీ)
Comments
Please login to add a commentAdd a comment