
Bandla Ganesh: క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా వెండితెరపై నవ్వులు పూయించిన బండ్ల గణేశ్ తర్వాత పలు సినిమాలు నిర్మించి నిర్మాతగా సెటిలైపోయాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తూ ప్రేక్షకులకు దర్శనమిస్తున్న ఆయన ఇటీవల మళ్లీ నటుడుగా తన కెరీర్ ప్రారంభించాడు. ఈ క్రమంలో తాజాగా బండ్ల హీరోగా మారబోతున్నాడు.
తమిళంలో ఆర్.పార్తిబన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించి, నటించిన ‘ఒత్త సెరప్పు సైజ్ 7’ మూవీ రీమేక్‌లో బండ్ల గణేశ్ హీరోగా నటిస్తున్నాడు. వెంకట్ చంద్ర దర్శకత్వంలో స్వాతీ చంద్ర నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. హీరో పాత్ర కోసం బండ్ల గణేష్ ప్రత్యకంగా మేకోవర్ అవుతున్నాడు. తమిళ హిట్, జాతీయ అవార్డులు సాధించిన ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’కు ఇది తెలుగు రీమేక్.
Comments
Please login to add a commentAdd a comment