వరుణ్‌పై ఇప్పటికీ కోపంగా ఉన్నా: చిరంజీవి | Chiranjeevi Hilarious Comments On Varun Tej At Operation Valentine Pre Release Event | Sakshi
Sakshi News home page

Chiranjeevi: వాళ్ల నాన్నకు చెప్పుకోలేని విషయాలు నాతో షేర్‌ చేసుకుంటాడు.. అలాంటిది..

Published Mon, Feb 26 2024 11:05 AM | Last Updated on Mon, Feb 26 2024 11:24 AM

Chiranjeevi Hilarious Comments on Varun Tej in Operation Valentine Pre Release Event - Sakshi

వరుణ్‌తేజ్‌-లావణ్య త్రిపాఠిలు ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు. గతేడాదే వారి ప్రేమను పెళ్లి బంధంతో నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకెళ్లారు. వీరి ప్రేమ కహాని నిహారికకు ఎప్పటినుంచో తెలుసు. కానీ వరుణ్‌ తనంతట తానుగా చెప్పేవరకు ఇంట్లో ఎవరికీ ఈ రహస్యం లీక్‌ చేయలేదు. పెదనాన్న చిరంజీవితో అన్ని విషయాలు పంచుకునే వరుణ్‌.. తన ప్రేమ విషయాన్ని మాత్రం చెప్పలేదట. తాజాగా ఆపరేషన్‌ వాలంటైన్‌ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో వరుణ్‌పై చిన్నబుచ్చుకున్నాడు చిరు.

ఆ ఒక్కటి మాత్రం..
'ప్రతీది చెప్తాడు, కానీ ఈ ఒక్కటి చెప్పలేదు. చాలాసార్లు నన్ను ఇన్‌స్పిరేషన్‌ అని చెప్తుంటాడు. మరి లీక్స్‌ విషయంలో కూడా ఇన్‌స్పైర్‌ అయి నాకు చెప్పొచ్చుకదా! వాళ్ల నాన్నకు చెప్పుకోలేని విషయాలు కూడా నాతో చెప్పుకుంటాడు. ఈ ఒక్కటి మాత్రం చెప్పలేదు. ఈ విషయంలో నాకు ఇప్పటికీ కోపంగా ఉంది' అని సరదాగా వ్యాఖ్యానించాడు.

ఆ కారణం వల్లే చెప్పలేదు
దీనికి వరుణ్‌ స్పందిస్తూ 'గౌరవంతో కూడిన భయం వల్లే చెప్పలేదు. కానీ ఇంట్లో రివీల్‌ చేసేముందు మా పెదనాన్నకే చెప్పాను' అని క్లారిటీ ఇచ్చాడు. కాగా వరుణ్‌ తేజ్‌ హీరోగా శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. మానుషి చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌ అవుతోంది.

చదవండిఆ ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement