Chiranjeevi: Megastar Spoils Varun Tej Dosa, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Chiranjeevi: కుళ్లుగా ఉందంటూ నాశనం చేసిన చిరంజీవి

Published Fri, Jan 14 2022 12:36 PM | Last Updated on Fri, Jan 14 2022 1:21 PM

Chiranjeevi Spoiles Varun Tej Dosa, See Video - Sakshi

పండగ అంటే చాలు మెగా ఫ్యామిలీ అంతా ఒకేచోట చేరి సందడి చేస్తుంది. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని మెగా బ్రదర్స్‌ కుటుంబాలు ఒకేచోట చేరాయి. నిహారిక సైతం ఈ సెలబ్రేషన్స్‌లో పాలు పంచుకుంది. ఆరుబయట భోగి మంట ఏర్పాటు చేసి కూర్చున్న ఫ్యామిలీ మెంబర్స్‌ కోసం చిరంజీవి, వరుణ్‌ తేజ్‌ చెఫ్‌ మాస్టర్లుగా మారారు. ఇద్దరూ రుచికరమైన దోశలు వేస్తూ వడ్డించారు.

అయితే వరుణ్‌ తనకన్నా బాగా దోశలు వేస్తుండటంతో అసూయపడ్డాడు చిరంజీవి. 'అది సరిగా రాలేదు, నాకు కుళ్లు వచ్చేసింది. ఇది దోశ కాదు ఉప్మా' అంటూ వరుణ్‌ వేసిన దోశను చెడగొట్టాడు చిరు. బాస్‌తో 101వ దోశ అన్న క్యాప్షన్‌తో వరుణ్‌ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇక నిహారిక ఇంటి ముందు ముగ్గులు, వరుణ్‌ దోశలతో సహా ఫ్యామిలీతో చిట్‌చాట్‌ చేస్తున్న సన్నివేశాలనంతటినీ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన అభిమానులు ఎంత బాగా ఎంజాయ్‌ చేస్తున్నారో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement