చిరంజీవి-మోహన్ రాజా కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్'. దసరా సందర్భంగా బుధవారం(అక్టోబర్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే హిట్ తెచ్చుకుంది. దీంతో తొలి రోజు ఈ మూవీ భారీగా వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు రూ. 38 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో 20.9 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.
గాడ్ ఫాదర్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..
నైజాం: రూ. 3.25 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 1.25 కోట్లు
సీడెడ్: రూ.3.05 కోట్లు
నెల్లూరు: రూ.57 లక్షలు
గుంటూరు: రూ.1.75 కోట్లు
కృష్ణా జిల్లా: రూ.73 లక్షలు
తూర్పు గోదావరి: రూ.1.60 కోట్లు
పశ్చిమ గోదావరి: రూ.80 లక్షలు
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఏపీలో 6.70 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. 'గాడ్ ఫాదర్' సినిమాకు మొదటి రోజు 13 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment