
Salman Khan And Chiranjeevi Wrap Godfather Shooting Schedule: ముంబైకి బై బై చెప్పారు ‘గాడ్‌ఫాదర్’. చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రం తెరకెక్కుతోంది. మలయాళ హిట్ ఫిల్మ్ ‘లూసీఫర్’కు ఇది తెలుగు రీమేక్. ఇటీవల ముంబైలో ప్రారంభమైన ఈ సినిమా లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్ సోమవారం ముగిసింది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటుగా, ఓ సాంగ్‌ను కూడా చిత్రీకరించారట. కాగా ‘గాడ్‌ఫాదర్’ నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్‌లో స్టార్ట్ కానుందని సమాచారం. నయనతార, సత్యదేవ్, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.