Prabhu Deva Second Wife Himani Singh Emotional Video On His Birthday, Goes Viral - Sakshi
Sakshi News home page

Prabhu Deva : 'మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం'.. ప్రభుదేవాపై రెండో భార్య ప్రశంసలు

Published Fri, Apr 28 2023 5:24 PM | Last Updated on Sat, Apr 29 2023 4:31 PM

Prabhu Deva Second Wife Himani Singh Emotional Video Goes Viral - Sakshi

ఇండియన్‌ మైఖేల్‌ జాన్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో వివాదాలు ఉన్నాయి. హీరోగా, డ్యాన్సర్‌, కొరియోగ్రఫర్‌గా, దర్శకుడిగా..ఇలా మల్టీటాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌గా పాపులారిటీ పొందిన ప్రభుదేవా పర్సనల్‌ లైఫ్‌ మాత్రం కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. భార్య ఉండగానే హీరోయిన్‌ నయనతారతో ప్రేమాయణం నడిపిన ప్రభుదేవాకు ఆ బంధం కూడా చేదు ఙ్ఞాపకాన్నే మిగిల్చింది.

చదవండి: 'ఖుషి' మూవీ నుంచి సమంత లుక్‌ చూశారా? ఫోటో వైరల్‌

అప్పటికే పెళ్లై, ఇద్దరు పిల్లలున్న ప్రభుదేవా నయనతార కోసం కుటుంబాన్ని వదిలేశాడని, పచ్చని సంసారంలో నయనతార నిప్పులు పోసిందంటూ ప్రభుదేవా మొదటి భార్య రమాలత్‌ బహిరంగంగానే అప్పట్లో చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో ఇప్పటికీ సంచనలమే. కట్‌ చేస్తే.. చాన్నాళ్ల పాటు డేటింగ్‌ చేసిన ఈ జంట ఆ తర్వాత తమ దారులు వేరంటూ బ్రేకప్‌ చెప్పేసుకున్నారు.

దీంతో నయనతార దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ను పెళ్లి చేసుకోగా,ప్రభుదేవా 2020లో హిమానీ సింగ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ వీరిద్దరూ బయట ఎక్కడా కలిసి కనిపించలేదు. అయితే ఇటీవలె ప్రభుదేవా 50వ పుట్టినరోజు సందర్భంగా అతడికి విషెస్‌  తెలియజేస్తూ తొలిసారి ఓ షోలో కనిపించింది హిమానీ సింగ్‌.

చదవండి: హీరోయిన్‌తో వీడియో కాల్‌ మాట్లాడాలా? జస్ట్‌ రూ. 14వేలు చెల్లించండి

'మీరు చాలా అద్భుతమైన మనిషి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా' అంటూ భర్తను ఆకాశానికెత్తేసింది. తాజాగా వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement