Malavika Mohanan Took Dig At Lady Superstar Nayanthara Again? - Sakshi
Sakshi News home page

Malavika Mohanan : నయన్‌ స్టార్‌డమ్‌ చూసి మాళవిక ఓర్వలేకపోతుందా? అంత కోపమెందుకో?

Published Mon, Feb 13 2023 8:35 AM | Last Updated on Mon, Feb 13 2023 1:06 PM

Malavika Mohanan Took Dig At Lady Superstar Nayanthara Again - Sakshi

తమిళ సినిమా: నటి నయనతార–మాళవికా మోహన్‌ మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతోందా అన్న సందేహం కలుగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల మాళవికా మోహన్‌ సమయం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు. నయనతార నటించి, నిర్మించిన కనెక్ట్‌ చిత్రం గత డిసెంబర్‌ 22వ తేదీ విడుదలైంది. ఆ సందర్భంలో ఆస్పత్రిలో బెడ్‌పై పడుకున్న సన్నివేశంలోనూ ఫుల్‌ మేకప్‌తో జుట్టు కూడా చెదరకుండా నటించినట్లు నటి నయనతార పేరు చెప్పకుండా విమర్శించారు.

ఆమెకు కౌంటర్‌ ఇచ్చే విధంగా కనెక్ట్‌ చిత్రం ఆర్ట్‌ ఫీలింగ్‌ కాదని, కమర్షియల్‌ చిత్రం అని, అందుకే దర్శకుడు అశ్విన్‌ సూచన మేరకే తాను అలా నటించానని  నయన్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మాళవిక మోహన్‌ మరోసారి నటి నయనతారను అవమానించే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక విలేకరి లేడీ సూపర్‌స్టార్‌ నయనతార గురించి మీ అభిప్రాయం ఏంటన్న ప్రశ్నకు వెంటనే కల్పించుకున్న మాళవికా మోహన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ అనడం తనకు నచ్చదని అన్నారు.

హీరోయిన్లను సూపర్‌స్టార్‌ అంటే చాలని లేడీ సూపర్‌స్టార్‌ అనడం ఏంటని ప్రశ్నించారు. హిందీలో కూడా దీపికా పడుకొనే, కత్రినా కైఫ్, అలియా భట్‌ వంటి సూపర్‌ స్టార్‌ హీరోయిన్లు ఉన్నారని, వారు ఎవరు లేడీ సూపర్‌స్టార్స్‌ అనడం లేదని పేర్కొన్నారు. దీంతో నయనతారపై ఈ అమ్మడుకి ఎందుకంత కోపం అంటూ సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement