లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గ్లామరస్ పాత్రలతో కెరీర్ ఆరంభించిన నయన్ ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక పాపులారిటీని సంపాదించుకుంది. మాలీవుడ్‌లో తన ప్రస్థానం మొదలుపెట్టి తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.అంతేకాదు దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గానూ నయన్‌కి పేరుంది.
అయితే ఇప్పుడు నయనతార అభిమానులకు టెన్షన్ పెట్టే ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కొంతకాలం పాటు నయనతార నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఆమె షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నయన్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.
పిల్లల ఆలనా పాలనా నేపథ్యంలో నయన్ ఈ నిర్ణయం తీసుకుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment