
Bigg Boss Non Stop Telugu OTT: Mithra Sharma Will Top 5 Contestants: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రియాలిటీ షో మరింత రసవత్తరంగా మారనుంది. హౌజ్ కంటెస్టెంట్స్ అందరూ టాప్ 5లో చేరండంపైనే దృష్టి పెట్టారు. ఇంటి సభ్యుల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న వాళ్లలో మిత్రా శర్మ ఒకరు. సాధారణంగా కంటెస్టెంట్‌గా చేరిన మిత్రా శర్మ ఇంటి సభ్యులకు మంచి పోటీ ఇస్తుంది. గత 70 రోజులకుపైగా జరిగిన రియాలిటీ షోలో రకరకాల టాస్కుల్లో పార్టిస్‌పేట్ చేస్తూ పర్వాలేదనిపించింది. ప్రత్యర్థుల ఆరోపణలకు సరైనా సమాధానాలు చెబుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లో ఒకరిగా మారింది. అంతేకాకుండా ఇటీవల ఇంటిలోకి అతిథులుగా వచ్చిన సినీ తారలు, సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకుంది.
శేఖర్ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో రాజశేఖర్, ఆయన సతీమణి, దర్శకురాలు జీవిత బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టారు. అయితే కంటెస్టెంట్లకు రకరకాల టాస్క్‌లు ఇస్తూ.. వారిలోని ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఒక యాక్టింగ్ స్కూల్‌లో సీటు వస్తే ఎలా స్పందిస్తారు.. సీటు రాకపోతే ఎలా ఫీలవుతారు అనే థీమ్ ఆధారంగా నటించి చూపమన్నారు. దీంతో తనదైన శైలిలో రకరకాల భావాలు పలికిస్తూ నటించి చూపించింది మిత్రా శర్మ. ఓ దశలో భావోద్వేగంతో మిత్రా శర్మ నటించి చూపించిన తీరు చూసి జీవిత, రాజశేఖర్ మాత్రమే కాకుండా ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారు. అనంతరం మిత్రా శర్మను జీవిత, రాజశేఖర్ అభినందిస్తూ.. ఆమె నటనపై ప్రశంసలు కురిపించారు.
ఇక ఆదివారం రోజున టాప్ 5 కంటెస్టెంట్‌లు ఎవరో తేలిపోనుంది. వారాంతంలో హోస్ట్ నాగార్జున వచ్చి తుదివారానికి, టైటిల్ రేసుకు పోటీపడే అభ్యర్థులను నిర్ణయిస్తారు. ఇలాంటి నేపథ్యంలో మిత్రా శర్మ టాప్ 5లో చోటు సంపాదించడానికి అన్ని అర్హతలను సాధించినట్లుగా తెలుస్తోంది. మరీ ఈ ఆదివారం ఏమవుతుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment