Rajashekhar
-
యువతి బ్లాక్ మెయిల్‌తో.. యువకుడు తీవ్ర నిర్ణయం..!
కరీంనగర్: కరీంనగర్ తీగల వంతెన వద్ద సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్‌కు చెందిన దూది రాజశేఖర్‌రెడ్డి (28) బుధవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ఓ యువతి కారణమంటూ సూసైడ్ నోట్ రాశాడు. ఆరేళ్లుగా కరీంనగర్‌లోని ఓ హోటల్లో పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డికి ఇటీవల పెళ్లి సంబంధం చూశామని తండ్రి దూది రఘుపతిరెడ్డి తెలిపారు. అయితే అదే హోటల్లో పనిచేస్తున్న ఓ యువతి బ్లాక్ మెయిల్ చేస్తూ తన కుమారుడిని పెళ్లి చేసుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. ఈ నెల 23న నలుగురు వ్యక్తులతో కలిసి మల్లాపూర్ గ్రామానికి వచ్చి పరువు తీసిందని ఆరోపించారు. మళ్లీ గ్రామానికి వస్తానని బెదిరించడంతో పరువు పోతుందనే భయంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇవి చదవండి: హత్య చేసింది ‘తమ్ముడే’ -
Extra Ordinary Man OTT: సంక్రాంతికి ఓటీటీలో రానున్న నితిన్ సినిమా
నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం 'ఎక్స్ట్రా - ఆర్డినరి మ్యాన్'. వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. మంచి కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా డిసెంబర్ 8న విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. సినిమాలో ఎక్కవగా కామెడీ ఉన్నప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. రైటర్‌గా మెప్పించిన వక్కంతం వంశీ.. డైరెక్టర్‌గా మెప్పించలేకపోయాడని చెప్పవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమాకు కొంత నెగటివ్ టాక్ వచ్చింది. ఇదే సమయంలో నాని నటించిన హాయ్ నాన్న చిత్రం కూడా విడుదలై మంచి టాక్ రావడంతో నితిన్ సినిమా కలెక్షన్స్‌పై కూడా ప్రభావం చూపింది. ఈ చిత్రంలో నితిన్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఆయన విభిన్నమైన పాత్రలో నటించడం విశేషం. ఈ సంక్రాంతికి ఎక్స్ట్రా ఆర్డినరి మ్యాన్ ఓటీటీలోకి రానుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుందని భారీగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫిషీయల్ ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో ప్రముఖ హీరో రాజశేఖర్ ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు సుధేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్షవర్ధన్, పవిత్రా నరేష్, హైపర్ ఆది తదితరులు నటించారు. -
నా భర్తను చిత్రహింసలు పెడుతున్నారు..రాజశేఖర్ భార్య సుచరిత పిటిషన్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తన భర్త రాజశేఖర్‌ను నేరం ఒప్పుకోవాలని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని అతని భార్య సుచరిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘నా భర్తను ఈ నెల 11న పోలీసులు అరెస్ట్ చేశారు. 14వ తేదీ వరకు రిమాండ్ చేయలేదు. నేరం ఒప్పుకోమని పోలీసులు నా భర్తపై ఒత్తిడి తెస్తున్నారు. నా భర్తను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అక్కడ ఆయనను చూసి దిగ్భ్రాంతి చెందాను. ఆ సమావేశం నుంచి వెళ్లేటప్పుడు నా భర్త కుంటుతూ నడుస్తున్నారు. పోలీసుల చిత్రహింసల కారణంగానే ఆ పరిస్థితి వచ్చింది. ఆరోగ్య పరిస్థితి తెలుకునేందుకు రాజశేఖర్‌ను ఆసుపత్రిలో చేర్చాలి. ఆయనను సిట్ విచారణ చేస్తోంది. ఆ వీడియోను బయటపెట్టాలి. పోలీసుల చిత్ర హింసలపై, పేపర్ లీక్‌పై స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా కమిషన్‌తో విచారణ జరిపించాలి. నా భర్తపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలి’అని ఆమె పిటిషన్లో కోరారు. ప్రతివాదులుగా డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సిట్, హైదరాబాద్ నగర డీసీపీలను పేర్కొన్నారు. ఆమె పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అభ్యంతరాలు ఉంటే సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. చదవండి: రేవంత్‌కు సిట్ నోటీసులు.. మరోసారి కౌంటర్ -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ‘ఎన్ఆర్ఐ’ లింకులు?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న టీఎస్పీఎస్సీ లీకేజీలో ఎన్ఆర్ఐల పాత్ర ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కమిషన్‌లో అవుట్ సోర్సింగ్ కింద పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి మొదలుకుని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా ఎన్ఆర్ఐలు కావడంపై సిట్ దృష్టి సారించినట్లు స్థానిక పోలీసు వర్గాల సమాచారం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రాజశేఖర్‌రెడ్డిది సాధారణ కుటుంబం. అతని అత్తింటివారిదీ అదే పరిస్థితి. అయితే రాజశేఖర్‌రెడ్డి ఎదగడానికి రాజకీయ పరిచయాలే కారణమని, విదేశాల్లో ఉండి రావడంతో హైదరాబాద్ ఎన్ఆర్ఐ సర్కిల్స్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. విదేశాల నుంచి వచి్చన ఓ నాయకుడి పైరవీతో రాజశేఖర్‌రెడ్డికి టీఎస్‌పీఎస్‌స్సీలో కొలువు దక్కిందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గ్రూప్–1లో ‘విదేశీ’ కోణం పరిశీలించాలి.. రాజశేఖర్‌రెడ్డి ఎన్ఆర్ఐ మిత్రుల్లో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. 2018లో విదేశాల నుంచి వచ్చిన ఆ ఇద్దరికీ పేపర్ లీక్‌ల ద్వారా రాజశేఖర్‌రెడ్డే కొలువులు దక్కేలా చేశాడని సిట్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అదే సమయంలో రాజశేఖర్‌రెడ్డి మరో ఇద్దరు సన్నిహితులు గతేడాది అక్టోబర్ 16న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష కోసం విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి బంధువులు మాత్రం వారు దసరా కోసం వచ్చారని అంటున్నారు. ఈ వ్యవహారం తేలాలంటే.. ఇలా ఎందరు విదేశాల నుంచి వచ్చి గ్రూప్–1 రాశారో సిట్ పరిశీలించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఆస్తులపై ఆరా.. కంప్యూటర్, డిజిటల్ పరిజ్ఞానం మీద పూర్తిస్థాయి పట్టు ఉన్న వ్యక్తి కావడంతో రాజశేఖర్‌రెడ్డి పకడ్బందీగా లీకేజీ కథ నడిపాడని సిట్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు రాజశేఖర్‌రెడ్డితో పాటు అతని సమీప బంధువుల ఆస్తులు, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్న సిట్.. కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌కు చెందిన ఇద్దరి వివరాలు సేకరించారని తెలిసింది. చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కరీంనగర్‌తో లింకులు.. రాజశేఖర్ బంధువుల పాత్రపై అనుమానాలు -
మిత్రా శర్మను మెచ్చుకున్న జీవిత, రాజశేఖర్..
Bigg Boss Non Stop Telugu OTT: Mithra Sharma Will Top 5 Contestants: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రియాలిటీ షో మరింత రసవత్తరంగా మారనుంది. హౌజ్ కంటెస్టెంట్స్ అందరూ టాప్ 5లో చేరండంపైనే దృష్టి పెట్టారు. ఇంటి సభ్యుల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న వాళ్లలో మిత్రా శర్మ ఒకరు. సాధారణంగా కంటెస్టెంట్‌గా చేరిన మిత్రా శర్మ ఇంటి సభ్యులకు మంచి పోటీ ఇస్తుంది. గత 70 రోజులకుపైగా జరిగిన రియాలిటీ షోలో రకరకాల టాస్కుల్లో పార్టిస్పేట్ చేస్తూ పర్వాలేదనిపించింది. ప్రత్యర్థుల ఆరోపణలకు సరైనా సమాధానాలు చెబుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లో ఒకరిగా మారింది. అంతేకాకుండా ఇటీవల ఇంటిలోకి అతిథులుగా వచ్చిన సినీ తారలు, సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకుంది. శేఖర్ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో రాజశేఖర్, ఆయన సతీమణి, దర్శకురాలు జీవిత బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టారు. అయితే కంటెస్టెంట్లకు రకరకాల టాస్క్‌లు ఇస్తూ.. వారిలోని ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఒక యాక్టింగ్ స్కూల్లో సీటు వస్తే ఎలా స్పందిస్తారు.. సీటు రాకపోతే ఎలా ఫీలవుతారు అనే థీమ్ ఆధారంగా నటించి చూపమన్నారు. దీంతో తనదైన శైలిలో రకరకాల భావాలు పలికిస్తూ నటించి చూపించింది మిత్రా శర్మ. ఓ దశలో భావోద్వేగంతో మిత్రా శర్మ నటించి చూపించిన తీరు చూసి జీవిత, రాజశేఖర్ మాత్రమే కాకుండా ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారు. అనంతరం మిత్రా శర్మను జీవిత, రాజశేఖర్ అభినందిస్తూ.. ఆమె నటనపై ప్రశంసలు కురిపించారు. ఇక ఆదివారం రోజున టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో తేలిపోనుంది. వారాంతంలో హోస్ట్ నాగార్జున వచ్చి తుదివారానికి, టైటిల్ రేసుకు పోటీపడే అభ్యర్థులను నిర్ణయిస్తారు. ఇలాంటి నేపథ్యంలో మిత్రా శర్మ టాప్ 5లో చోటు సంపాదించడానికి అన్ని అర్హతలను సాధించినట్లుగా తెలుస్తోంది. మరీ ఈ ఆదివారం ఏమవుతుందో వేచి చూడాలి. -
వేణుమాధవ్ నన్ను బావా అని పిలిచేవాడు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ప్రముఖ కథానాయకుడు, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ అన్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అతనితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘వేణుమాధవ్ మా కుటుంబానికి ఎంతో సన్నిహిత మిత్రుడు. నన్ను బావా అని, జీవితను అక్క అని పిలిచేవాడు. ప్రతి పండక్కి తప్పకుండా ఫోన్ చేసేవాడు. అంతకు ముందే మెసేజ్ చేసి విష్ చేసేవాడు. మేమంటే తనకు అంత అభిమానం, ప్రేమ. మేమిద్దరం కలిసి సుమారు పది చిత్రాల్లో నటించాం. ‘మనసున్న మారాజు’, ‘రాజ సింహం’, ‘ఒక్కడు చాలు’, ‘గోరింటాకు’ చిత్రాల్లో తన నటనకు, హాస్యానికి మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరినీ వరుసలు పెట్టి పిలుస్తూ కుటుంబంలా కలుపుకుని వెళ్లేవారు. అంత మంచి మనిషి ఇంత త్వరగా లోకాన్ని విడిచి వెళతాడని అనుకోలేదు. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ఎన్నికల సమయంలోనే వేణుమాధవ్‌కి ఆరోగ్యం బాలేదట! కానీ, ఎవరికీ తెలియన్విలేదు. సాటి కళాకారుల కోసం ముందడుగు వేశాడు. ఎన్నికల్లో విజయం సాధించాడు. తర్వాత వ్యక్తిగతంగా కొన్ని కార్యక్రమాలకు హాజరు కాకపోయినా.. ‘మా’కు సంబంధించి ఏం వచ్చినా వెంటనే స్పందించేవాడు. తన అభిప్రాయం చెప్తాడు. గత వారం ఆయన హాస్పిటల్లో ఉంటే వెళ్లి కలిశాను. సోమవారం సాయంత్రం డిశార్జ్ అయ్యారు. మళ్లీ సీరియస్ అయిందని మంగళవారం అడ్మిట్ చేశారు. అందరినీ ఎన్నో ఏళ్లుగా నవ్వించి, నవ్వించి ఈ రోజు లోకాన్ని విడిచి వెళ్లి ఏడిపిస్తున్నారు’’ అని అన్నారు. -
రంగంపేటలో శవం లభ్యం
కొల్చారం మండలం రంగంపేట కొత్తచెరువు అలుగులోపల ఉన్న కాలువలో వడ్ల రాజశేఖర్(28) అనే వ్యక్తి శవం సోమవారం లభ్యమైంది. రాజశేఖర్ స్వస్థలం కొల్చారం మండలం రంగంపేట. రాజశేఖర్ ఈ నెల 6 నుంచి కనపడటంలేదు. దీంతో కుటుంబసభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 9న ఫిర్యాదు చేశారు. సోమవారం అటుగా వెళ్తున్న స్థానికులకు వాసన రావడంతో ఈ విషయం బయటపడింది. ఎవరో వ్యక్తులు రాజశేఖర్‌ను హత్య చేసి కాలువలో పడేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.