నీటి టబ్బులో ముగిసిన చిన్నారి ‘జీవిత’ం
Published Wed, Mar 1 2017 12:05 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
కూడేరు : కూడేరు శ్రీనివాసరావు కాలనీలో నివాసముంటున్న నెట్టికంటు, మమత దంపతుల కుమార్తె జీవిత(18 నెలలు) నీటి టబ్బులో పడి మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... తల్లీబిడ్డ ఇద్దరూ కలసి సాయంత్రమే నిద్రపోయారు. మధ్యలో పాపకు మెలకువ రావడంతో బాత్రూం వద్దకు వెళ్లింది. అక్కడ ఉన్న టబ్బులోని నీటిని చూస్తూ ఒక్కసారిగా అందులోకి పడిపోయింది. కాసేపటికి మెలకువ వచ్చిన మమత, బిడ కనిపించకపోవడంతో ఇంటి పరిసరాల్లో వెతికింది. చివరకు బాత్రూంలోకి వెళ్లి చూడగా టబ్బులో పడి ఉండడం గమనించి బయటకు తీసి, వెంటనే అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆ పసికందు మృతి చెందినట్లు నిర్ధరించాడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు.
Advertisement
Advertisement