water tub
-
అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా..
హయత్‌నగర్(హైదరాబాద్): ఇంటి ముందు తెరిచి ఉన్న నీటి సంపు ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. ఆడుకుంటూ వెళ్లిన అభం శుభం తెలియని ఏడాదిన్నర పాప నీటి సంపులో పడి మృతి చెందిన విషాధ ఘటన శనివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం రాచకొండ సమీపంలోని కడీలబాయి తండాకు చెందిన వాకుడోతు రా జు, సంతోషి దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. హయత్‌నగర్‌లోని రంగనాయకుల గుట్ట సమీపంలో ఉంటున్నారు. ► రాజు లారీపై లేబర్ పని చేస్తుండగా ఆయన భార్య సంతోషి హోటల్లో పని చేస్తోంది. వీరికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు నిత్య(ఏడాదిన్నర) శనివారం ఇంటి ముందు ఆడుకుంటూ సమీపంలో ఉన్న మరో ఇంటివైపు వెళ్లింది. ఆ ఇంటి ముందు ఉన్న సంపు మూత తెరిచి ఉండటంతో నిత్య సంపులో పడిపోయింది. చాలా సేపు ఎవరూ గమనించలేదు. గంట తర్వాత నిత్య కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెతకడం మొదలు పెట్టారు. చివరకు సంపులో తెలియాడటంతో నిత్యను బయటికి తీశారు. అప్పటికే పాప మృతి చెందింది. మురుగు వచ్చిందని.. సంపు మూత తెరిచి ఇటీవల కురుస్తున్న వర్షాలకు సమీపంలోని ఇంటి వద్ద ఉన్న సంపులో మురుగు చేరింది. దీంతో మురుగును బయటి పంపించేందుకు సంపు మూతను తెరి ఉంచినట్లు ఇంటి యజమాని తెలిపింది. సంపు మూతనుపెట్టకుండానే తాను పనికి వెళ్లింది. చుట్టూ ఎటువంటి రక్షణ లేకపోవడంతో అభం శుభం తెలియని చిన్నారి సంపులో పడి మునిగిపోయిందని స్థానికులు తెలిపారు. ► ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు తమ కళ్ల ముందు ఆడుకున్న చిన్నారి విగతజీవిగా పడి ఉండటం చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: పెంచి పెద్ద చేస్తే.. ప్రాణం తీసింది -
విషాదం: చిన్నారి నీటి తొట్టిలో పడి..
సాక్షి, చిత్తూరు: తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ చిన్నారి ఆడుకుంటూ నీటి తొట్టిలో పడిపొయింది. ఎవరు చూడకపోవటంతో చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. వివారాల్లోకి వెళితే.. తిరుమల బాలాజీనగర్‌లోని 689 నెంబర్ గల ఇంటిలో భాను ప్రకాష్, జయంతి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం పెద్దపాప శశికళ ఆడుకుంటూ ఇంట్లో ఉన్న నీటి తొట్టిలోకి జారి పడిపోయింది. పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఊరంగా గాలించగా, ఎంతకీ చిన్నారి ఆచూకీ లభించలేదు. చదవండి: అరుణ మృతదేహం లభ్యం; రైతుల ఆవేదన చివరకి ఇంట్లో ఉన్న నీటి తొట్టిలో అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందిందని ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మరణంతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. పాప తండ్రీ భాను ప్రకాష్ సొంత ఊరు చిత్తూరు జిల్లాలోని మెత్తకుప్పం. అక్కడి నుంచి బతుకు తెరువు కోసం తిరుమలకు వచ్చి ఓ దుకాణంలో పని చేస్తు ఇక్కడే జీవిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చిన్నారి మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. -
నీటి టబ్బులో ముగిసిన చిన్నారి ‘జీవిత’ం
కూడేరు : కూడేరు శ్రీనివాసరావు కాలనీలో నివాసముంటున్న నెట్టికంటు, మమత దంపతుల కుమార్తె జీవిత(18 నెలలు) నీటి టబ్బులో పడి మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... తల్లీబిడ్డ ఇద్దరూ కలసి సాయంత్రమే నిద్రపోయారు. మధ్యలో పాపకు మెలకువ రావడంతో బాత్రూం వద్దకు వెళ్లింది. అక్కడ ఉన్న టబ్బులోని నీటిని చూస్తూ ఒక్కసారిగా అందులోకి పడిపోయింది. కాసేపటికి మెలకువ వచ్చిన మమత, బిడ కనిపించకపోవడంతో ఇంటి పరిసరాల్లో వెతికింది. చివరకు బాత్రూంలోకి వెళ్లి చూడగా టబ్బులో పడి ఉండడం గమనించి బయటకు తీసి, వెంటనే అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆ పసికందు మృతి చెందినట్లు నిర్ధరించాడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. -
నీళ్ల బకెట్లో పడి బాలుడు మృతి
నిజామాబాద్: జిల్లాలోని బోధన్ శక్కర్‌నగర్‌లో ఓ చిన్నారి నీళ్ల బకెట్లో పడి మృతిచెందాడు. తల్లి ప్రమీల స్నానం చేసేందుకు వెళ్లింది. ఆ సమయంలో బయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి చందు ప్రమాదవశాత్తు బకెట్లో పడిపోయాడు. తల్లి వచ్చి చూసేసరికి బిడ్డ శవమై తేలాడు. దీంతో ఆ తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి
జంగారెడ్డిగూడెం రూరల్ : నీటి తొట్టెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని శ్రీనివాసపురం గ్రామానికి చెందిన దమ్మిసెల్లి అశోక్ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సోమవారం తన భార్య ప్రశాంతి, కుమార్తె లీలారాణి (2)తో కలిసి జంగారెడ్డిగూడెంలో బంధువుల ఇంటివద్ద జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇక్కడ చిన్నారి లీలారాణి ఆడుకుంటూ నీళ్లతొట్టెలో పడిపోయింది. బయటకు తీసేసరికి అప్పటికే మృతి చెందింది. -
నీటితొట్టిలో పడి బాలుడు మృతి
డోర్నకల్: నీటి తొట్టిలోపడి బాలుడు మృతి చెందాడు. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామానికి చెందిన మౌలి-యాకూబీ దంపతుల కుమారుడు హబీబ్(18 నెలలు) గురువారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ నీటి తొట్టిలో పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి బయటకు తీసేసరికి బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే హబీబ్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. -
నీటి టబ్‌లో పడి చిన్నారి మృతి
గుంతకల్లు (అనంతపురం) : అనంతపురం జిల్లాలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు మృతి చెందింది. జిల్లాలోని గుంతకల్లు పట్టణంలో శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని పాత గుంతకల్లుకు చెందిన లింగన్న, నర్సమ్మల రెండవ కూమార్తె తేజీశ్వరి(2) ప్రమాదవశాత్తు నీటి టబ్‌లో పడి మృతి చెందింది. ఆ సమయంలో చిన్నారి తల్లి కిరణాషాపుకు వెళ్లడంతో చిన్నారి ఆడుకుంటూ వెళ్లి తొట్టెలో పడి మృతి చెందింది. -
నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
మదనపల్లె రూరల్: నీటితొట్టెలోపడి ఓ చిన్నారి దుర్మరణం చెందిన విషాధ సంఘటన శుక్రవారం జరిగింది. మండలంలోని అంకిశెట్టిపల్లెకు చెందిన జాస్మీన్, బాబ్జాన్ల ఏకైక కుమార్తె ఎస్.షబ్రీన్(3) ఆడుకుంటూ ఇంటి ముందు ఏర్పాటు చేసిన నీటితొట్టెలో అనుకోకుండా పడిపోయింది. కుటుంబీకులు బాలిక కనబడకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. నీటి సంపులో చూడగా అపస్మారకస్థితిలో ఉన్న చిన్నారిని గమనించారు. వెంటనే బయటకు తీసి 108కు సమాచారం అందించారు. సిబ్బంది ఆ పాపను బతికించేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆ చిన్నారి మృతి చెందింది. -
నీటితొట్టిలో పడి బాలుడి మృతి
చిత్తూరు: ఓ నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సెల్లిగాని పల్లె గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు... గ్రామానికి చెందిన భారతమ్మ, చంద్రప్పల చిన్న కుమారుడు మహేంద్ర(4). తల్లిదండ్రులు పొలం పనులకు వెళుతూ కుటుంబ సభ్యుల వద్ద మహేంద్రను ఉంచారు. అతడు తోటి పిల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడి మృతి చెందాడు. (శాంతిపురం) -
అయ్యో అరుణ..!
మదన్‌పల్లి (శంషాబాద్ రూరల్), న్యూస్‌లైన్: అప్పటివరకు చలాకీగా ఇంటి ఆవరణలో ఆడుకున్న చిన్నారి కాసేపటికే విగత జీవిగా మారింది. నీళ్లు నిల్వచేసుకునే తొట్టే ఆ పసిపాప ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన శుక్రవారం శంషాబాద్ మండలం మదన్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వానరాసి గోపి, మనీల దంపతులు. వీరికి రెండేళ్ల కూతురు అరుణ ఉంది. కుటుంబసభ్యులంతా భిక్షాటన చేస్తుంటారు. శుక్రవారం ఉదయమే మనీల భిక్షాటనకు వెళ్లింది. ఇంటి వద్ద గోపితోపాటు మనీల చెల్లెలు రామలక్ష్మి ఉన్నారు. మధ్యాహ్నం గోపి పనినిమిత్తం సమీపంలోని హోటల్ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆడుకుంటూ అరుణ ఇంటి ఆవరణలో ఉన్న నీటితొట్టిలో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత అరుణ కోసం రామలక్ష్మి చుట్టుపక్కల ఇళ్లలో వెతికినా కన్పించలేదు. ఇంటికి వచ్చి నీటితొట్టిలో చూడగా నీళ్లలో అరుణ పడి ఉంది. వెంటనే చిన్నారిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు ఇంటి కి చేరుకుని బోరున విలపించారు. మనీల ప్రస్తుతం గర్భిణి కాగా చిన్నారి అరుణ ఈ దంపతుల ఏకైక సంతానం.