నీటితొట్టెలో పడి చిన్నారి మృతి | Missing girl's body found after she 'fell into the water tub' | Sakshi
Sakshi News home page

నీటితొట్టెలో పడి చిన్నారి మృతి

Published Fri, May 22 2015 6:54 PM | Last Updated on Wed, Apr 3 2019 5:34 PM

Missing girl's body found after she 'fell into the water tub'

మదనపల్లె రూరల్: నీటితొట్టెలోపడి ఓ చిన్నారి దుర్మరణం చెందిన విషాధ సంఘటన శుక్రవారం జరిగింది. మండలంలోని అంకిశెట్టిపల్లెకు చెందిన జాస్మీన్, బాబ్‌జాన్‌ల ఏకైక కుమార్తె ఎస్.షబ్రీన్(3) ఆడుకుంటూ ఇంటి ముందు ఏర్పాటు చేసిన నీటితొట్టెలో అనుకోకుండా పడిపోయింది. కుటుంబీకులు బాలిక కనబడకపోవడంతో చుట్టుపక్కల గాలించారు.

 

నీటి సంపులో చూడగా అపస్మారకస్థితిలో ఉన్న చిన్నారిని గమనించారు. వెంటనే బయటకు తీసి 108కు సమాచారం అందించారు. సిబ్బంది ఆ పాపను బతికించేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆ చిన్నారి మృతి చెందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement