విషాదం: చిన్నారి నీటి తొట్టిలో పడి.. | Child Fell Into The Water Tub And Deceased In Chittoor District | Sakshi
Sakshi News home page

విషాదం: చిన్నారి నీటి తొట్టిలో పడి..

Published Mon, Nov 30 2020 1:30 PM | Last Updated on Mon, Nov 30 2020 1:35 PM

Child Fell Into The Water Tub And Deceased In Chittoor District - Sakshi

చిన్నారి శశికళ, విలపిస్తున్న తల్లిదండ్రులు

సాక్షి, చిత్తూరు: తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ చిన్నారి ఆడుకుంటూ నీటి తొట్టిలో పడిపొయింది. ఎవరు చూడకపోవటంతో చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. వివారాల్లోకి వెళితే.. తిరుమల బాలాజీనగర్‌లోని 689 నెంబర్‌ గల ఇంటిలో భాను ప్రకాష్, జయంతి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం పెద్దపాప శశికళ ఆడుకుంటూ ఇంట్లో ఉన్న నీటి తొట్టిలోకి జారి పడిపో​యింది. పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఊరంగా గాలించగా, ఎంతకీ చిన్నారి ఆచూకీ లభించలేదు. చదవండి: అరుణ మృతదేహం లభ్యం; రైతుల ఆవేదన

చివరకి ఇంట్లో ఉన్న నీటి తొట్టిలో అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందిందని ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మరణంతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. పాప తండ్రీ భాను ప్రకాష్ సొంత ఊరు చిత్తూరు జిల్లాలోని మెత్తకుప్పం. అక్కడి నుంచి  బతుకు తెరువు కోసం తిరుమలకు వచ్చి ఓ దుకాణంలో పని చేస్తు ఇక్కడే జీవిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చిన్నారి మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement