child baby
-
ఇంటి మిద్దె కూలడంతో ఒక్కసారిగా చిన్నారి.. తీవ్ర విషాదం!
మహబూబ్‌నగర్: శిథిలావస్థకు చేరిన ఓ ఇంటి మట్టి మిద్దె కూలి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మద్దెల్‌బీడ్‌లో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన నర్సప్పకు భగవంతు, బస్వరాజు, అంజి అనే ముగ్గురు కుమారులు. అందరూ 30 ఏళ్లు క్రితం నిర్మించిన మట్టిమిద్దె ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. ఉదయం పత్తి ఏరే పని ఉండడంతో అందరూ పొలం వద్దకు వెళ్లారు. ఇంటి వద్ద అంజి భార్య అనిత, బస్వరాజు కుమార్తె వైష్ణవి ఉన్నారు. ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో కట్టె స్తంభంతో కూలడంతో అక్కడే ఆడుకుంటున్న వైష్ణవి, నర్సప్ప చిన్నకోడలు అనిత మట్టి మిద్దె కూలింది. దీంతో వారిద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. చుట్టుపక్కల వారు గమనించి.. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి, వెంటనే వారిని నారాయణపేట జిల్లాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. వైష్ణవి (3) మార్గమధ్యంలోనే మృతి చెందింది. అనిత చికిత్స పొందుతోంది. -
'పాపం.. పసికందు' పొదల్లో పడేశారు! పిక్కటిల్లేలా గుక్కపెట్టి ఏడ్చేసరికి..
మహబూబాబాద్: పాపం.. పసికందు.. ఆడపిల్ల భారమనుకున్నారో..? లేదా నెలలు నిండకముందే జన్మంచిందనకున్నారో..? లేదా ఇతర కారణాల వల్లనో గాని శిశువును వదిలించుకున్నారు. తల్లి గర్భంలో ఎన్నో గండాలు.. మరెన్నో సుడిగుండాలు తట్టుకుని జీవం పోసుకున్న ఆ శిశువు.. ఆరు నెలల అనంతరం బహ్య ప్రపంచంలోకి అడుగిడింది. అయితే అమ్మ ఒడిలో హాయిగా సేదదీరాల్సిన ఆ శిశువు పొదల్లో దర్శనమిచ్చింది. దిక్కులు పిక్కటిల్లేలా గుక్కపెట్టి ఏడుస్తోంది. ఈ శబ్దం విన్న గ్రామస్తులు అక్కడి వెళ్లి చూడగా ఆ పసిమొగ్గ దీనస్థితిలో కనిపించింది. ఈ హృదయవిదారక ఘటనను చూసి వారు చలించిపోయారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని శిశువును ఆస్పత్రికి తరలించారు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం మండలంలోని పాత్రాపురం శివారులోని పొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం ఆడ శిశువును పడేసి వెళ్లారు. ఈ శిశువును చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకుని శిశువును వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ప్రస్తుం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ శిశువు తల్లిదండ్రుల వివరాలు ఎవరికై నా తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్సై అశోక్ పేర్కొన్నారు. కాగా, శిశువు పూర్తి నెలలు నిండకుండానే 7 నెలలో జన్మించిందని, పాపను వరంగల్ ఎంజీఎంకు తరలిస్తున్నట్లు వైద్యాధికారి విజిస్టర్ తెలిపారు. -
TSPSC Group 4 Exam: పోలీసుల మానవత్వం.. 3 నెలల చిన్నారిని లాలిస్తూ
తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష కొనసాగుతోంది. పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించనుండగా.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1 అయిపోయింది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. కాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో భార్యభర్తలు ఇద్దరు గ్రూప్- 4 పరీక్ష రాయడానికి వచ్చారు. దీంతో సదరు దంపతుల 3 నెలల చిన్నారిని పోలీసులు లాలించారు. కురవి మండల పెద్దతండాకు చెందిన జగ్గులాల్, సబితా దంపతులిద్దరికి గ్రూప్-4 పరీక్షకు హాజరయ్యారు. వారి చిన్నారిని నాన్నమ్మ దగ్గర ఉంచగా పాప బాగా ఏడుస్తుండటంతో మహిళ కానిస్టేబుల్ శ్రీలత చిన్నారిని దగ్గర తీసుకొని లాలించారు. మంచం తెప్పించి చెట్టుకింద పడుకోబెట్టారు. తొర్రురులో 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా పలువురు చిన్నపిలల తల్లులు కూడా పరీక్షకు హాజరయ్యారు. వారి పిల్లలకు పోలీసులు అరటిపండ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ అందించి మానవత్వం చాటుకున్నారు. మానవత్వం చూపిన పోలీస్ సిబ్బందిని తొర్రురు డీఎస్పీ రఘు, తొర్రురు సీఐ సత్యనారాయణ ఎస్సై సతీష్, ఎస్సై రాంజీ నాయక్ అభినందించారు. -
బిడ్డను వదల్లేక రైలెక్కిన మహిళ జవాన్.. సెల్యూట్ అంటూ నెటిజన్ల ప్రశంస!
కన్న తల్లి తన బిడ్డలను ఎంత అపురూపంగా, జాగ్రత్తగా చూసుకుంటుందో అందరికీ తెలుసు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తల్లి తన బిడ్డలను వదిలిపెట్టదు. కానీ, దేశ రక్షణలో భాగంగా తన కర్తవ్య నిర్వహణలో భాగంగా ఓ తల్లి తన 10 నెలల పసికందును విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తన బిడ్డను భర్త, కుటుంబ సభ్యులకు అప్పగిస్తూ కన్నీరు పెట్టుకుంది. పేగుబంధాన్ని విడిచి వెళ్లలేక బరువైన గుండెతో వెక్కివెక్కి ఏడుస్తూ విధులకు బయలు దేరింది. ఈ ఘటనను చూసి అక్కడున్న వారంతా ఆవేదనకు లోనయ్యారు. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కర్వీర్ తాలూకా నంద్‌గావ్‌కు చెందిన వర్షా రాణి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్‌గా పని చేస్తోంది. పది నెలల కిందటే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పది నెలల పాటు ఆమె తన బిడ్డ ఆలనా పాలనా చూస్తూ ఎంతో సంతోషంగా కాలం గడిపింది. ఇక, మళ్లీ ఉద్యోగానికి వెళ్లాల్సిన సమయం రావడంతో విధులకు తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన బిడ్డను వదిలి డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు ఆమె సిద్ధమైంది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌కు బయలుదేరింది. డ్యూటీకి వెళ్లాలనే కోరిక ఏ మాత్రం లేకపోయినప్పటికీ బలవంతంగా రైలు ఎక్కింది. తన బిడ్డను భర్త చేతుల్లో పెడుతూ భావోద్వేగం ఆపులేక బోరున ఏడ్చేసింది. బిడ్డను వదల్లేక కన్నీళ్లు పెట్టుకుంది. భర్తను, తల్లిదండ్రులను కౌగలించుకుని ఏడ్చేసింది. అనంతరం అందర్నీ వదిలి రైలెక్కింది. రైలు కదులుతున్నా ఆమె డోర్ దగ్గరే నిల్చుని బిడ్డను చూస్తూ కన్నీటితో వీడ్కోలు పలికింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. जब देश की ज़िम्मेदारी के सामने घर की ज़िम्मेदारी हार जायें कोल्हापुर की वर्षणी पाटिल अपने दस महीने के बच्चे को छोड़ अपनी ड्यूटी पर वापस जाती हुई। ऐसी माताओं पर हर देशवासी को गर्व है। pic.twitter.com/iBVJ5tish5 — Shobhna Yadav (@ShobhnaYadava) March 19, 2023 -
Aastha Arora: బిలియన్త్ బేబీ ఏం చేస్తోంది!?
ఆస్తా అరోరా ఎవరో మీకు గుర్తుందా ? పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ భారత్ బిలియంత్ బేబి అంటే టక్కున గుర్తొస్తుంది. ఆమె పుట్టినప్పుడు ప్రభుత్వ పెద్దలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. 2000 సంవత్సరం మే 11న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఉదయం 5 గంటల 5 నిమిషాలకు భూమ్మీదకు వచ్చిన పసికందును చూడడానికి ఆ నాటి ఎన్డీయే ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు తరలివచ్చారు. గులాబీ రంగు దుప్పట్లో ఆ పసికందుని చుట్టి ఫొటోలకు పోజులిచ్చారు. ఆ బిడ్డ పుట్టుక ప్రపంచ దేశాల పత్రికల్లో పతాక శీర్షికగా మారింది. ఆ పాప రాకతో మన దేశ జనాభా 100 కోట్లకు చేరుకుంది. భారత్ జనాభా నియంత్రణపై మరింతగా దృష్టి పెట్టాలని ఐరాస గట్టిగా హెచ్చరించింది కూడా. చైనా తర్వాత 100 కోట్ల జనాభా క్లబ్లో నిలిచిన రెండో దేశంగా రికార్డులకెక్కింది. నాటి కేంద్ర మహిళా శిశు మంత్రి సుమిత్రా మహాజన్ ఉచిత విద్య, వైద్యం, రైళ్లలో ఉచిత ప్రయాణం వంటివి కల్పిస్తామని ఆ కుటుంబంలో ఆశలు పెంచారు. అమ్మాయి తండ్రికి మంచి ఉద్యోగం ఇస్తామని, ఆమె పెంపకం బాధ్యత తమదేనని హామీలు గుప్పించారు. రెండు దశాబ్దాలకు పైగా గడిచిపోయాయి. ఇప్పుడు ఆస్తా ఎక్కడ ఉందో, ఏం చేస్తోందో తెలిస్తే నిర్ఘాంతపోతాం. తండ్రి ఒక షాపులో సేల్స్‌మన్‌గా ఉద్యోగం చేసేవారు. నెలకి రూ.4,000 జీతంతో ఇద్దరు పిల్లల్పి పోషించాల్సి వచ్చింది. స్కూలు ఫీజులు కట్టడానికి కూడా వారి దగ్గర డబ్బుల్లేవు. ఆస్తా స్వశక్తితో ఎదిగి 22 ఏళ్ల వయసులో నర్సు ఉద్యోగాన్ని సంపాదించుకుంది. డాక్టర్ కావాలన్న ఆమె కలలు కల్లలయ్యాయి. ‘‘డాక్టర్ కావాలని చాలా ఉండేది. కానీ మా తల్లిదండ్రులకు శక్తి లేకపోవడంతో ప్రైవేటు స్కూలుకు పంపలేకపోయారు. దాంతో నేను రాజీపడి నర్సుగా శిక్షణ తీసుకున్నాను’’ అని వివరించింది. యూఎన్ ఆర్థిక సాయంతో నర్సు కోర్సు యూఎన్ నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం మాత్రమే ఆ కుటుంబానికి దక్కింది. దానిని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆస్తాకు 18 ఏళ్లు వచ్చిననాటికి రూ.7 లక్షలొé్చయి. ఆ డబ్బులతోనే కాలేజీ, నర్సు కోర్సు చేసింది. ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా చేరింది. ఆస్పత్రిలో బిడ్డను కన్నప్పుడు రాజకీయ నాయకులు చెప్పిన మాటలు విని తన కూతురుకి బంగారు భవిష్యత్ ఉందని తల్లి అంజన మురిసిపోయింది. కానీ ఎంత మంది చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది. నర్సుగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే అధిక జనాభా దేశానికి భారం అని ప్రజల్లో అవగాహన పెంచే బాధ్యతను కూడా ఈ బిలియన్త్ బేబి తీసుకుంది. వివిధ సంస్థలు ఏర్పాటు చేసే చర్చల్లో పాల్గొంటూ జనాభా నియంత్రణపై ప్రసంగాలిస్తోంది. త్వరలో భారత జనాభా 140 కోట్లకు చేరుకోనుంది. నిరుపేదల బతుకుల్లో మాత్రం ఇప్పటికీ మార్పు రాకపోవడం విషాదమని ఆస్తా నిట్టూరుస్తోంది. స్కూల్లో సెలబ్రిటీయే ఆస్తా చిన్నతనంలో సెలబ్రిటీ హోదాయే అనుభవించింది. బిలియన్త్ బేబీ ఏం చేస్తోందంటూ మీడియా ఎన్నో కథనాలు చేసింది. ఏడాది వయసులో ఐరాస పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ), కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ ప్రారంభోత్సవానికి బుల్లి అతిథిగా హాజరైంది. చిన్నారి ఆస్తా తన అన్నయ్య పాఠ్య పుస్తకాలను చించేసి ఆడుకోవడమూ పేపర్లవారికి వార్తే అయింది. అప్పట్లో పేపర్లో వచ్చిన వార్తలన్నీ చూసుకొని మురిసిపోవడమే తప్ప ఆమె ఒరిగిందేమీ లేదు. తన పుట్టుక ప్రపంచానికే ప్రత్యేకమైనదని ఆస్తాకు స్కూలుకెళ్లే సమయంలోనే అర్థమైంది ‘‘నాకు నాలుగైదేళ్లు ఉంటాయి. మా స్కూలుకు మీడియా కెమెరాలతో రావడంతో ఆశ్చర్యపోయా. టీవీల్లో కనిపించడం, అందరూ నా గురించి మాట్లాడుకోవడం చాలా గొప్పగా ఫీలయ్యా’ అంటూ ఆ సంగతుల్ని నెమరేసుకుంది. ఆస్తా చదువులో చురుగ్గా ఉండేది. చర్చల్లో పాల్గొనేది. స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండేది. కానీ ఇంటర్‌కు వచ్చాక ఆమె తన ఆశల్ని చంపేసుకోవాల్సి వచ్చింది. మంత్రుల చుట్టూ తిరిగినా ముఖం చాటేయడంతో ప్రభుత్వ కాలేజీలో చేరాల్సి వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మూఢనమ్మకానికి చిన్నారి బలి
కరకగూడెం: మూఢ నమ్మకం రెండు నెలల చిన్నారిని బలిగొన్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. కరకగూడెం మండలం అశ్వాపురపాడు వలస ఆదివాసీ గ్రామాని కి చెందిన పొడియం దేవయ్య, సంగీత దంపతులకు రెండు నెలల క్రితం బాబు జన్మించాడు. సోమవారం రాత్రి నుంచి చిన్నారి కడుపునొప్పితో బాధపడుతుండగా.. వైద్యుని వద్దకు వెళ్లకుండా అదే గ్రామంలోని ఓ వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లారు. అతడు బాబు బొడ్డు చుట్టూ కొరకడంతోపాటు పసరు మందు వేశాడు. దీంతో మంగళవారం ఉదయం గ్రామానికి వెళ్లిన ఆశ కార్యకర్త అనారోగ్యంగా ఉన్న బాబుని గుర్తించి వెంటనే తల్లిదండ్రులతో కలసి కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ బాబు మృతి చెందాడు. -
అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్ హుష్‌కాకి
బిస్కెట్ల డబ్బా తీసుకుని దాక్కుని తింటూ కూర్చున్న చిన్నారి వీడియో మురిపిస్తోంది. తనను గమనించిన తండ్రి వచ్చి చూడగా ఆ చిన్నారి ముసిముసిగా నవ్వుతూ బిస్కెట్ తింటుండడం నవ్వులు తెప్పిస్తోంది. ఆ చిన్నారి బిస్కెట్ల డబ్బా దొంగతనం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఎక్కడి వీడియో తెలియదు కానీ పాప పేరు మాత్రం డైలీన్. కూతురిని పిలుస్తూ తండ్రి ‘డైలీన్ ఎక్కడ’ అంటూ వీడియో తీసుకుంటూ వెతుకు డైనింగ్ టేబుల్ పక్కన ఉన్న టేబుల్ వద్దకు వచ్చాడు. చదవండి: ‘నా కోడిది హత్య.. న్యాయం చేయండి’ మాజీ ఎమ్మెల్యే తనయుడు ఆ టేబుల్ పక్కన చిన్నారి ఒరియో బిస్కెట్ జాడీతో కనిపించింది. పాపను చూసి ఆ తండ్రికి నవ్వాగలేదు. తండ్రిని చూసిన డైలీన్ చిన్న నవ్వు నవ్వింది. అది అందరినీ ఆకట్టుకుంటోంది. ముసిముసి నవ్వు హృదయాలను పిండేస్తోంది. ‘ఏం చేస్తున్నావ్ డైలీన్? ఏం చేస్తున్నవ్’ అని రెండు మూడుసార్లు అడిగాడు. ఆ పాప నవ్వుతూ బిస్కెట్ నోట్లో పెట్టేసుకుంది. ‘ఇక చాలు. నీకు అన్నేసి బిస్కెట్లు అవసరం లేదు’ అని తండ్రి చెబుతున్నా పాప పట్టించుకోలేదు. ఈ సందర్భంగా తండ్రికి చేయి చాపి ఏదో చెప్పబోయింది. రెండేళ్ల పాప బిస్కెట్ల దొంగతనం వీడియోను అప్వర్తీ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించింది. చదవండి: నీట్ బలిపీఠంపై మరో మరణం: సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి ఈ వీడియో నెటిజన్లను మురిసిపోయేలా చేసింది. చిన్నారి బోసినవ్వు హృదయానికి హాయి కల్పించేలా ఉంది. పాప అందంగా.. ఫన్నీ ఉందని ఒకరు కామెంట్ చేయగా.. ‘పాప నవ్వుకు నేను ఫిదా అయిపోయా’ అంటూ మరొకరు తెలిపాడు. మీరు కూడా ఆ పాప నవ్వు చూసేయండి. ఉన్న స్ట్రెస్సంతా మాయమైపోతుంది. View this post on Instagram A post shared by Upworthy (@upworthy) -
బిడ్డను చూస్తూ ఉండమంటే.. కిడ్నాప్, కథ సుఖాంతం
సాక్షి, తిరుపతి: తిరుపతిలో 4 నెలల పసికందు అపహరణ కేసును అలిపిరి పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసిన యాచకురాలు ఆశని అరెస్టు చేశారు. ఈనెల 2వ తేదీన బాలాజీ బస్టాండ్ దగ్గర గంగులమ్మ తన నాలుగు నెలల మగబిడ్డను స్నానం చేసి వస్తా.. కొద్దిసేపు చూస్తూ ఉండు అని ఆశకు అప్పగించింది. స్నానం చేసి వచ్చిచూసేసరికి తన బిడ్డతో పాటు ఆశ కూడా కనిపించలేదు. అంతటా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు నిందితురాలు ఆశ మైసూరులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. -
వైద్యుల నిర్వాకం: బతికున్నా చంపేశారు..!
సాక్షి, చెన్నై: పుట్టిన శిశువు ఊపిరి ఆడక మరణించినట్లు తేని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. అయితే అంత్యక్రియల సమయంలో శిశువులో కదలికలు రావడంతో అదే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తేని జిల్లా పెరియకుళం సమీపంలోని తామరైకుళానికి చెందిన రాజ, ఆరోగ్య మేరి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడో సారి ఆరోగ్య మేరి గర్భం దాలి్చంది. ఆరో నెల పూర్తి కావస్తున్న తరుణంలో శనివారం ఆమెకు పురుటి నొప్పులు వచ్చాయి. తేని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ఆమెకు ఆడ బిడ్డ పుట్టింది. అయితే బిడ్డ బరువు 200 గ్రాములే ఉండడంతో వెంటిలేటర్ చికిత్సలో ఉంచారు. ఆదివారం వేకువ జామున 3.30 గంటలకు శ్వాస అందకుండా ఆ శిశువు మరణించినట్లు వైద్యులు తేల్చారు. మృతదేహాన్ని ప్యాకింగ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. శిశువును కాసేపు ఇంటి వద్ద ఉంచి, ఆ తర్వాత సమీపంలోని క్రైస్తవ శ్మశాన వాటికలో ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కమ్రంలో శిశువులో కదలికలు రావడంతో హుటాహుటిన అదే ఆస్పత్రికి తరలించారు. శిశువు ప్రాణాలతోనే ఉన్నట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి డీన్ బాలాజీ నాథన్ మాట్లాడుతూ.. బిడ్డను సరిగ్గా పరీక్షించకుండా మరణించినట్లు నిర్ధారించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. -
విషాదం: చిన్నారి నీటి తొట్టిలో పడి..
సాక్షి, చిత్తూరు: తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ చిన్నారి ఆడుకుంటూ నీటి తొట్టిలో పడిపొయింది. ఎవరు చూడకపోవటంతో చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. వివారాల్లోకి వెళితే.. తిరుమల బాలాజీనగర్‌లోని 689 నెంబర్ గల ఇంటిలో భాను ప్రకాష్, జయంతి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం పెద్దపాప శశికళ ఆడుకుంటూ ఇంట్లో ఉన్న నీటి తొట్టిలోకి జారి పడిపోయింది. పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఊరంగా గాలించగా, ఎంతకీ చిన్నారి ఆచూకీ లభించలేదు. చదవండి: అరుణ మృతదేహం లభ్యం; రైతుల ఆవేదన చివరకి ఇంట్లో ఉన్న నీటి తొట్టిలో అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందిందని ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మరణంతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. పాప తండ్రీ భాను ప్రకాష్ సొంత ఊరు చిత్తూరు జిల్లాలోని మెత్తకుప్పం. అక్కడి నుంచి బతుకు తెరువు కోసం తిరుమలకు వచ్చి ఓ దుకాణంలో పని చేస్తు ఇక్కడే జీవిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చిన్నారి మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. -
పసిపాపను అమ్మకానికి పెట్టిన అమ్మమ్మ
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని పసిపాప శుక్రవారం అమ్మకాన్ని గురైంది. వీణవంక మండల కేంద్రంలో నాలుగు నెలల పసికందును అమ్మమ్మ అమ్మేసింది. పసిపాపను పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన తిరుపతమ్మ సంపత్ దంపతులు లక్షా పదివేలకు కొనుగోలు చేసినట్లు తేలింది. పసిపాప కనిపించకపోయేసరికి తల్లి పద్మ నిలదీయడంతో పాపను అమ్మిన విషయాన్ని పద్మ తల్లి కనకమ్మ తెలిపింది. దీంతో పసి పాప తల్లి తన భర్త రమేష్ కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి అత్తతో గొడవ పడ్డారు. ఈ విషయంపై స్థానికులు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా పసిపాప అమ్మకం బయటపడింది. పసిపాపను మళ్ళీ తల్లి చెంతకు చేర్చారు విక్రయించిన అమ్మమ్మ కనకమ్మ ను, కొనుగోలు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పిల్లలను అమ్మిన కొన్న నేరమని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు అంటున్నారు. -
వీడసలు మనిషేనా... పసికందుని ఆటోకేసి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్టలో దారుణం చోటుచోసుకుంది. భార్యభర్తల గొడవల కారణంగా ఓ వ్యక్తి విచక్షణ కోల్పొయి రాక్షసుడిగా ప్రవర్తించాడు. తన భార్యపై కోపాన్ని పసికందుపై చూపించాడో కసాయి తండ్రి. ఓ వ్యక్తి నెలల పసికందుని అత్యంత పాశవికంగా ఆటోకేసి కొట్టాడు. పోలీసుల ఎదుటే ఈ దాష్టికానికి ఒడిగట్టడంతో స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. గత కొంత కాలంగా శివగౌడ్ తన భార్య దుర్గాను వేధిస్తున్నాడు. ఆదివారం భార్యాభర్తలు గొడవ పడగా.. ఇంట్లో ఉన్న నెలల చిన్నారిని ఆవేశంగా బయటకు తీసుకొచ్చి శివగౌడ్ అక్కడే ఉన్న ఆటోకేసి కొట్టాడు. ఈ ప్రమాదంలో చిన్నారి అపస్మారకస్థితిలో వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శివగౌడ్ పరారీలో ఉన్నాడు. -
మానవత్వం మరచి..
– అట్టపెట్టలో మృతశిశువును వదిలేసి వెళ్లిన తల్లిదండ్రులు – పోలీసుల సహకారంతో అంత్యక్రియలు అనంతపురం సెంట్రల్ : మానవత్వం మరచి నాలుగు రోజుల కిందట జన్మించిన ఆడశిశువు అనారోగ్యంతో మృతి చెందితే కనీసం ఖననం కూడా చేయకుండానే ఓ అట్టపెట్టెలో మృతదేహాన్ని పెట్టి మురుగునీటి కాలువ పక్కన వదిలేసి వెళ్లిన ఉదంతమిది. అనంతపురం రామ్‌నగర్ రైల్వే వంతెన సమీపంలో గురువారం ఉదయం జరిగిన ఘటనకు సంబంధించి నాల్గో పట్టణ ఎస్ఐ శ్రీరామ్ కథనం మేరకు.. ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ దంపతులు నాలుగు రోజుల కిందట అనంతపురం పెద్దాస్పత్రిలో చేరారు. కుమార్తె పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స తీసుకున్నారు. అయితే పరిస్థితి విషమించి పసికందు మృతి చెందింది. పేదరికంతో ఆ తల్లిదండ్రులు మృతశిశువును ఖననం చేయకుండానే అట్టపెట్టెలో పెట్టి వదిలేసి వెళ్లిపోయారు. మృతశిశువును స్వాదీనం చేసుకుని సంజీవని రక్తదాతల సంస్థ నిర్వాహకుడు రమణారెడ్డి సహకారంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఘటనకు కారణమైన దంపతులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన ఎస్ఐ వారిని తీవ్రంగా మందలించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
పాపం.. పసివాడు
నవమాసాలు పెంచి పురిటినొప్పులు భరించి జన్మిచ్చిన అమ్మా ఇలా వదిలేశావేమమ్మా ఏమి ముంచుకొచ్చింది ముప్పు ఏమి చేశావ్ అంత తప్పు చూశావు కదా నా రూపం అనిపించలేదా అయ్యో పాపం.. చీరాల: ఏ తల్లి కన్నబిడ్డో తెలియదు.. తెల్లగా, బొద్దుగా, అందంగా ఉన్నాడు. తల జుత్తు నల్లగా నిగనిగలాడిపోతోంది. చూస్తేనే ముద్దాడాలనిపిస్తోంది. కానీ మహరాజులా ఉన్న పండంటి బిడ్డ చీరాల బస్టాండు వద్దనున్న గార్డెన్ పక్కన మూత్ర విసర్జన చేసే ప్రాంతంలో శుక్రవారం ఏడుస్తూ కనిపించాడు. గార్డెన్ సిబ్బంది పరుగుపరుగున అక్కడకు వెళ్లారు. కన్నతల్లి కనిపిస్తుందేమో.. నాన్న వచ్చి బిడ్డను చేతుల్లోకి తీసుకుంటాడేమోనని గమనించారు. కానీ ఎంత సేపటికీ ఆ మగ బిడ్డకోసం ఎవరూ రాలేదు. ఇక విషయం అర్థం అరుుంది. ఎవరో కావాలనే బాబును అక్కడ వదిలి వెళ్లారని. బుజ్జారుుకి కనీసం బొడ్డు తాడు కూడా ఊడలేదు. ఈ దృశ్యం చూసిన కొంతమంది కళ్లలో నీళ్లు తిరిగారుు. మానవత్వం ఉన్నవారు మౌనంగా రోదించారు. పుట్టిన మూడు రోజులకే ఆ పసివాడు పడుతున్న కష్టాలకు చలించారు. చలికి వణుకుతున్న బాబును స్థానికులు అక్కున చేర్చుకొని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందించి బాబు అరోగ్యంగా ఉన్నాడని పేర్కొన్నారు. ఆ బిడ్డను పెంచుకుంటామంటూ చాలా మంది ముందుకొచ్చినా.. వైద్యులు నిరాకరించారు. ఐసీడీఎస్ ద్వారా ఒంగోలులోని చైల్డ్ సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని తెలిపారు. -
ఆడపిల్లని తెలిస్తే.. అబార్షన్!
ఆడపిల్లంటే మరో అమ్మ.. సృష్టికి మూలం.. ఇంటికి దీపం. కానీ, ఆడపిల్లను చిన్నచూపు చూస్తోంది నేటి సమాజం. సాకలేక, పెళ్లి చేయలేక భారంగా భావిస్తోంది. కడుపులో ఉండగానే ఉసురుతీస్తోంది. క్లినిక్‌లు, ఆస్పత్రుల్లో భ్రూణ హత్యలు నిత్యకృత్యమైనా పట్టించుకునే నాథుడే లేడు. భువనగిరి డివిజన్లో వెలుగు చూస్తున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. భువనగిరి, న్యూస్‌లైన్ జిల్లాలోని భువనగిరి డివిజన్ కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆడ శిశువుల మరణాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గిరిజన కుటుంబాల్లో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. స్కానింగ్‌లో ఆడపిల్లని తేలితే వెంటనే అబార్షన్ చేయిస్తున్నారు. గత వారంలో మూడు రోజుల వ్యవధిలోనే రెండు ఆడ శిశివుల మృతదేహాలు లభ్యం కావడమే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న భువనగిరి డివిజన్లో భ్రూణ హత్యలు ని త్యకృత్యమయ్యాయి.ఆస్పత్రులతో పాటు క్లిన్క్లలోనూ పెద్ద ఎత్తున అబార్షన్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పత్రికల్లో వచ్చినప్పుడే హడావుడి ఆడి శిశవుల మరణాలపై పత్రికల్లో వచ్చినప్పుడే అధికారులు హడావుడి చేసి ఆ తరువాత మిన్నకుండా ఉంటున్నారనే విమర్శలున్నాయి. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆస్పత్రుల్లో మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తున్నారే తప్ప బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. తూతూ మంత్రంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ వెళ్లిపోతున్నారనే కానీ సమస్యకు పరిష్కారం చూపడం లేదు. చీకటిమాటున జరుగుతున్న భ్రూణహత్యలను నిలువరించి ఆడపిల్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే కాకుండా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలపైనా ఉంది. కారణం ఏమంటే... పేదరికంతో పాటు నిరక్షరాస్యత భ్రూణ హత్యలకు కారణమని తెలుస్తోంది. ఆడపిల్ల పుడితే సాకాలి, పెళ్లి చేయాలనే దురాలోచనలో కొందరు, వంశోద్ధారకుడి కోసం మరికొందరు మహిళలకు అబార్షన్లు చేయిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఆడపిల్లలు పుట్టిన తర్వాత అమ్మకానికి పెడుతున్నారు. గతంలో తుర్కపల్లి, బొమ్మలరామారం, భువనగిరి, బీబీనగర్ తండాల్లో అబార్షన్లు జరిగిన సంఘటనలు వెలుగుచూడగా తాజాగా భువనగిరి పట్టణంలో వెలుగు చూడడం చర్చనీయాంశమైంది. డివిజన్లోని మరికొన్ని గ్రామాల్లోనూ గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు జరుగుతున్నట్లు సమాచారం. రూ.10 వేల నుంచి రూ.20వేలు.. అనుభవం ఉన్న ఆర్ఎంపీలు గ్రామాల్లో ఆస్పత్రులు, క్లినిక్‌లు ఏర్పాటు చేసి మహిళలకు నిబంధనలకు విరుద్ధంగా స్కానిం గ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్‌కు సిద్ధమవుతున్నారు. ప్రజల అమాయకత, నిరక్షరాస్యత, పేదరికాన్ని వీరు ఆసరా చేసుకొని లక్షలు గడిస్తున్నారు. ఒక్కో అబార్షన్‌కు రూ.10 వేల నుంచి రూ. 20 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. -
‘బంగారుతల్లి’ని చిదిమేశారు..
నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్: భారమనుకున్నారో.. భరించలేమనుకున్నారో.. చేసిన తప్పుకు సాక్షిగా నిలుస్తుందనుకున్నారో తెలియదు కానీ అభంశుభం తెలియని బంగారు తల్లిని బలి గొన్నారు. నెలలైనా నిండకుండానే.. కళ్లు తెరవకముందే ఆడశిశువును చిదిమేశారు. ఆపై ముళ్లపొదల్లో పడేశారు. అందరినీ కలచివేసిన ఈ సంఘటన నిర్మల్ మండలం గంజాల్ గ్రామ సమీపంలో జరిగింది. సోన్ ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నారుు. గంజాల్ గ్రామంలో తోట పెద్దమల్లయ్యకు చెందిన పశువుల పాక సమీపంలోని ముళ్లపొదల్లో మంగళవారం నెలలు నిండని పసికందు మృతదేహం లభ్యమైంది. చేను వద్దకు వెళ్లిన మల్లయ్యకు ముళ్లపొదల్లో ఆడశిశువు మృతదేహం కనిపించడంతో సర్పంచ్‌కు సమాచారం అందించాడు. సోన్ నీటి సంఘం అధ్యక్షుడు మొరుునుద్దీన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై వెంకటేశ్‌కు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముళ్లపొదల్లో చీమలు పట్టి ఉన్న శిశువు మృతదేహాన్ని చూసిన ప్రతీఒక్కరూ కంటతడి పెట్టారు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించామని, శిశువు సోమవారం జన్మించి ఉండొచ్చని ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియూల్సి ఉందని పేర్కొన్నారు.