
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని పసిపాప శుక్రవారం అమ్మకాన్ని గురైంది. వీణవంక మండల కేంద్రంలో నాలుగు నెలల పసికందును అమ్మమ్మ అమ్మేసింది. పసిపాపను పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన తిరుపతమ్మ సంపత్ దంపతులు లక్షా పదివేలకు కొనుగోలు చేసినట్లు తేలింది. పసిపాప కనిపించకపోయేసరికి తల్లి పద్మ నిలదీయడంతో పాపను అమ్మిన విషయాన్ని పద్మ తల్లి కనకమ్మ తెలిపింది. దీంతో పసి పాప తల్లి తన భర్త రమేష్ కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి అత్తతో గొడవ పడ్డారు.
ఈ విషయంపై స్థానికులు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా పసిపాప అమ్మకం బయటపడింది. పసిపాపను మళ్ళీ తల్లి చెంతకు చేర్చారు విక్రయించిన అమ్మమ్మ కనకమ్మ ను, కొనుగోలు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పిల్లలను అమ్మిన కొన్న నేరమని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment