సాక్షి, హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్టలో దారుణం చోటుచోసుకుంది. భార్యభర్తల గొడవల కారణంగా ఓ వ్యక్తి విచక్షణ కోల్పొయి రాక్షసుడిగా ప్రవర్తించాడు. తన భార్యపై కోపాన్ని పసికందుపై చూపించాడో కసాయి తండ్రి. ఓ వ్యక్తి నెలల పసికందుని అత్యంత పాశవికంగా ఆటోకేసి కొట్టాడు. పోలీసుల ఎదుటే ఈ దాష్టికానికి ఒడిగట్టడంతో స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. గత కొంత కాలంగా శివగౌడ్ తన భార్య దుర్గాను వేధిస్తున్నాడు. ఆదివారం భార్యాభర్తలు గొడవ పడగా.. ఇంట్లో ఉన్న నెలల చిన్నారిని ఆవేశంగా బయటకు తీసుకొచ్చి శివగౌడ్ అక్కడే ఉన్న ఆటోకేసి కొట్టాడు. ఈ ప్రమాదంలో చిన్నారి అపస్మారకస్థితిలో వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శివగౌడ్ పరారీలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment