వినూత్న చిత్రాలే చేస్తా: రాజశేఖర్ | 'Gaddam Gang' was a challenging remake for actor Rajasekhar | Sakshi
Sakshi News home page

వినూత్న చిత్రాలే చేస్తా: రాజశేఖర్

Published Sun, Nov 16 2014 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

వినూత్న చిత్రాలే చేస్తా: రాజశేఖర్

వినూత్న చిత్రాలే చేస్తా: రాజశేఖర్

 ‘‘తమిళ చిత్రం ‘సూదు కవ్వమ్’ నచ్చడంతో, ఈ రీమేక్‌లో చేయడానికి ఒప్పుకున్నాను. మూస చిత్రాలు చేయడం ఇష్టం లేకే ఈ మధ్య గ్యాప్ తీసుకున్నాను. ఈ చిత్రం భిన్నంగా ఉంటుంది. ఇకనుంచి ఈ తరహా చిత్రాలే చేస్తా’’ అని రాజశేఖర్ అన్నారు. పి. సంతోష్ దర్శకత్వంలో రాజశేఖర్, షీనా జంటగా జీవితారాజశేఖర్ నిర్మించిన చిత్రం ‘గడ్డం గ్యాంగ్’. అచ్చు స్వరపరచిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.  కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సీడీని ఆవిష్కరించి టి.సుబ్బరామిరెడ్డికి ఇచ్చారు. ఈ వేడుకలో బీజేపీ నేత కిషన్‌రెడ్డితో పాటు సాయికుమార్, పోకూరి బాబురావు తదితర చిత్రరంగ ప్రముఖులు అతిథులుగా పాల్గొని, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. జీవితారాజశేఖర్ మాట్లాడుతూ- ‘‘ఈ మధ్యకాలంలో మేం నిర్మించిన చిత్రాలు మాకు నష్టాన్నే మిగిల్చాయి. చిత్రబృందం అంతా కష్టపడి ఈ సినిమా చేశాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement