
యష్, షీనా
మాదక ద్రవ్యాలు, మద్యపానం బారిన పడి నలుగురు యువకులు తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘భాగ్యనగరం’. యష్, ‘బిందాస్’ ఫేమ్ షీనా జంటగా కె.వి.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజధాని’. కన్నడలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని సంతోష్ కుమార్ ‘భాగ్యనగరం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
సంతోష్ కుమార్ మాట్లాడుతూ– ‘‘వినోదానికి సందేశాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది. ఓ డబ్బింగ్ సినిమా చేసి, తర్వాత స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలనే ఆలోచనతో ఈ సినిమా విడుదల చేస్తున్నా’’ అన్నారు. ‘‘చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ ఆలోచన రేకెత్తించేదే ఈ చిత్రం. మంచి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు డి.ఎస్ రావు.
Comments
Please login to add a commentAdd a comment