Rajadhani
-
వరద నీటిలో ఏపీ రాజధాని అమరావతి
-
ఆ రైళ్లలో భోజనం ధరలు పెంపు
న్యూఢిల్లీ: శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లలో ప్రయాణీకులకు అందించే టీ, టిఫిన్, భోజనం ధరలను పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మూడు రైళ్లలో మీల్స్ ధరలు పెరిగిన నేపథ్యంలో వాటి టికెట్ ధరలలో సైతం స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీటిల్లో ప్రయాణించే వారు మీల్స్‌ను ఎంపిక చేసుకున్న నేపథ్యంలో వారి టికెట్ ధరలపై 3 నుంచి 9 శాతం వరకు పెరుగుదల ఉండనుంది. పెరిగిన కేటరింగ్ చార్జీలు వచ్చే ఏడాది మార్చి 29 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే బోర్డు పేర్కొంది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ మూడు రైళ్లలో ఫస్ట్ క్లాస్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లలో టీ ధర రూ.15 నుంచి రూ.35కి, బ్రేక్‌ఫాస్ట్ ధర రూ.90 నుంచి రూ.140కి, లంచ్, డిన్నర్ ధరలు రూ.140 నుంచి రూ.245కి పెరగనున్నాయి. సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీ, చైర్ కార్లలో ఉదయం టీ ధర రూ.10 నుంచి రూ.20కి, సాయంత్రం టీ ధర రూ.45 నుంచి రూ.90కి, బ్రేక్‌ఫాస్ట్ ధర రూ.70 నుంచి రూ.105కి. లంచ్, డిన్నర్ ధరలు రూ.120 నుంచి రూ.185కి పెరగనున్నాయి. -
రాజధానిపై భిన్నస్వరాలు
-
టీడీపీ నేతలు.. రాజధానిపై విష ప్రచారం
సాక్షి, తుళ్లూరు: రాజధానిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే విష ప్రచారం జరుగుతుందని రాజధాని రైతులు మండిపడ్డారు. మంగళవారం మండల పరిధిలోని లింగాయపాలెం గ్రామంలో రాజధాని రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజధాని రైతు శృంగారపాటి సందీప్ మాట్లాడుతూ రాజధానిలో టీడీపీ నేతలు చేసిన అవినీతి, భూ దందాలు వెలుగులోకి రాబోతున్నాయనే భయంతోనే ప్రజల దృష్టిని మరల్చ డానికి రాజధాని రైతుల్ని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల రాజధానిలో భూములు ధరలు భారీ స్థాయిలో తగ్గిపోయాయని.. రాజధాని రైతులు టీడీపీ నేతల తీరు వల్ల మానసికంగా కుంగిపోతున్నారన్నారు. రాజధాని రైతులకు ఏమైనా జరిగితే టీడీపీ నేతలు, చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. టీడీపీ నేతలు పద్ధతి మార్చుకోకుంటే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాజధాని అభివృద్ధి చేస్తారనే నమ్మకం రాజధాని ప్రజలకు పూర్తిగా ఉందన్నారు. అనంతరం మరో రైతు తుమ్మూరు రమణారెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్నారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్, ఆయన బినామీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి లోకేష్ బినామీ వేమూరి రవికుమార్, జీవీ ఆంజనేయులు, కొమ్మలపాటి శ్రీధర్, మరికొంత మంది రాజధాని ప్రకటనకు ముందే రాజధానిలో భూములు కొనుగోలు చేశారన్నారు. వీటికి సంబంధించి తేదీలు, డాక్యుమెంట్ నంబర్లు అన్నీ ఆధారాలు ఉన్నాయని చెప్పారు. సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాజధాని రైతులకు కౌలు చెక్కుల నిధులు విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజధాని రైతులు బత్తుల కిషోర్, కొండేపాటి సతీష్ చంద్ర, పొన్నూరి నాగేశ్వరరావు, ఆరేపల్లి జోజి, వెంగళరెడ్డి, మాదల మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
వినోదం.. సందేశం
కన్నడ రైజింగ్ స్టార్ యష్, ‘బిందాస్’ ఫేమ్ షీనా జంటగా కె.వి.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజధాని’. ప్రకాష్‌రాజ్, తులసి ముఖ్య పాత్రలు చేశారు. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘భాగ్యనగరం’ పేరుతో సంతోష్ కుమార్ అక్టోబర్ 5న తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ముందు ఓ మంచి డబ్బింగ్ సినిమా చేసి, తర్వాత స్ట్రెయిట్ సినిమా చేయాలనే ఆలోచనలో భాగంగా ‘భాగ్యనగరం’ సినిమా విడుదల చేస్తున్నా. మా బ్యానర్‌కి ఈ చిత్రం చక్కని శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. వినోదానికి సందేశాన్ని జోడించి రూపొందిన ఈ చిత్రం కన్నడలో కంటే తెలుగులో పెద్ద విజయం సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాం. డ్యాన్సింగ్ సెన్సేషన్ ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్ చేశారు’’ అన్నారు. ‘‘యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాలు, మద్యపానం వంటి దుష్పరిణామాలను ఎత్తి చూపుతూ.. ఆలోచన రేకెత్తించే చిత్రం ‘భాగ్యనగరం’. ఇలాంటి మంచి సినిమాను పంపిణీ చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు డి.ఎస్.రావు. -
నలుగురు యువకుల కథ
మాదక ద్రవ్యాలు, మద్యపానం బారిన పడి నలుగురు యువకులు తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘భాగ్యనగరం’. యష్, ‘బిందాస్’ ఫేమ్ షీనా జంటగా కె.వి.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజధాని’. కన్నడలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని సంతోష్ కుమార్ ‘భాగ్యనగరం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ– ‘‘వినోదానికి సందేశాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది. ఓ డబ్బింగ్ సినిమా చేసి, తర్వాత స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలనే ఆలోచనతో ఈ సినిమా విడుదల చేస్తున్నా’’ అన్నారు. ‘‘చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ ఆలోచన రేకెత్తించేదే ఈ చిత్రం. మంచి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు డి.ఎస్ రావు. -
మల్లె తోట తొలగించిన సీఆర్డీయే అధికారులు
అమరావతి: రాజధాని ప్రాంతంలోని నిడమర్రులో సీఆర్డీయే అధికారులు పొక్లయిన్లతో మల్లె తోటను తొలగించారు. పాతికేళ్లుగా తోటను నమ్ముకుని బతుకుతున్నామని, తొలగించవద్దంటూ రైతు రామిరెడ్డి వేడుకున్నా అధికారులు కనికరించలేదు. భూమి యజమాని రాజధానికి భూమి ఇచ్చాడంటూ తోటను ధ్వంసం చేశారు. -
భూసేకరణకు తుది నోటిఫికేషన్ విడుదల
అమరావతి: రాజధానిలో భూసేకరణకు తుది నోటిఫికేషన్ విడుదల అయింది. తాడేపల్లి మండలం పెనుమాకకు సంబంధించి 187ఎకరాల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే తుళ్లూరు మండలం కొండమరాజుపాలెంలో 32 ఎకాలకు నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 210 కుటుంబాలు ప్రభావితం అవుతాయని ఆ నోటిఫికేషన్లో ప్రభుత్వం వెల్లడించింది. -
రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ దందా
-
‘రాజధాని’ ఏసీ కోచ్ బస్ ప్రారంభం
సిరిసిల్ల: సిరిసిల్ల ఆర్టీసీ డిపోకు మంజూరైనా ‘రాజధాని’ ఏసీ కోచ్ బస్‌ను గురువారం ప్రారంభించారు. సిరిసిల్ల నుంచి సికింద్రాబాద్ వరకు నిత్యం హైదరాబాద్‌కు బస్సు ట్రిప్పులను ప్రారంభించినట్లు ఆర్టీసీ డీఎం వెంకటరమణ తెలిపారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ చొరవతో ఈ బస్సు మంజూరైనట్లు టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, ‘సెస్’ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, ఏఎంసీ చైర్మన్ జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ తవుటు కనకయ్య, ‘సెస్’ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, కౌన్సిలర్ గడ్డం లత, జాగృతి జిల్లా కో కన్వీనర్ జూపల్లి నాగేందర్రావు, ఆర్టీసీ యూనియన్ నాయకులు జీ.పి.సింగ్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.