agni 5 missile
-
‘అగ్ని’ అగర్వాల్ ఇక లేరు
భారత్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పెస్ ఇంజనీర్ రామ్ నారాయణ్ అగర్వాల్ ఇక లేరు. 84 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని నివాసంలో గురువారం(ఆగస్టు 15) ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. భూతల (surface-to-surface missile) క్షిపణి.. భారత క్షిపణుల్లో మణిహారంగా పేర్కొనే ‘అగ్ని’ని రూపొందించడంలో ఈయనదే ప్రముఖ పాత్ర. అందుకే ఆర్ఎన్ అగర్వాల్‌ను ఫాదర్ ఆఫ్ ది అగ్ని సిరీస్ ఆఫ్ మిస్సైల్స్‌గా పిలుస్తుంటారు.రామ్ నారాయణ్ అగర్వాల్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో వ్యాపారుల కుటుంబంలో జన్మించారు. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం ప్రోగ్రాం డైరెక్టర్‌గా (AGNI), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లాబొరేటరీ డైరెక్టర్‌గా పనిచేశారు.అగర్వాల్ 1983 నుంచి అగ్ని ప్రయోగానికి నాయకత్వం వహించారు. 33 ఏళ్ల క్రితం మే 22 1989న.. ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్న అగర్వాల్.. తన బృందంతో కలిసి 1000 కిలోల పేలోడ్‌తో 800 కి.మీపైగా అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ఒడిశా తీరంలోని బాలాసోర్‌లోని చండీపూర్‌లో ప్రయోగించారు.రక్షణ రంగంలో ఈయన చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ, 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. దేశ రక్షణ కోసం అవిరామంగా కృషి చేసిన అగర్వాల్.. స్వాతంత్ర దినోత్సవం నాడే కన్నుమూయడం గమనార్హం. AgniWall, the father of India’s Agni missile (ICBM), R N Agarwal passes away on Independence Day today in Hyderabad. pic.twitter.com/eiRnEk1fi1— M Somasekhar (@Som_mulugu) August 15, 2024 ఆర్ ఎన్ అగర్వాల్ మృతితో.. దేశం ఓ గొప్ప సైంటిస్ట్‌ను కోల్పోయింది. అగ్ని క్షిపణి కోసం అగర్వాల్ విశేషంగా పని చేశారు. తన కృషిని విస్తృతస్థాయికి తీసుకెళ్లి.. వేరుర్వేరు క్షిఫణుల తయారీకి దోహదపడ్డారు. క్షిపణి రంగంలో అనేక వ్యవస్థలను ఏర్పాటు చేశారాయన. ::: జి. సతీష్‌రెడ్డి, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, డీఆర్డీవో మాజీ చైర్మన్ -
‘మిషన్ దివ్యాస్త్ర’ని విజయవంతం చేసిన 'దివ్యపుత్రి'!
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ‘మిషన్ దివ్యాస్త్ర (Mission Divyastra)’ పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన ‘అగ్ని-5 (Agni-5 MIRV)’ క్షిపణిని తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు కూడా. ఈ అగ్ని-5 క్షిపణి విజయవంతం వెనకు ఉన్న మహిళ మన హైదరాబాద్ డీఆర్డీవోలో పనిచేస్తున్న ల్యాబరేటరీ శాస్త్రవేత్త. ఇంతకుమునుపు ఇలాంటి క్షిపణి వ్యవస్థలపై పనిచేసి 'అగ్ని పుత్రి'గా పేరుగాంచిన టెస్సీ థామస్ అడుగుజాడల్లో వచ్చిన మరో శక్తిమంతమైన 'దివ్యపుత్రి' ఈమె!. ఈ 'మిషన్ దివ్యాస్త్ర' ప్రాజెక్టుకు దేశంలోని మన హైదరాబాద్ క్షిపణి కాంప్లెక్స్‌కు చెందిన మహిళా శాస్త్రవేత్త షీనా రాణీ నాయకత్వం వహించారు. ఆమె 1999 నుంచి ఈ అగ్నిక్షిపణి వ్యవస్థలపై పనిచేస్తున్నారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్వీ) సాంకేతికతతో కూడిన అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించి ఈ ఏడాదికి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)కి కీర్తి కీరిటంగా నిలిచారు షీనా రాణి. అందువల్ల ఆమెను భారత రక్షణ పరిశోధన సంస్థ ఆమెను 'దివ్యపుత్రి'గా అభివర్ణించింది. ఆమె చాలమటుకు ఈ అగ్ని సీరిస్ క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిండంతో షీనా రాణిని 'పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ'గా పిలుస్తారు. ఈ 57 ఏళ్ల షీనా రాణి హైదరాబాద్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) అడ్వాన్స్డ్ సిస్టమ్ లాబొరేటరీలో శాస్త్రవేత్త. ఆమె తిరువనంతపురం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత విక్రమ సారాభాయ స్పేస్ సెంటర్(వీఎస్ఎస్సీ)లో ఎనిమిదేళ్లు పనిచేసింది. 1998లో పోఖ్రాన్ అణు పరీక్ష తర్వాత ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహించడానికి డీఆర్డీవోలో చేరారు. ఇక 1999 నుంచి షీనా రాణి మొత్తం అగ్ని శ్రేణి క్షిపణులు ప్రయోగ నియంత్రణ వ్యవస్థలపై పని చేశారు. అయితే ఆమె కెరీర్లో మంచి తోడ్పాటునందిచింది. క్లిష్టతరమైన కాలంలో డీఆర్డీవోకి నాయకత్వం వహించిన డాక్టర్ అవినాష్ చందర్ అని చెప్పుకొచ్చారు. ఆయన ఎల్లప్పుడూ చిరునవ్వుతో కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఇష్టపడతారు. అదే తనకు ఈ అగ్ని క్షిపణి కార్యక్రమం పట్ల అంకితభావంతో ఎలా పనిచేయాలనేది నేర్పించిందని వివరించింది. ఇక ఆమె భర్త పీఎస్ఆర్ఎస్ శాస్త్రీ డీఆర్డీవోలో క్షిపణులపై పనిచేశారు. 2019లో ఇస్రో ప్రయోగించిన కౌటిల్య ఉపగ్రహానికి ఇన్చార్జ్గా కూడా ఉన్నారు. ఈ 'మిషన్ దివ్వాస్త్ర' పేరుతో ప్రయోగించిన విమాన పరీక్షను ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిర్వహించారు. ఈ అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5’కి.. ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంది. ఎంఐఆర్వీ సాంకేతికత కలిగిన ఈ ఒక్క క్షిపణి ఒకేసారి అనేక అణు వార్హెడ్లను మోహరించి, వివిధ ప్రదేశాలలో ఏకకాలంలో లక్ష్యాలను చేధించగలదు. ఈ క్షిపణిలో ఉన్న ఒకటికి మించిన వార్హెడ్ల కారణంగా శత్రు దేశాల మిసైల్ డిఫెన్ వ్యవస్థలను ఏమార్చడంతో పాటు వాటి ఖండాంతర క్షిపణి విధ్వంస దాడులను తట్టుకుని లక్ష్యాన్ని ఛేదించేగలదు. ఈ క్షిఫణిని స్వదేశీయంగా ఎంఐఆర్వీ సాంకేతికతో అభివృద్ధి చేసి భారతదేశం.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా వంటి దేశాల సరసన చేరింది. అంతేగాదు ఒకే క్షిపణి ప్రయోగంతో ఒకటికి మించిన లక్ష్యాలను ఛేదించేందుకు వీలు కల్పించడం లక్ష్యఛేదన కచ్చితత్వంతో జరిగేలా చూడటం ఈ అగ్ని 5 క్షిపణి ప్రత్యేకత. (చదవండి: నర్సు వెయిట్ లాస్ స్టోరీ..ఆ ఒక్క ఎక్స్ర్సైజ్తో జస్ట్ ఒక్క ఏడాదిలోనే..) -
మిషన్ దివ్యాస్త్ర విజయవంతం.. అభినందించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి తొలి టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైంది. మిషన్ దివ్యాస్త్రలో భాగంగా భారత రక్షణ పరిశోధనా సంస్థ (DRDO) ఈ ప్రయోగం చేపట్టింది. ఈ ప్రాజెక్టు భారత అణు నిరోధక శక్తిని పెంచే లక్ష్యంతో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్(ఎంఐఆర్వీ) పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ప్రాజెక్టు భారత అణు నిరోధక శక్తిని పెంచే లక్ష్యంతో అగ్ని-5 రేంజ్.. 7 వేల కిలోమీటర్లకు పైగా ఉండే అవకాశం ఉంది. మిషన్ దివ్యాస్త్ర విజయవంతంతో డీఆర్డీఓ శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నామని ట్వీట్ చేశారు. అగ్ని-5 క్షిపణి ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదిందించి. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి) సాంకేతికతతో డీఆర్డీవో మిస్సైల్‌ను రూపొందించింది. ఎంఐఆర్వీ సాంకేతికతతో అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం దేశం రక్షణ సంసిద్ధత, వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మిషన్ దివ్యాస్త్ర అతిపెద్ద అడ్వాన్స్డ్ వెపన్స్ సిస్టమ్‌గా తెలుస్తోంది. దీనికి దేశ భౌగోళిక స్థితిగతులను మార్చే సత్తా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎంఐఆర్వీ టెక్నాలజీతో ఒక మిసైల్‌ను ఉపయోగించి బహుళ వార్ హెడ్స్‌ను వివిధ ప్రాంతాల్లోని టార్గెట్స్‌ను ఛేదించవచ్చని పేర్కొన్నాయి. అయితే, ఈ టెక్నాలజీ కలిగిన దేశాల సంఖ్య తక్కువగా ఉండగా.. ఆయా దేశాల సరసన భారత్ సైతం చేరినట్లయ్యింది. ఈ అగ్ని-5 మిసైల్‌లో ఇండీజీనియస్ ఏవియోనిక్స్ సిస్టస్స్ ఉంటాయి. హై ఎక్యురసీ సెన్సార్ ప్యాకేజ్ ఉండడంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. -
అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఒడిశాలోని ఎపీజె అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని డీఆర్డీఓ అక్టోబర్ 27న విజయవంతంగా పరీక్షించింది. అత్యంత ఖచ్చితత్త్వంతో 5,000 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని ఈక్షిపణి కలిగి ఉంది. ఈ క్షిపణి సుమారు 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, సుమారు 50 టన్నుల బరువు కలిగి ఉంది. ఇది ఒక టన్ను కంటే ఎక్కువ అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. సరిహద్దుల్లో మరోసారి చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్న వేళ.. తాజా ప్రయోగంతో భారత్ ఆ దేశానికి గట్టి సందేశం పంపింది. హైపర్ సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్న దేశాలలో భారతదేశం ఒకటని ఇటీవల ఒక యుఎస్ కాంగ్రెస్ నివేదిక పేర్కొంది. ఈ ఖండాతర క్షిపణిని డీఆర్డీఓ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అగ్ని రకం క్షిపణిని భారత్ తొలిసారి 2012లో విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. అగ్ని-1 700 కి.మీ., అగ్ని-2 2,000 కి.మీ., అగ్ని-3 2,500 కి.మీ., అగ్ని-4 3,500 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించగల సామర్థ్యంతో రూపొందించారు. ఈ పరీక్షలన్నీ విజయవంతమయ్యాయి. అలాగే, మ్యాక్ 7 హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ 2ని భారత్ రష్యాతో కలిసి అభివృద్ది చేస్తుంది. భారతదేశం తన హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్ వెహికల్ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ, ద్వంద్వ సామర్థ్యం కలిగిన హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని కూడా అభివృద్ధి చేస్తోంది. జూన్ 2019, సెప్టెంబర్ 2020లో మ్యాక్ 6 స్క్రామ్ జెట్ ను విజయవంతంగా పరీక్షించింది. (చదవండి: ప్రజలకు రెవోస్ కంపెనీ బంపర్ ఆఫర్.. రూ.1కే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్!) -
అస్త్రశస్త్రాల సృష్టికర్త...!
న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగంలో ప్రతిష్టాత్మకమైన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త , తెలుగు తేజం గుండ్రా సతీశ్ రెడ్డి(55) నియమితులయ్యారు. ఆ పదవికి ఎంపిౖకైన పిన్న వయస్కుడిగా, మొదటి తెలుగు వ్యక్తిగా సతీష్ రెడ్డి నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా మహిమలూరు గ్రామంలో జన్మించిన ఆయన స్వయం కృషితో రక్షణ, క్షిపణి రంగంలో భారత దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రికి శాస్త్ర సలహాదారుగా, క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. డీఆర్డీఓ చైర్మన్ బాధ్యతలతో పాటు రక్షణ శాఖ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) కార్యదర్శిగానూ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సతీశ్ రెడ్డి నియమకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలపగా.. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ శనివారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చేవారం ఆయన డీఆర్డీఓ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. గత మూడు నెలలుగా డీఆర్డీఓ చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది. చైర్మన్ ఎస్.క్రిస్టోఫర్ పదవీకాలం పూర్తికావడంతో మే నుంచి ఆ బాధ్యతల్ని రక్షణ శాఖ కార్యదర్శి సంజయ్ మిత్రాకు అప్పగించారు. క్షిపణి పరిశోధనల్లో భాగస్వామి.. సైంటిఫిక్ అడ్వయిజర్‌గా, క్షిపణి వ్యవస్థలు, గైడెడ్ వెపన్స్, ఎవియానిక్స్ టెక్నాలజీలు, దేశంలోని ఎయిరోస్పేస్ టెక్నాలజీ, పరిశ్రమల అభ్యున్నతికి సతీశ్ రెడ్డి ఎంతో కృషి చేశారు. క్షిపణుల రంగంలో దేశం çస్వయం సమృద్ధిని సాధించేందుకు అవసరమైన పరిశోధనల్లో, దేశీయ విధానాల రూపకల్పనలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. క్షిపణులు, స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్‌గా దేశ రక్షణ పరిశోధన కేంద్రాలైన ఏఎస్ఎల్, డీఆర్డీఎల్, ఆర్సీఐ, ఐటీఆర్, టీబీఆర్ఎల్ను సాంకేతికంగా ఎంతో ముందుకు తీసుకెళ్లారు. వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించడంతోపాటు æ సైనికదళాల కోసం స్వదేశీ సాంకేతికతతో ఆయుధాల తయారీకి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించారు. సుదూర లక్ష్యాలను చేధించే అగ్ని–5 క్షిపణికి అవసరమైన సాంకేతికతను తయారుచేశారు. ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా భూమి పై నుంచి ఆకాశంలోకి ప్రయోగించే మధ్యంతర శ్రేణి క్షిపణులను అభివృద్ధి చేశారు. ప్రాజెక్టు డైరెక్టర్‌గా దేశీయంగా గైడెడ్ బాంబును అభివృద్ధిచేయడంతో పాటు సుదూర లక్ష్యాల చేధనకు ‘స్మార్ట్ గైడెడ్ ఆయుధాల్ని’ రూపొందించారు. లండన్‌లోని ప్రతిష్టాత్మక ఫెలో ఆఫ్ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేవిగేషన్, యూకేలోని రాయల్ ఏరోనాటికల్ సొసైటీ, రష్యాలోని ఫారెన్ మెంబర్ ఆఫ్ ద అకాడమి ఆఫ్ నేవిగేషన్ అండ్ మోషన్ కంట్రోల్ సభ్యుడిగా ఉన్నారు. దేశ, విదేశాల్లోని ప్రాధాన్యత గల వివిధ సంస్థల్లో ఆయన సేవలకు గుర్తింపుగా ఫెలోషిప్‌లు, సభ్యత్వాలు లభించాయి. ఎన్నో అవార్డులు, డాక్టరేట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రతిష్టాత్మక అవార్డుల్ని సతీశ్ రెడ్డి అందుకున్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ హోమీ జె.బాబా స్మారక బంగారు పతకం, నేషనల్ ఏరోనాటిక్స్ బహుమతి, నేషనల్ డిజైన్ అవార్డు, నేషనల్ సిస్టమ్స్ గోల్డ్‌మెడల్, ఇంజినీరింగ్ ఎక్స్‌లెన్స్‌కు ఇచ్చే ఐఈఐ–ఐఈఈఈ (అమెరికా) మొదటి జాయింట్ అవార్డు, లండన్ రాయల్ ఏరోనాటిక్స్ సొసైటీ వెండిపతకం వంటివి ఉన్నాయి. ప్రఖ్యాత డా.బీరెన్‌రాయ్ స్పేస్ సైన్స్ డిజైన్ అవార్డు, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా రాకెట్రీ అండ్ రిలేటెడ్ టెక్నాలజీస్ అవార్డును పొందారు. దేశంలోని వివిధ ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. రక్షణ, క్షిపణి పరిశోధన రంగంలో చేసిన విశేష కృషికి గాను 2015 ఏడాదికిగాను ఆయన ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డు అందుకున్నారు. మహిమలూరు నుంచి డీఆర్డీవోకు.. .సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ఆత్మకూరు రూరల్: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో గుండ్రా సీతారామిరెడ్డి, రంగమ్మ దంపతులకు 1963, జూలై 1న రెండో సంతానంగా సతీశ్ రెడ్డి జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదవగా.. నెల్లూరు వీఆర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. 1984లో అనంతపురం జేఎన్టీయూలో ఈసీఈ విభాగంలో ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యారు. మరుసటి ఏడాదే 1985లో భారత రక్షణ శాఖలో క్షిపణి రంగ పరిశోధకుడిగా చేశారు. తర్వాత కలామ్ మానసపుత్రిక ‘రీసెర్చ్ సెంటర్ ఇమారత్’(ఆర్సీఐ)లోకి మారారు. కఠోర శ్రమతో నేవిగేషన్ విభాగంలో విజయాలు అందుకున్నారు. తన అసాధారణ పరిశోధనలతో ఆగిపోకుండా 2008లో ఎంఎస్ చేశారు. 2014లో డాక్టరేట్ పట్టా పొందారు. 1986 నుంచి నేవిగేషన్ విభాగంలో అవుట్‌స్టాండింగ్ శాస్త్రవేత్తగా, ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా, అవుట్‌స్టాండింగ్ డైరెక్టర్‌గా, శాస్త్రవేత్తగా, డైరెక్టర్ జనరల్‌గా, రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారుగా అనేక హోదాల్లో పనిచేశారు. రక్షణ విభాగ పరిశోధన, అభివృద్ధి రంగాల్లో విశేషకృషి చేశారు. ఎన్నో అస్త్రశస్త్రాలను సృష్టించిన ఆయన పలువురు రాష్ట్రపతులు, ప్రధానుల నుంచి అవార్డులు పొందారు. 2014లో విశిష్ట శాస్త్రవేత్తగా, 2015లో రక్షణ మంత్రి శాస్త్ర, సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు. తాను ఏ స్థాయిలో ఉన్నా పుట్టిన ఊరిని మర్చిపోకుండా మహిమలూరును దత్తత తీసుకొని అన్ని రంగాల్లో ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. 14 ఏళ్ల క్రితమే గ్రామంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసి తన దార్శనికతను చాటుకున్నారు. భార్య పద్మావతి, అన్న గుండ్రా శ్రీనివాసుల రెడ్డి, సేవాదృక్పథం కలిగిన మరికొందరి గ్రామస్తుల సహకారంతో గ్రామంలో విద్య, వైద్య, మౌలిక రంగాల్లో పరిపూర్ణ అభివృద్ధి సాధించేందుకు పాటుపడుతున్నారు. కుమార్తె సిగ్ధ ఎలక్ట్రానిక్ ఇంజనీరుగా పనిచేస్తుండగా.. కొడుకు అనూష్ బీటెక్ చదువుతున్నారు. రక్షణ మంత్రి సలహదారుగా బిజీగా ఉండే ఆయన సమయం దొరికినప్పుడల్లా మహిమలూరులో అభివృద్ది పనుల్ని పరిశీలించటంతో పాటు యువతకు కెరీర్లో సలహలు సూచనలిస్తుంటారు. డీఆర్డీఓ చైర్మన్‌గా సతీశ్ ఎంపికతో నెల్లూరు జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ నుంచి ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డు అందుకుంటున్న సతీశ్ రెడ్డి. చిత్రంలో ‘సాక్షి’ చైర్పర్సన్ వైఎస్ భారతి (ఫైల్) జేఎన్టీయూ–కాకినాడ నుంచి గౌరవడాక్టరేట్‌ను అందుకుంటున్న సతీశ్ రెడ్డి(ఫైల్) -
అగ్ని-5 క్షిపణీ పరీక్ష విజయవంతం
సాక్షి, భువనేశ్వర్ : రక్షణ రంగంలో భారతదేశం అతి పెద్ద విజయం సాధించింది. అగ్ని-5 క్షిపణీ పరీక్ష విజయవంతమైంది. ఈ పరీక్షను ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఆదివారం డీఆర్డీఓ పరీక్షించింది. ఈ క్షిపణీని నాల్గోపాడ్ నుంచి ఉదయం 09.50కి ప్రయోగించారు. ఈ సంత్సరంలో ఆరుసార్లు విజయవంతంగా పరీక్షించారు. చివరగా ఈ సంవత్సరంలో జనవరి 18వ తేదీన ప్రయోగించినట్లు తెలుస్తోంది. 5వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను కూడా అగ్ని-5 క్షిపణీ ఛేదించగలదు. ఈ విజయంతో అమెరికా, చైనా, రష్యా సరసన భారత్ చేరింది. ఈ క్షిపణీ దాదాపుగా చైనాను కూడా కవర్ చేయగలిగే సామర్థ్యం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాజస్తాన్‌లోని థార్ ఎడారిలో మే11, 1998లో పొఖ్రాన్ న్యూక్లియర్ పరీక్షలు జరిగాయి. మే11, 2018 నాటికి న్యూక్లియర్ పరీక్ష జరిగి 20 సంవత్సరాలు పూర్తి అయింది. 1998 మే 11 తేదీల్లో రాజస్థాన్‌లోని పొఖ్రాన్ ప్రాంతంలో భారత్ ఐదు అణుపరీక్షలు నిర్వహించింది. -
అగ్ని–5 క్షిపణి పరీక్ష విజయవంతం
జాతీయం భారత్–కిర్గిజిస్థాన్ మధ్య ఆరు ఒప్పందాలు కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు ఆల్మాజ్‌బెక్ అతంబయేవ్ భారత పర్యటనలో భాగంగా డిసెంబర్ 20న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అమలుకు విస్తృత ప్రాతిపదికను ఖరారు చేశాయి. తీవ్రవాదం, అతివాదంపై కలసికట్టుగా పోరాడతామనే కృతనిశ్చయాన్ని ప్రకటించాయి. దీంతోపాటు ఇరు దేశాలు ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో వ్యవసాయం, పర్యాటక రంగం, సాంస్కృతిక, ప్రసార, యువజన వ్యవహారాల్లో సహకారానికి ఉద్దేశించిన అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. వ్యర్థ పదార్థాలను తగలబెట్టడంపై నిషేధం కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను తగలబెట్టడాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పూర్తిగా నిషేధించింది. చెత్త డంపింగ్ ప్రదేశాలతో సహా ఎక్కడ చెత్తను దగ్ధం చేసినా సంబంధిత వ్యక్తి లేదా సంస్థకు రూ.25,000 జరిమానా విధించనున్నట్లు ఎన్జీటీ పేర్కొంది. తక్కువ మొత్తంలో చెత్తను తగలబెడితే రూ.5000 జరిమానాగా విధిస్తామని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని బెంచ్ డిసెంబర్ 22న ప్రకటించింది. శివాజీ స్మారకానికి జలపూజ చేసిన మోదీ ముంబై తీరానికి సమీపంలో సముద్రంలో నిర్మించే ఛత్రపతి శివాజీ భారీ స్మారక (ఎత్తు 192 మీటర్లు) నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 24న జల పూజ చేశారు. ఈ స్మారకాన్ని దక్షిణ ముంబైలోని సముద్ర తీరం నుంచి 1.5 కి.మీ దూరంలో రూ.3,600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రధాని.. కోస్ట్‌గార్డ్ ప్రత్యేక నౌకలో అరేబియా సముద్రంలోని స్మారకం నిర్మించే ప్రాంతానికి వెళ్లి జల పూజ చేశారు. మహారాష్ట్రలోని అన్ని జిల్లాల నుంచి తీసుకొచ్చిన మట్టి, వివిధ నదుల నుంచి తెచ్చిన నీటిని ప్రధాని సముద్రంలో చల్లారు. ఈ స్మారకంలో శివాజీ విగ్రహం, మ్యూజియం, ఆడిటోరియం, రంగస్థల వేదిక, ఎగ్జిబిషన్ గ్యాలరీ ఉంటాయి. అవార్డులు బెంగాలీ రచయిత శంఖ ఘోష్‌కు జ్ఞాన్‌పీ ప్రముఖ బెంగాలీ కవి శంఖ ఘోష్‌కు 2016 సంవత్సరానికి అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞాన్‌పీuŠ‡ అవార్డు లభించింది. ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు జ్ఞాన్‌పీuŠ‡ ఎంపిక బోర్డ్ డిసెంబర్ 23న ప్రకటించింది. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ పురస్కారాన్ని అందిస్తోంది. ఘోష్‌కు గతంలో పద్మభూషణ్, సరస్వతీ సమ్మాన్, సాహిత్య అకాడమీ పురస్కారాలు దక్కాయి. 2016 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు కేంద్ర సాహిత్య అకాడమీ 2016 వార్షిక అవార్డులను డిసెంబర్ 21న ప్రకటించింది. కవిత్వం నుంచి ఎనిమిది మందికి, ఏడుగురు కథకులకు, ఐదుగురు నవలా రచయితలకు, ఇద్దరు విమర్శకులకు, ఒక వ్యాసకర్తకు, ఒక నాటక రచయితకు కలిపి మొత్తం 24 మందికి ఈ సంవత్సరం అవార్డులు దక్కాయి. 2017, ఫిబ్రవరి 22న జరిగే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో అవార్డులకు ఎంపికైన వారికి తామ్ర పత్రంతో పాటు లక్ష రూపాయల చెక్కును అందిస్తారు. గుంటూరుకు చెందిన పాపినేని శివశంకర్ రాసిన రజనీగంధ కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించగా, విజయవాడకు చెందిన ప్రసాదరావుకు భాషా సమ్మాన్ అవార్డు లభించింది. మేరీకోమ్‌కు ఏఐబీఏ లెజెండ్స్ అవార్డు భారత స్టార్ బాక్సర్లు మెరీకోమ్, వికాస్ కృష్ణన్‌లకు అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య అవార్డులు దక్కాయి. మేరీకోమ్‌కు ఏఐబీఏ లెజెండ్స్ పురస్కారం లభించగా, వికాస్‌కు ఏఐబీఏ ప్రో బాక్సింగ్ ఉత్తమ బాక్సర్ అవార్డు దక్కింది. డిసెంబర్ 21న స్విట్జర్లాండ్‌లోని మాంట్రిక్స్‌లో ఏఐబీఏ వార్షికోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఆర్థికం తొలి నగదు రహిత ప్రాంతంగా డామన్ డయ్యు అరేబియా తీరంలోని కేంద్ర పాలిత ప్రాంతం డామన్ డయ్యు.. దేశంలోనే తొలి నగదు రహిత ప్రాంతంగా రికార్డుకెక్కింది. నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ 190 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలోని వలంటీర్లు 25,000 కుటుంబాలకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించారు. ప్రజలు డిజిటల్ లావాదేవీలను జరిపేందుకు వీలుగా పరిపాలనా యంత్రాంగం ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించింది. వార్తల్లో వ్యక్తులు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాజీనామా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ డిసెంబర్ 22న తన పదవికి రాజీనామా చేశారు. 1973 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన నజీబ్ జంగ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక శాఖల్లో పనిచేశారు. 2013, జూలై నుంచి ఆయన ఢిల్లీకి 19వ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి, నజీబ్‌జంగ్ మధ్య అనేక వివాదాలు చెలరేగాయి. ఎన్సీసీ డీజీగా లెఫ్టినెంట్ జనరల్ వినోద్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) నూతన డైరెక్టర్ జనరల్‌గా వినోద్ వశిష్ట్ట్ డిసెంబర్ 26న బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన గయలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కమాండెంట్‌గా విధులు నిర్వర్తించారు. ఎంపీ పదవికి మిథున్ చక్రవర్తి రాజీనామా బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి డిసెంబర్ 26న తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనారోగ్యం కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మిథున్ చక్రవర్తి 2015, ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. పాప్ గాయకుడు జార్జ్ మైఖేల్ మృతి ప్రముఖ పాప్ గాయకుడు జార్జ్ మైఖేల్ (53) లండన్‌లో డిసెంబర్ 25న మృతి చెందారు. 1980లో జార్జ్ పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. 1963లో లండన్‌లో జన్మించిన మైఖేల్ వామ్ పాప్ గ్రూప్‌తో గాయకుడిగా జీవితం ఆరంభించారు. తర్వాత సొంతంగా ఆల్బమ్‌లు రూపొందించారు. ఆయన నాలుగు దశాబ్దాల కెరీర్లో 10 కోట్లకు పైగా ఆల్బమ్స్ అమ్ముడయ్యాయి. క్రీడలు ఐసీసీ మేటి క్రికెటర్‌గా రవిచంద్రన్ అశ్విన్ 2016 సంవత్సరానికి ఉత్తమ క్రికెటర్స్ అవార్డులను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డిసెంబర్ 22న దుబాయ్‌లో ప్రకటించింది. ఇందులో రవిచంద్రన్ అశ్విన్ ఒకే ఏడాది ఐసీసీ మేటి క్రికెటర్, ఐసీసీ మేటి టెస్ట్ క్రికెటర్ అవార్డులను దక్కించుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ (2004) తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా అశ్విన్ నిలిచాడు ఐసీసీ అవార్డులు – విజేతలు మేటి క్రికెటర్‌కు ఇచ్చే సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ: రవిచంద్రన్ అశ్విన్. గతంలో భారత్ నుంచి రాహుల్ ద్రావిడ్ (2004), సచిన్ (2010) మాత్రమే ఈ ట్రోఫీని అందుకున్నారు. ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: రవిచంద్రన్ అశ్విన్ వన్డే క్రికెటర్: క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా) మహిళల వన్డే క్రికెటర్: సుజీ బేట్స్ (న్యూజిలాండ్) మహిళల టీ20 క్రికెటర్: సుజీ బేట్స్ (న్యూజిలాండ్) టీ20 ఉత్తమ ప్రదర్శన: కార్లోస్ బ్రాత్‌వెట్ (10 బంతుల్లో 34 నాటౌట్) వర్ధమాన క్రికెటర్: ముస్తాఫిజుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్) అంపైర్: మరాయిస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా). అండర్ 19 ఆసియా కప్ గెలుచుకున్న భారత్l ఆసియా కప్ అండర్ 19 క్రికెట్ టోర్నమెంట్లో భారత యువ జట్టు వరసగా మూడోసారి విజేతగా నిలిచింది. కొలంబోలో డిసెంబర్ 23న జరిగిన ఫైనల్లో శ్రీలంకను భారత్ ఓడించింది. భారత కెప్టెన్ అభిషేక్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును, హిమాన్షు రాణా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నారు. పంకజ్ అద్వానీకి 6 రెడ్ స్నూకర్ టైటిల్ భారత క్యూ స్పోర్ట్స్ (స్నూకర్, బిలియర్డ్స్) స్టార్ పంకజ్ అద్వానీ స్నూకర్‌లో షార్ట్ ఫార్మాట్‌గా భావించే 6 రెడ్ స్నూకర్ జాతీయ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ముంబైలో డిసెంబర్ 23న జరిగిన ఫైనల్లో ఇష్ప్రీత్ చద్దాపై పంకజ్ గెలుపొందాడు. ఈ విజయంతో జాతీయ, ఆసియా, ప్రపంచ స్థాయిల్లో 6 రెడ్ స్నూకర్ టైటిల్స్ నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ అగ్ని–5 క్షిపణి పరీక్ష విజయవంతం అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఖండాంతర విధ్వంసక క్షిపణి అగ్ని–5ను ఒడిశాలోని బాలాసోర్‌లో అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డిసెంబర్ 26న భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ బాలిస్టిక్ క్షిపణి పరిధి 5 నుంచి 6 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. అగ్ని–5 పరిధిలో చైనా, రష్యా దేశాలు పూర్తిగా.. సగానికిపైగా యూరప్, ఆఫ్రికా ఖండాలు ఉన్నాయి. అగ్ని–5ను నాలుగు విడతల్లో విజయవంతంగా పరీక్షించడం వల్ల వ్యూహాత్మక బలగాల కమాండ్ (ఎన్ఎఫ్సీ)లోకి దీన్ని ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైందని రక్షణ శాఖ పేర్కొంది. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు, రెండు మీటర్ల వ్యాసార్ధమున్న ఈ క్షిపణికి 3 దశల్లో పనిచేసే ఇంజన్లను అమర్చారు. ఇది 1500 కిలోల అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. అవసరమైతే చాలా తక్కువ సమయంలోనే అగ్ని–5ను లాంచింగ్ కోసం సిద్ధం చేయవచ్చు. ఇందులో అత్యంత కచ్చితత్వం కలిగిన రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్షియల్ నేవిగేషన్ సిస్టమ్ (ఆర్ఐఎన్ఎస్), అధునాతన మైక్రో నేవిగేషన్ వ్యవస్థ (ఎన్ఐఎస్ఎస్) ఉన్నాయి. కార్బన్ డై ఆక్సైడ్ పరిశీలనకు ఉపగ్రహ ప్రయోగం గ్లోబల్ కార్బన్ డై ఆక్సైడ్ పరిశీలనకు తాన్‌శాట్ అనే ఉపగ్రహాన్ని డిసెంబర్ 21న చైనా ప్రయోగించింది. ఈ ఉపగ్రహం వాతావరణ మార్పును అధ్యయనం చేసేందుకు తోడ్పడుతుంది. దీని బరువు 620 కిలోలు. తాన్‌శాట్ ఉపగ్రహాన్ని లాంగ్‌మార్చ్–2డీ రాకెట్ ద్వారా చైనాలోని గోబి ఎడారి నుంచి ప్రయోగించారు. తాన్శాట్తో పాటు హై రిజల్యూషన్ మైక్రో నానో శాటిలైట్, రెండు స్పెక్ట్రమ్ మైక్రో–నానో ఉపగ్రహాలను కూడా ప్రయోగించారు. ఇవి వ్యవసాయం, అడవులపై అధ్యయనం చేయనున్నాయి. అమెరికా, జపాన్ తర్వాత చైనా సొంత ఉపగ్రహాలతో గ్రీన్హౌస్ ఉద్గారాలను అధ్యయనం చేస్తుంది. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ సాంద్రత, విస్తరణ, పయనం వంటి అంశాలను తాన్‌శాట్ పరిశీలిస్తుంది. ఐదో తరానికి చెందిన ఎఫ్‌సీ–31 యుద్ధవిమానాన్ని చైనా పరీక్షించినట్లు చైనా మీడియా డిసెంబర్ 26న పేర్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫైటర్లను తయారుచేస్తున్న పశ్చిమ దేశాలకు దీటుగా చైనా ఎఫ్‌సీ–31 యుద్ధవిమానాన్ని రూపొందించింది. జే–31 జెట్లను మరింత అభివృద్ధి చేసిన చైనా వాటికి ఎఫ్‌సీ–31 గైర్ ఫాల్కన్‌గా నామకరణం చేసింది. చైనా డిసెంబర్ 23న ఈ యుద్ధ విమాన పరీక్షను నిర్వహించింది. -
చైనా ఎందుకు భయపడుతోంది?
భారతతదేశం తన స్పెషల్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్ఎఫ్సీ) బలగాలకు అగ్ని 5 క్షిపణిని అందిస్తోందన్న సమాచారం తెలిసి చైనా ఒకింత కలవరపడింది. ఎందుకంటే.. దానివల్ల మన దేశానికి చైనా కంటే ఒక అడుగు ఎక్కువ సానుకూలత లభిస్తుంది. అత్యంత శక్తిమంతమైన ఈ క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించారు. దీన్ని ప్రయోగిస్తే నేరుగా బీజింగ్, యూరప్‌లో చాలా ప్రాంతాలను తుత్తునియలు చేయొచ్చు. 5వేల కిలోమీటర్లకు పైగా దూరం పయనించడంతో పాటు 1500 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లడం, అణ్వస్త్ర సామర్థ్యం కూడా కలిగి ఉండటంతో.. ఈ క్షిపణిని చూసి చాలా దేశాలు కనుబొమ్మలు ఎగరేశాయి. భూమ్మీద నుంచి భూ ఉపరితలం మీదకు ప్రయోగించగల ఈ క్షిపణిని నాలుగోసారి కూడా విజయవంతంగా పరీక్షించారు. 17 మీటర్ల పొడవుండి, 50 టన్నుల బరువుండే ఈ క్షిపణి నూటికి నూరుశాతం కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించింది. దీని మరికొన్ని లక్షణాలు చూద్దాం.. ఈ మిసైల్‌లో ఎంఐఆర్‌వి సామర్థ్యం ఉంది. అంటే, ఇది ఒకేసారి పలు రకాల వార్హెడ్లను మోసుకెళ్లి, వేర్వేరు లక్ష్యాలను ఛేదించగలదు. మూడు దశలు ఉండటంతో ఇది అగ్ని మిసైళ్లు అన్నింటిలోకీ చాలా అత్యాధునికమైనది. దీనివల్ల భారతదేశ దీర్ఘశ్రేణి దాడి సామర్థ్యం మరింత పెరుగుతుంది. దీని స్ట్రైక్ రేంజి సుమారు 5500 నుంచి 5800 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే, బీజింగ్ సహా చైనాలోని పలు ప్రధాన నగరాలను సులభంగా చేరుకోగలదు. 2012లో తొలిసారి అగ్ని 5ను పరీక్షించినప్పుడు.. దాని సామర్థ్యాన్ని భారత్ తక్కువ చేసి చూపిస్తోందని, వాస్తవానికి అది 8వేల కిలోమీటర్ల సామర్థ్యంతో యూరప్‌లో 70 శాతాన్ని చేరుకోగలదని చైనా అధికారిక మీడియా పేర్కొంది. అయితే భారతీయ నాయకులు నిజంగా ఆ క్షిపణిని ప్రయోగించగలరా అని కూడా కొందరు చైనా నిపుణులు ఆ సమయంలో అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ క్షిపణిని పూర్తిస్థాయిలో భారత సైన్యానికి అందుబాటులోకి తెస్తే, చైనా కంటే మన దేశానికి కొంత సానుకూలత పెరుగుతుంది. ఇప్పటివరకు ఈ విషయంలో మనం కొంత వెనకబడి ఉన్నాం. చైనా తమవద్ద ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్లు ఉన్నాయని, అవి భారతదేశం మొత్తాన్ని చేరుకోగలవని ఇన్నాళ్లూ చెబుతూ వస్తోంది.