చైనా ఎందుకు భయపడుతోంది?
- ఈ మిసైల్‌లో ఎంఐఆర్‌వి సామర్థ్యం ఉంది. అంటే, ఇది ఒకేసారి పలు రకాల వార్‌హెడ్లను మోసుకెళ్లి, వేర్వేరు లక్ష్యాలను ఛేదించగలదు.
- మూడు దశలు ఉండటంతో ఇది అగ్ని మిసైళ్లు అన్నింటిలోకీ చాలా అత్యాధునికమైనది.
- దీనివల్ల భారతదేశ దీర్ఘశ్రేణి దాడి సామర్థ్యం మరింత పెరుగుతుంది.
- దీని స్ట్రైక్ రేంజి సుమారు 5500 నుంచి 5800 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే, బీజింగ్ సహా చైనాలోని పలు ప్రధాన నగరాలను సులభంగా చేరుకోగలదు.
- 2012లో తొలిసారి అగ్ని 5ను పరీక్షించినప్పుడు.. దాని సామర్థ్యాన్ని భారత్ తక్కువ చేసి చూపిస్తోందని, వాస్తవానికి అది 8వేల కిలోమీటర్ల సామర్థ్యంతో యూరప్‌లో 70 శాతాన్ని చేరుకోగలదని చైనా అధికారిక మీడియా పేర్కొంది.
- అయితే భారతీయ నాయకులు నిజంగా ఆ క్షిపణిని ప్రయోగించగలరా అని కూడా కొందరు చైనా నిపుణులు ఆ సమయంలో అనుమానాలు వ్యక్తం చేశారు.
- ఇప్పుడు ఈ క్షిపణిని పూర్తిస్థాయిలో భారత సైన్యానికి అందుబాటులోకి తెస్తే, చైనా కంటే మన దేశానికి కొంత సానుకూలత పెరుగుతుంది. ఇప్పటివరకు ఈ విషయంలో మనం కొంత వెనకబడి ఉన్నాం. చైనా తమవద్ద ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్లు ఉన్నాయని, అవి భారతదేశం మొత్తాన్ని చేరుకోగలవని ఇన్నాళ్లూ చెబుతూ వస్తోంది.