ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్
Published Sat, Dec 5 2015 12:11 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
మదనపల్లె: బస్సుల్లో ప్రయాణిస్తున్నవారితో పరిచయం చేసుకొని చాకచక్యంగా వారి వద్ద నుంచి బ్యాగులను దొంగలించడంతో పాటు బంగారు దుకాణాలకు కొనుగోలు దారులుగా వెళ్లి యజమాని దృష్టి మరల్చి చోరీలను పాల్పడుతున్న ఇద్దరు మహిళా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పోలీసులు శనివారం వారిని అరెస్ట్ చేశారు.
వారి నుంచి రూ. 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని కలికిరి గ్రామానికి చెందిన రాణి(30) మంగమ్మ(50) అనే ఇద్దరు మహిళలు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement