
ఇంటి ముందు పడుకుంటే...
హిసార్: హర్యానాలోని హిసార్లో గురువారం రాత్రి దారుణం జరిగింది. కొడుకుతో పాటు ఇంటిముందు నిద్రిస్తున్న ఓ 45 ఏళ్ల మహిళపై కారు ఎక్కించడంతో ఇద్దరూ చనిపోయారు. పెహల్వాన్ చౌక్ ప్రాంతంలో తన ఇంటి ముందు రాణి, ఆమె కొడుకు వివేక్ పడుకున్నారు. పొరుగున ఉండే జస్ దీప్ సంధూ వారిపై తన ఎస్యూవీని ఎక్కించేశాడు.
దీంతో తీవ్ర గాయాలపాలైన ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీంతో పాటు బాధితులు ఇల్లు కూడా పాక్షికంగా ధ్వంసమైంది. దీంతో సందూ కారునే అక్కడే వదిలేసి పారిపోయాడు. శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను శవపరీక్షకు పంపించారు.