
సాక్షి, చెన్నై: ‘మీటూ’ ఉద్యమం ఉధృతంగా సాగుతుండగానే మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయి. వివిధ రంగాల్లో తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బాధితురాళ్లు నిర్భయంగా వెల్లడిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సినిమా రంగంలో మహిళలపై వేధింపులు ఆగడం లేదు.
తాజాగా తమిళ నటి రాణి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. సీరియల్ చిత్రీకరణ సమయంలో సహ నటుడు షణ్ముగరాజన్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని సెంగుడ్రమ్ పోలీస్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రక్ష పేరుతో పాపులర్ అయిన రాణి దాదాపు 32 సినిమాల్లో నటించారు. తెలుగు, కన్నడలోనూ ఆమె పలు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. నచ్చావులే సినిమాలో నటనకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment