పాకిస్థాన్ లాహోర్ నగరంలో ఓ షాప్ వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో 12 మంది గాయపడ్డారు. ఈ మేరకు జియో న్యూస్ శుక్రవారం వెల్లడించింది. స్థానికుల సహయంతో భద్రత సిబ్బంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు చెప్పింది. కాగా షాపు వద్ద బాంబు పేలుడుకు దాదాపు 300 గ్రాముల పేలుడు పదార్థాన్ని వినియోగించినట్లు పోలీసులు తెలిపారని వెల్లడించింది.
అయితే షాప్ ఓనర్ మాట్లాడుతూ... రూ.2 మిలియన్లు చెల్లించాలని కొన్ని రోజుల క్రితం తనకు ఆగంతకుల నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు. ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గత నెల క్రితం తన ఇంటిపై ఆగంతకులు కాల్పులకు పాల్పడ్డారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆ కేసు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.