
మాస్కో : ఫిఫా ప్రపంచ కప్‌లో మహిళా న్యూస్ రిపోర్టర్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. కొలంబియాకు చెందిన జూలియట్ గోంజాలెజ్ థెరాన్ ఓ జర్మన్ న్యూస్ ఛానల్‌లో పనిచేస్తున్నారు. రష్యాలో జరుగుతున్న ప్రపంచకప్ కవరేజ్ కోసం వెళ్లిన థెరాన్ సరన్స్ ప్రాంతంలో లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఓ అపరిచిత వ్యక్తి వచ్చి ఆ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించి, ముద్దు పెట్టాడు. లైవ్ కవరేజ్ కావడంతో థెరాన్ రియాక్ట్ కాలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఆ మహిళా రిపోర్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
న్యూస్ టీం, తాను లైవ్ కవరేజ్ కోసం రెండు గంటల నుంచి ఆ ప్రాంతంలో కష్టపడుతున్నామని, లైవ్ రిపోర్టింగ్ మొదలు పెట్టాక రియాక్ట్ అయ్యే అవకాశం ఉండదనే ఉద్దేశంతో ఆ వ్యక్తి వేచి చూసి, ఈ సిగ్గుమాలిన పని చేశాడని థెరాన్ పేర్కొన్నారు. లైవ్ రిపోర్టింగ్ అనంతరం ఆ వ్యక్తి కోసం వెతికినా దొరకలేదని తెలిపారు. ‘నేను ఇలాంటి ఘటన ఎదుర్కొంటానని కలలో కూడా ఊహించలేదు. మేము ఫుట్‌బాల్ గురించి ఎంతో కొంత సాకర్ అభిమానులకు తెలియజేయాలని అనుకున్నాం. కానీ అభిమానం ప్రేమగా స్వీకరించేలా ఉండాలి కాని వేదింపుగా ఉండకూడదు’అంటూ థెరాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ యువకుడి చర్యపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment