
యెకాటెరిన్‌బర్గ్(రష్యా) : రష్యాలో జరుగుతున్న సాకర్ ప్రపంచకప్ కవరేజ్‌కు వెళ్లిన మహిళ రిపోర్టర్లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ నెల 15న ఓ జర్మన్ న్యూస్ ఛానల్‌లో పనిచేస్తున్న జూలియట్ గోంజాలెజ్ థెరాన్ లైవ్ రిపోర్ట్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి ముద్దు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రెజిల్ స్పోర్ట్ జర్నలిస్ట్ జూలియా గుమారాస్, యోకాటెరిన్‌బర్గ్ నుంచి రిపోర్ట్ చేస్తున్న సమయంలో ఓ ఆకతాయి ఆమెకు ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. రిపోర్టింగ్ సమయంలో అప్రమత్తతో ఉన్న జూలియా అతని నుంచి తప్పించుకున్నారు.
అంతేకాకుండా ఇంకెప్పుడు ఇలా చేయకు అంటూ జూలియా అతనిపై మండిపడ్డారు. ‘ఇది మంచి పద్దతి కాదు.. ఓ మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం సరైనది కాదు.. దీనిని రిపీట్ చేయకు’ అంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జూలియా ట్విటర్‌లో స్పందించారు. ‘ఆ ఘటన గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. అదృష్టవశాత్తు నేను తప్పించుకున్నాను. ఇక్కడ ఇలా జరగడం రెండోసారి.. రష్యా, ఈజిప్ట్ మధ్య జరిగిన ప్రపంచకప్ తొలి మ్యాచ్ సమయంలో కూడా మాస్కోలో ఇదే రకమైన అనుభవం ఎదురైంది. రష్యాలో కొన్ని పరిస్థితలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయ’ని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా జూలియా చర్యను తోటి జర్నలిస్టులు.. నెటిజన్లు ప్రశంసిసస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment