Sports journalist
-
మ్యాచ్ కవర్ చేస్తూ కుప్పకూలాడు.. మృతిపై అనుమానాలు!
దోహా: అమెరికన్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్(48).. గుర్తున్నారా?.. ఫుట్‌బాల్ స్టేడియం వద్ద రెయిన్ బో కలర్ దుస్తులు ధరించి.. ఖతార్ పోలీసుల ఆగ్రహానికి గురైన వ్యక్తి. ఎల్జీబీటీక్యూ హక్కులకు మద్ధతుగా ఆయన ఈ పని చేశాడు. అయితే.. ఆయన శుక్రవారం మ్యాచ్ సమయంలో హఠాత్తుగా కుప్పకూలి మరణించారు. శుక్రవారం లుసాయిల్ స్టేడియంలో అర్జెంటీనా-నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను కవర్ చేస్తూ ఆయన హఠాత్తుగా కుప్పకూలాడు. పక్కనే ఉన్న జర్నలిస్టులు ఆయన్ని సీపీఆర్ కాపాడే యత్నం చేశారు. కానీ, అది ఫలించలేదు. అయితే.. ఆయన మరణం పట్ల సోదరుడిగా చెప్పుకుంటున్న ఎరిక్ వాల్ అనే వ్యక్తి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. గ్రాంట్ మరణంలో.. ఖతార్ ప్రభుత్వ ప్రమేయం ఉందేమో అనే అనుమానం వ్యక్తం చేశాడాయన. నా పేరు ఎరిక్ వాల్. వాషింగ్టన్ సియాటెల్‌లో జీవిస్తున్నా. గ్రాంట్ వాహ్ల్ సోదరుడిని నేను. నా కారణంగానే నా సోదరుడు రెయిన్బో రంగు షర్ట్‌తో ఫుట్‌బాల్ మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఆయన చాలా ఆరోగ్యవంతుడు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత.. చావు బెదిరింపులు వచ్చాయని ఆయన నాతో చెప్పాడు. చాలా ఆరోగ్యంగ ఉన్న ఆయన మరణించాడంటే నమ్మబుద్ధ ఇకావడం లేదు. ఆయన్ని చంపేసి ఉంటారు. సాయం కోసం అర్థిస్తున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన సోదరుడు ఒక వీడియో పోస్ట్ చేశాడు. అయితే ఇన్స్టాగ్రామ్ ఎందుకనో ఆ వీడియోపై ఆంక్షలు విధించింది. Free to read: What happened when Qatar World Cup security detained me for 25 minutes for wearing a t-shirt supporting LGBTQ rights, forcibly took my phone and angrily demanded that I remove my t-shirt to enter the stadium. (I refused.) Story: https://t.co/JKpXXETDkH pic.twitter.com/HEjr0xzxU5 — Subscribe to GrantWahl.com (@GrantWahl) November 21, 2022 ఇదిలా ఉంటే.. ఫిఫా వరల్డ్ కప్ ఆరంభంలో గ్రాంట్ వాల్‌ను సెక్యూరిటీ సిబ్బంది అల్ రయాన్లోని అహ్మద్ బిన్ అలీ స్టేడియం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు కూడా. సుమారు 25 నిమిషాల తర్వాత తానెవరో తెలుసుకుని.. ఆపై వాళ్లు తనకు క్షమాపణలు చెప్పి.. లోనికి అనుమతించారని తెలియజేశారు. ఇదిలా ఉంటే.. వాల్ భార్య గౌండర్ మాత్రం ఆయన హఠాన్మరణంపై అనుమానాలు వ్యక్తం చేయలేదు. కేవలం తన భర్త మరణంపై దిగ్భ్రాంతికి గురయ్యానంటూ ఆమె ట్విటర్ ద్వారా ఓ పోస్ట్ చేశారు. I am so thankful for the support of my husband @GrantWahl's soccer family & of so many friends who've reached out tonight. I'm in complete shock. https://t.co/OB3IzOxGlE — Céline Gounder, MD, ScM, FIDSA 🇺🇦 (@celinegounder) December 10, 2022 వాల్.. ప్రిన్స్టన్ నుంచి 1996లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అప్పటి నుంచి 2021 దాకా స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా రాణించారు. సాకర్, బాస్కెట్ బాల్ కవరేజీలకు ఆయన ప్రత్యేక గుర్తింపు దక్కింది. 2012 నుంచి ఏడేళ్ల పాటు ఆయన ఫాక్స్ స్పోర్ట్స్‌లో పనిచ చేశారు. ఆపై ఆయన తన సొంత వెబ్‌సైట్‌ను లాంఛ్ చేశారు. -
'సోయి లేకుండా మాట్లాడొద్దు'.. జర్నలిస్ట్‌ను ఉతికారేసిన అశ్విన్
ఇంగ్లండ్‌కు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ లారెన్స్ బూత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ క్యాలెండర్ ఇయర్లో 1/3 వంతును ఐపీఎల్ ఆక్రమిస్తుందని.. దీనివల్ల ఆటగాళ్ల మానసిక స్థైర్యం దెబ్బతింటుందని తెలిపాడు. లారెన్స్ వ్యాఖ్యలను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూ ట్యూబ్ వేదికగా ఖండిస్తూ ధీటుగా బధులిచ్చాడు. ''ఐపీఎల్ 1/3 వంతును ఆక్రమిస్తోందంటూ లారెన్స్ బూత్ వ్యాఖ్యలు చేశాడు. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మరి మీ దేశంలో జరిగే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్(ఈపీఎల్) కనీసం ఆరు నెలల పాటు జరుగుతుంది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు. ఐపీఎల్లో ఆటగాళ్లకు మంచి రెస్ట్ దొరుకుతుంది. వారానికి ఒక జట్టు గరిష్టంగా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతుంది. ఏదో ఒక దశలో మూడు మ్యాచ్‌లు ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఆటగాళ్లకు రెండురోజలు విశ్రాంతి దొరుకుతున్నట్లే. కనీసం పరిజ్ఞానం లేకుండా అనవసర వ్యాఖ్యలు చేయొద్దు. వాస్తవానికి ఈపీఎల్ వల్ల ఆటగాళ్లు ఎక్కువగా అలిసిపోతున్నారేమో చూసుకో. వీలైతే ఈపీఎల్పై నీ విమర్శనాస్త్రాలు సంధించు. సోయి లేకుండా మాట్లాడొద్దు. ఐపీఎల్ లాంటి లీగ్‌ల వల్ల కొంతమంది ఆటగాళ్లు పేరుతో పాటు తమ దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేస్తున్నారు.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన అశ్విన్‌ను ఈసారి మెగావేలంలో రాజస్తాన్ రాయల్స్ రూ. 5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. మరి ఈ వెటరన్ స్పిన్నర్ ఐపీఎల్ 2022లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో చూడాలి. ఇప్పటివరకు అశ్విన్ ఐపీఎల్లో 167 మ్యాచ్‌లాడి 456 పరుగులతో పాటు 145 వికెట్లు తీశాడు. చదవండి: Virat Kohli 100th Test: మరో 38 పరుగులు.. దిగ్గజాల సరసన మూడేళ్ల తర్వాత ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. రోహిత్, కోహ్లి లేకుండానే! -
టీమిండియా క్రికెటర్ల పెద్ద మనసు.. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం
ముంబై: కరోనా మహమ్మారితో దేశం మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కరోనా బారీన పడుతుండగా.. మరికొంతమంది ప్రాణాలు వదులతున్నారు. ఆ కోవకు చెందినవారే సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ రుచిర్ మిశ్రా. మిశ్రా టైమ్స్ ఆఫ్ ఇండియాలో పదేళ్లుగా స్పోర్ట్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఈ పదేళ్ల కాలంలో ఆయన టీమిండియా స్వదేశంలో ఆడిన ప్రతీ మ్యాచ్‌తో పాటు డొమస్టిక్ లీగ్‌లను కవర్ చేసేవాడు. మంచి స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా పేరు సంపాదించిన మిశ్రాకు పలువురు టీమిండియా క్రికెటర్లు పరిచయమయ్యారు. ఇలా ఆనందంగా సాగుతున్న అతని జీవితంలో కరోనా పెను విషాదం నింపింది. కొన్ని రోజుల కిందట రుచిర్ మిశ్రా కరోనా బారీన పడి మే4న నాగ్‌పూర్‌లో కన్నుమూశారు. దీంతో అతని కుటుంబం కష్టాల్లో పడింది. వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రుచిర్ మిశ్రా ఒక ఫండ్ రైజర్‌ను స్థాపించి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది తెలుసుకున్న టీమిండియా క్రికెటర్లు ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా, టీమిండియా వుమెన్స్ కోచ్ రమేశ్ పొవార్‌లు స్పందించారు. ఉమేశ్ రూ. లక్ష విరాళం ఇవ్వగా.. అశ్విన్, పుజారా, పొవార్‌లు రూ. 50 వేలు విరాళంగా ఇచ్చి పెద్ద మనుసు చాటుకున్నారు. మీ ఇంటి పెద్దని మేం తీసుకురాలేకపోవచ్చు.. కానీ మేమిచ్చే ఈ డబ్బు మీ ఆర్థిక పరిస్థితి బాగుండేలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం.. అంటూ క్రికెటర్లు పేర్కొన్నారు. కాగా మిశ్రా కుటుంబానికి క్రికెటర్లు చేసిన సాయం తెలుసుకొని వసీం జాఫర్ సహా మరికొందరు సెలబ్రిటీలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇక కరోనా సెగతో ఐపీఎల్ 14వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆటగాళ్లంతా ఇంటికి చేరుకున్నారు. కివీస్‌తో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు సమాయత్తమవుతున్న టీమిండియా జూన్ 2న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. జూన్ 18 నుంచి 22 వరకు టీమిండియా కివీస్‌తో ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది. చదవండి: క్రికెటర్ భువనేశ్వర్ ఇంట్లో విషాదం I just contributed to this family! If you are from the cricket fraternity and would like to donate. Please do so🙏🙏 https://t.co/3P8q7tht2d pic.twitter.com/12LfO51Dx8 — Mask up and take your vaccine🙏🙏🇮🇳 (@ashwinravi99) May 20, 2021 -
వైరల్ : మరోసారి మహిళ జర్నలిస్ట్‌పై..
యెకాటెరిన్బర్గ్(రష్యా) : రష్యాలో జరుగుతున్న సాకర్ ప్రపంచకప్ కవరేజ్‌కు వెళ్లిన మహిళ రిపోర్టర్లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ నెల 15న ఓ జర్మన్ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న జూలియట్ గోంజాలెజ్ థెరాన్ లైవ్ రిపోర్ట్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి ముద్దు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రెజిల్ స్పోర్ట్ జర్నలిస్ట్ జూలియా గుమారాస్, యోకాటెరిన్బర్గ్ నుంచి రిపోర్ట్ చేస్తున్న సమయంలో ఓ ఆకతాయి ఆమెకు ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. రిపోర్టింగ్ సమయంలో అప్రమత్తతో ఉన్న జూలియా అతని నుంచి తప్పించుకున్నారు. అంతేకాకుండా ఇంకెప్పుడు ఇలా చేయకు అంటూ జూలియా అతనిపై మండిపడ్డారు. ‘ఇది మంచి పద్దతి కాదు.. ఓ మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం సరైనది కాదు.. దీనిని రిపీట్ చేయకు’ అంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జూలియా ట్విటర్లో స్పందించారు. ‘ఆ ఘటన గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. అదృష్టవశాత్తు నేను తప్పించుకున్నాను. ఇక్కడ ఇలా జరగడం రెండోసారి.. రష్యా, ఈజిప్ట్ మధ్య జరిగిన ప్రపంచకప్ తొలి మ్యాచ్ సమయంలో కూడా మాస్కోలో ఇదే రకమైన అనుభవం ఎదురైంది. రష్యాలో కొన్ని పరిస్థితలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయ’ని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. కాగా జూలియా చర్యను తోటి జర్నలిస్టులు.. నెటిజన్లు ప్రశంసిసస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
స్విమ్మర్ టొమిటాపై 18 నెలలు నిషేధం
టోక్యో: ఆసియా క్రీడల సందర్భంగా స్పోర్ట్స్ జర్నలిస్ట్ కెమెరాను దొంగతనం చేసిన జపాన్ స్టార్ స్విమ్మర్, ప్రపంచ మాజీ చాంపియన్ నవోయా టొమిటాపై జపాన్ ఒలింపిక్ కమిటీ (జేఓసీ) కొరడా ఝళిపించింది. అతనిపై 18 నెలల నిషేధాన్ని విధించింది. 2016 మార్చి 31 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. ఇంచియాన్ ఆసియా క్రీడల సమయంలో 25 ఏళ్ల టొమిటా దక్షిణ కొరియా వార్తా సంస్థకు చెందిన ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్ కెమెరాను తస్కరించాడు. జర్నలిస్ట్ ఫిర్యాదుతో విచారణ చేయగా... సీసీ టీవీ కెమెరా ఫుటేజిలో టొమిటా కెమెరాను చోరీ చేసినట్లు కనిపించింది. 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో బ్రెస్ట్‌స్ట్రోక్ విభాగంలో స్వర్ణం నెగ్గిన టొమిటా ఈసారి ఏ పతకమూ గెలువలేదు. -
స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకున్నాను!
- అపూర్వి చండేలా, షూటర్ చిన్నప్పటి నుంచి ఆటలు అంటే చాలా ఇష్టం. బాస్కెట్ బాల్ బాగా ఆడేదాన్ని. స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకునేదాన్ని. అభినవ్ బింద్రా ఒలింపిక్ గోల్డ్ గెలుచుకున్న తరువాత అది చాలామందిలో స్ఫూర్తి నింపింది. అందులో నేను కూడా ఒకరిని. షూటర్ కావాలనుకోవడానికి ఇదే కారణం. నా తల్లిదండ్రులు తమ కోరికలను నా మీద ఎప్పుడూ రుద్దలేదు. అభిరుచికి తగిన స్వేచ్ఛను ఇచ్చారు. కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకోవడానికి ఆ ప్రోత్సాహమే వెన్నుదన్నుగా నిలచింది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలుచుకోవడం నా జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పింది. అది మాటలకు అందని అద్భుత భావన. నా ఫస్ట్ నేషనల్ టైటిల్‌ను 2012లో గెలుచుకున్నాను. అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం నా లక్ష్యం... ఒలింపిక్స్‌లో క్వాలిఫై కావడం. రోజూ యోగా, ధ్యానం చేస్తాను. చాలా దూరం పరుగెడతాను. ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఏమాత్రం వీలున్నా కొత్త ప్రదేశాలు చూడడానికి ప్రాధాన్యత ఇస్తాను.