ఇంగ్లండ్‌కు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ లారెన్స్ బూత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ క్యాలెండర్ ఇయర్‌లో 1/3 వంతును ఐపీఎల్ ఆక్రమిస్తుందని.. దీనివల్ల ఆటగాళ్ల మానసిక స్థైర్యం దెబ్బతింటుందని తెలిపాడు. లారెన్స్ వ్యాఖ్యలను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూ ట్యూబ్ వేదికగా ఖండిస్తూ ధీటుగా బధులిచ్చాడు.
''ఐపీఎల్ 1/3 వంతును ఆక్రమిస్తోందంటూ లారెన్స్ బూత్ వ్యాఖ్యలు చేశాడు. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మరి మీ దేశంలో జరిగే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్(ఈపీఎల్) కనీసం ఆరు నెలల పాటు జరుగుతుంది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు. ఐపీఎల్‌లో ఆటగాళ్లకు మంచి రెస్ట్ దొరుకుతుంది. వారానికి ఒక జట్టు గరిష్టంగా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతుంది. ఏదో ఒక దశలో మూడు మ్యాచ్‌లు ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఆటగాళ్లకు రెండురోజలు విశ్రాంతి దొరుకుతున్నట్లే.
కనీసం పరిజ్ఞానం లేకుండా అనవసర వ్యాఖ్యలు చేయొద్దు. వాస్తవానికి ఈపీఎల్ వల్ల ఆటగాళ్లు ఎక్కువగా అలిసిపోతున్నారేమో చూసుకో. వీలైతే ఈపీఎల్‌పై నీ విమర్శనాస్త్రాలు సంధించు. సోయి లేకుండా మాట్లాడొద్దు. ఐపీఎల్ లాంటి లీగ్‌ల వల్ల కొంతమంది ఆటగాళ్లు పేరుతో పాటు తమ దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేస్తున్నారు.'' అంటూ చెప్పుకొచ్చాడు.
కాగా గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన అశ్విన్‌ను ఈసారి మెగావేలంలో రాజస్తాన్ రాయల్స్ రూ. 5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. మరి ఈ వెటరన్ స్పిన్నర్ ఐపీఎల్ 2022లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో చూడాలి. ఇప్పటివరకు అశ్విన్ ఐపీఎల్‌లో 167 మ్యాచ్‌లాడి 456 పరుగులతో పాటు 145 వికెట్లు తీశాడు.
చదవండి: Virat Kohli 100th Test: మరో 38 పరుగులు.. దిగ్గజాల సరసన
మూడేళ్ల తర్వాత ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. రోహిత్, కోహ్లి లేకుండానే!
Comments
Please login to add a commentAdd a comment