PC: IPL Twitter
టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తరపున స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్ చేరడంలో అశ్విన్ పాత్ర కీలకమనే చెప్పొచ్చు. ఇప్పటివరకు 14 మ్యాచ్‌లాడిన అశ్విన్ 183 పరుగులతో పాటు బౌలింగ్‌లో 11 వికెట్లు పడగొట్టాడు. కాగా మంగళవారం గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య క్వాలిఫయర్-1 పోరు జరగనుంది. మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుండగా.. ఓడిన జట్టు క్వాలిఫయర్-2 ఆడనుంది.
PC: IPL Twitter
ఈ నేపథ్యంలో ప్రాక్టీస్‌లో మునిగిన అశ్విన్ మీడియాతో కాసేపు ముచ్చటించాడు. ఐపీఎల్లో ఎప్పుడు లేనంతా హ్యాపీగా అనిపిస్తుంది. రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. జట్టులో ఉన్న స్వేచ్ఛ, ఎలాంటి అంచనాలు లేకుండా ఆడడం కొత్తగా అనిపిస్తోంది. దీనిని ఇలాగే కంటిన్యూ చేస్తూ రాబోయే మ్యాచ్‌ల్లో మాకు ప్రత్యర్థిగా వచ్చే జట్టును ఓడించి కప్‌ను కొట్టమమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
ప్రతీసారితో పోలిస్తే ఈ ఏడాది ఐపీఎల్ డిఫెరెంట్‌గా కనిపిస్తోంది. రిటైర్డ్ ఔట్ అనే పదాన్ని ఐపీఎల్‌లో ప్రవేశపెట్టడం.. నాతోనే అది మొదలవడం.. కెప్టెన్ నన్ను నమ్మి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ లాంటివి కాస్త ఎక్స్‌పెరిమెంటల్‌గా ఉన్నాయి. ఎప్పుడైతే ప్రయోగాలు చేయడం ఆపేస్తానో అప్పుడే క్రికెట్‌పై ఉన్న ఫ్యాషన్ చచ్చిపోతుంది.. అందుకే క్రికెట్ ఆడినంత కాలం దానిని మెయింటెన్ చేయాలని అనుకుంటున్నా. రాజస్తాన్ రాయల్స్ తరపున నా సమయాన్ని నిజంగా ఆస్వాదించాను అన్వేషణలో భాగంగా కచ్చితమైన వ్యక్తీకరణ రూపాన్ని పొందగలిగాను'' అంటూ చెప్పుకొచ్చాడు.
PC: IPL Twitter
చదవండి: IPL 2022: 'సంజూ శాంసన్‌కు డ్రింక్స్ అందించడానికి రెడీగా ఉండు'
Comments
Please login to add a commentAdd a comment