టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏం చేసినా సంచలనమే అవుతుందని మరోసారి నిరూపితమైంది. తాజాగా ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అశ్విన్ లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో అనూహ్యంగా రిటైర్డ్ ఔట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో రిటైర్డ్ ఔట్ అయిన తొలి బ్యాటర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. రియాన్ పరాగ్‌కు అవకాశం ఇవ్వడం కోసం అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రిటైర్డ్ ఔట్.. అంటే అంపైర్ అనుమతి లేకుండానే పెవిలియన్‌కు వెళ్లిపోవచ్చు.. అయితే తిరిగి బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం ఉండదు. ఏదేమైనా అశ్విన్ తాజా నిర్ణయంతో మరోసారి వార్తల్లో నిలిచాడు.
Courtesy: IPL Twitter
ఇంతకముందు ఐపీఎల్‌లో మన్కడింగ్ చేసిన తొలి క్రికెటర్‌గానూ అశ్వినే ఉండడం గమనార్హం. ఇక్కడ విచిత్రమేంటంటే.. మన్కడింగ్ చేసిన సమయంలో రాజస్తాన్ రాయల్స్ తన ప్రత్యర్థి జట్టు.. తాజాగా రిటైర్డ్ ఔట్ అయిన సందర్భంలో అదే అశ్విన్.. రాజస్తాన్ రాయల్స్ జట్టు సభ్యుడిగా ఉన్నాడు. ఈ రెండు సందర్బాల్లో యాదృశ్చికంగా కామన్‌గా వినిపించిన పేరు రాజస్తాన్ రాయల్స్. దీంతో అశ్విన్‌కు రాజస్తాన్ రాయల్స్‌తో విడదీయని బంధంగా మారుతుందని అభిమానులు కామెంట్స్ చేశారు.
అప్పుడు మన్కడింగ్..
Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2019 సీజన్‌లో రవిచంద్రన్ అశ్విన్ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 బంతుల్లో 69 పరుగులతో జోరు చూపిస్తున్న బట్లర్‌ను అశ్విన్ మన్కడింగ్ చేశాడు. అయితే అశ్విన్ మన్కడింగ్ తీరుపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బౌలర్ బంతి వేయకముందే బ్యాట్స్‌మన్ క్రీజు దాటితే సదరు బౌలర్ రనౌట్ చేయడమే మన్కడింగ్ అని పిలుస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎవరు మన్కడింగ్ చేసినా అశ్విన్ పేరు మొదట గుర్తుకు వస్తుంది.. అంతలా ఇంపాక్ట్ చూపించాడు మన అశ్విన్. అయితే ఇదే మన్కడింగ్‌ను ఇటీవలే క్రికెట్‌లో చట్టాలు చేసే మెరిల్‌బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) చట్టబద్ధం చేసింది. ఇకపై మన్కడింగ్ రనౌట్‌గా పిలుస్తారు.
చదవండి: Ravichandran Ashwin: అశ్విన్ 'రిటైర్డ్ ఔట్'.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment