Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 23 బంతుల్లో 28 పరుగుల వద్ద ఉన్నప్పుడు అశ్విన్ అనూహ్యంగా రిటైర్డ్ ఔట్ అయ్యాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో రిటైర్డ్ ఔట్ అయిన తొలి బ్యాటర్‌గా అశ్విన్ చరిత్ర సృష్ఠించాడు. రియాన్ పరాగ్‌కు అవకాశం ఇవ్వడం కోసం అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
రిటైర్డ్ ఔట్ అంటే అంపైర్ అనుమతి లేకుండానే పెవిలియన్‌కు వెళ్లిపోవచ్చు.. అయితే తిరిగి బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం ఉండదు. అదే రిటైర్డ్ హర్ట్(గాయపడిన సమయంలో) అయితే సదరు బ్యాట్స్‌మన్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా చివరి బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి రావడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. రిటైర్డ్ ఔట్ అయితే మాత్రం మళ్లీ బ్యాటింగ్ చేసే అవకాశం రాదు. ఈ రెండింటి మధ్య ఇదే ప్రధాన వ్యత్యాసం.
అయితే అశ్విన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కాలేదు. ఎందుకంటే తాను రిటైర్ ఔట్ అయ్యే సమయానికి మంచి బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. హెట్‌మైర్‌తో కూడా మంచి భాగస్వామ్యం ఏర్పడింది. ఈ దశలో రియాన్ పరాగ్ కోసం అశ్విన్ ఈ పని చేయడం కొందరు వ్యతిరేకిస్తే.. మరికొందరు సమర్థించారు. కాగా టి20 క్రికెట్‌లో రిటైర్డ్ ఔట్ అయిన నాలుగో బ్యాటర్‌గా అశ్విన్ నిలిచాడు. ఇంతకముందు పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది, బుటాన్‌కు చెందిన ఎస్ తోగ్బే, కుమిల్లా వారియర్స్‌కు చెందిన సంజాముల్ ఇస్లామ్‌లు రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగారు.
చదవండి: Ajinkya Rahane: మూడుసార్లు తప్పించుకున్నాడు.. ఏం ప్రయోజనం!
Comments
Please login to add a commentAdd a comment