టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌లో ఇంతవరకు ఎవరికి సాధ్యం కాని అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్‌లో ఒకటో నెంబర్ నుంచి పదో నెంబర్ వరకు అన్ని స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన ఒకే ఒక్కడిగా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటికైతే ఈ రికార్డు యూనిక్‌గా మిగిలిపోనుంది.
తాజాగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అశ్విన్ ఓపెనర్‌గా వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే రాజస్తాన్ చేసిన ఈ ప్రయోగం బెడిసికొట్టింది. ఎందుకంటే అశ్విన్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. రాజస్తాన్ ప్రయోగం వికటించినప్పటికి అశ్విన్ మాత్రం చరిత్రకెక్కాడు.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఓపెనర్‌గా ఒకసారి వచ్చిన అశ్విన్.. నెంబర్-3లో నాలుగుసార్లు, నెంబర్-4లో ఒకసారి, నెంబర్-5లో రెండుసార్లు, నెంబర్-6లో ఐదుసార్లు, నెంబర్-7లో 16 సార్లు, నెంబర్-8లో అత్యధికంగా 32 సార్లు, నెంబర్-9లో 11 సార్లు, ఇక చివరగా పదో స్థానంలో నాలుగుసార్లు బ్యాటింగ్‌కు వచ్చాడు. మొత్తానికి బ్యాటింగ్‌లో 76 ఇన్నింగ్స్‌లు ఆడి 648 పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment