IPL 2023, RR Vs PBKS: Shikhar Dhawan Hilarious Stunt After Ravichandran Ashwin Catch Out - Sakshi
Sakshi News home page

IPL 2023: అశ్విన్‌ ఔట్‌.. తొడ గొట్టిన గబ్బర్‌; కావాలనే చేశాడా!

Published Wed, Apr 5 2023 11:04 PM | Last Updated on Thu, Apr 6 2023 10:27 AM

Dhawan Hillarious Stunt After-Ashwin Catch-Out Viral PBKS Vs RR Match - Sakshi

Photo: Jio CInema Twitter

ఐపీఎల్‌ 2023లో పంజాబ్‌ కింగ్స్‌ జోరుమీద ఉంది. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 198 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్తాన్‌ చేధనలో తడబడుతుంది. ఇ‍ప్పటికే ప్రధానమైన నాలుగు వికెట్లు కోల్పోయిన రాజస్తాన్‌ కష్టాల్లో పడింది. 

ఈ విషయం పక్కనబెడితే పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. ఓపెనర్‌గా ప్రమోషన్‌ పొందిన అశ్విన్‌ అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే అశ్విన్‌ ఔట్‌ కాగానే గబ్బర్‌ ప్రేక్షకుల వైపు తిరిగి తొడ గొట్టి మీసం మెలేశాడు. ఇంతకముందు చాలాసార్లు అంతర్జాతీయం సహా ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ధావన్‌ ఇలా తొడ గొట్టడం చూశాం. అయితే మళ్లీ చాన్నాళ్ల తర్వాత తనదైన సెలబ్రేషన్‌తో మెరిశాడు. 

అశ్విన్‌ ఔట్‌ కాగానే ధావన్‌ తొడ గొట్టడంతో ఇదంతా కావాలనే చేశాడని అభిమానులు పేర్కొన్నారు. ఎందుకంటే పంజాబ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో అశ్విన్‌ ధావన్‌ను మన్కడింగ్‌ చేయబోయాడు. కానీ అలా చేయకుండా కేవలం వార్నింగ్‌ ఇచ్చి వదిలిపెట్టాడు. అయితే ధావన్‌ అది మనసులో పెట్టుకున్నాడని.. అందుకే అశ్విన్‌ ఔట్‌ కాగానే తొడగొట్టాడంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: ధావన్‌కు అశ్విన్‌ వార్నింగ్‌.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement