Photo: IPL Website
టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధావన్ సూపర్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ ఆఖరి వరకు నిలిచిన గబ్బర్ 56 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 86 నాటౌట్ వింటేజ్ ధావన్‌ను తలపించాడు. తొలుత ప్రబ్‌సిమ్రన్ సింగ్ రెచ్చిపోతుంటే తాను యాంకర్‌పాత్ర పోషించాడు.
Photo: IPL Website
ప్రబ్‌సిమ్రన్ ఔటైన తర్వాత ధావన్ తన ఆట మొదలుపెట్టాడు. చహల్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ నాలుగో బంతిని బౌండరీ బాదడం ద్వారా ధావన్ అర్థసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో ధావన్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్‌లో ధావన్‌కు ఇది 48వ అర్థసెంచరీ కాగా ఓవరాల్‌గా అతనికి ఇది 50వ 50ప్లస్ స్కోరు కావడం విశేషం.
ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్(54 అర్థసెంచరీలు) తర్వాత అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన రెండో ఆటగాడిగా.. టీమిండియా తరపున తొలి బ్యాటర్‌గా ధావన్ నిలిచాడు. ఇక కింగ్ కోహ్లి 45 హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రాజస్తాన్ రాయల్స్‌పై ధావన్‌కు ఇది ఏడో హాఫ్ సెంచరీ.
Photo: IPL Website
అయితే సీఎస్‌కేపై ధావన్ ఎనిమిది అర్థసెంచరీలు సాధించాడు. ఆ తర్వాత తాను ప్రస్తుతం ఆడుతున్న పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్‌పై ఏడు అర్థసెంచరీలు, ముంబై, కేకేఆర్, ఆర్‌సీబీలపై ఆరు అర్థసెంచరీలు సాధించాడు. ఇక రాజస్తాన్ రాయల్స్‌పై ధావన్ 22 మ్యాచ్‌ల్లో 126 స్ట్రైక్‌రేట్‌తో 576 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌లో 85 పరుగుల ఇన్నింగ్స్ ధావన్‌కు అత్యధిక స్కోరుగా ఉంది.
చదవండి: ధావన్‌కు అశ్విన్ వార్నింగ్.. వీడియో వైరల్
ధావన్ దెబ్బకు రిటైర్డ్‌హర్ట్.. ఐపీఎల్‌కు దూరమయ్యే చాన్స్!
That's that from Match 8. @PunjabKingsIPL win their second game on the trot as they beat #RR by 5 runs.
— IndianPremierLeague (@IPL) April 5, 2023
Scorecard - https://t.co/Cmk3rElYKu #TATAIPL #RRvPBKS #IPL2023 pic.twitter.com/R9j1jFpt5C
Comments
Please login to add a commentAdd a comment