పంజాబ్ కింగ్స్‌కు రెండో విజయం.. పోరాడి ఓడిన రాజస్తాన్
198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఐదు పరుగుల తేడాతో పోరాడి ఓడిపోయింది. ఆరంభం నుంచి వికెట్లు కోల్పోయినప్పటికి సంజూ శాంసన్ 42 పరుగులు చేశాడు. ఆ తర్వాత షిమ్రోన్ హెట్‌మైర్ (18 బంతుల్లో 36), ద్రువ్ జురెల్(15 బంతుల్లో 32 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడడంతో ఒక దశలో రాజస్తాన్ గెలుస్తుందని భావించారు. అయితే హెట్‌మైర్ రనౌట్‌తో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆఖరి రెండు బంతుల్లో 11 పరుగులు కావాల్సిన దశలో ఆరు పరుగులు మాత్రమే వచ్చాయి. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ నాలుగు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
15 ఓవర్లలో రాజస్తాన్ 124/6
198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 15 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరగడంతో రాజస్తాన్ ఓటమి నుంచి బయటపడడం కష్టమే. నాథన్ ఎల్లిస్ నాలుగు వికెట్లతో రాజస్తాన్ వెన్ను విరిచాడు.
9 ఓవర్లలో రాజస్తాన్ 81/3
9 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 35, దేవదత్ పడిక్కల్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
విధ్వంసక బట్లర్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోతూ వస్తోంది. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో ఇన్‌ఫాం బ్యాటర్ బట్లర్ అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. శాంసన్ 25 పరుగులతో ఆడుతున్నాడు.
Photo Credit : IPL Website
ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ భారీ స్కోరు; రాజస్తాన్ టార్గెట్ 198
రాజస్తాన్ రాయల్స్‌కు పంజాబ్ కింగ్స్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. శిఖర్ ధావన్(56 బంతుల్లో 86 నాటౌట్, 9 ఫోర్లు, మూడు సిక్సర్లు) వింటేజ్ గబ్బర్‌ను చూపించగా.. ప్రబ్‌సిమ్రన్ సింగ్(34 బంతుల్లో 60 పరుగులు) రాణించాడు.
దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. జితేశ్ శర్మ 27 పరుగులు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో హోల్డర్ రెండు వికెట్లు తీయగా.. అశ్విన్, చహల్ చెరొక వికెట్ పడగొట్టారు.
Photo Credit : IPL Website
ధావన్ అర్థసెంచరీ.. భారీ స్కోరు దిశగా పంజాబ్
పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఐపీఎల్ 50వ అర్థశతకం సాధించాడు. అతని ధాటికి పంజాబ్ స్కోరు పరుగులు పెడుతుంది. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. జితేశ్ శర్మ 27 పరుగులు చేసి చహల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
Photo Credit : IPL Website
ప్రబ్‌సిమ్రన్(60) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
60 పరుగులు చేసిన ప్రబ్‌సిమ్రన్ వెనుదిరగడంతో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 34 బంతుల్లోనే 60 పరుగులతో ధాటిగా ఆడుతున్న ప్రబ్‌సిమ్రన్ జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. ధావన్ 26, రాజపక్స్ 1 పరుగుతో ఆడుతున్నారు.
Photo Credit : IPL Website
దాటిగా ఆడుతున్న ప్రబ్‌సిమ్రన్.. 4 ఓవర్లలో 45/0
రాజస్తాన్‌తో మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్ ధాటిగా ఆరంభించింది. 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ సింగ్ 30 పరుగులతో వేగంగా ఆడుతున్నాడు. ధావన్ 13 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు.
Photo Credit : IPL Website
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఏంచుకున్న రాజస్తాన్
మూడేండ్ల (2020లో చివరి మ్యాచ్) తర్వాత ఐపీఎల్ కు ఆతిథ్యమిస్తున్న అసోం లోని గువహతి స్టేడియంలో నేడు రాజస్తాన్ రాయల్స్ - పంజాబ్ కింగ్స్ లు ఈ సీజన్ లో తొలిసారి తలపడుతున్నాయి. గువహతిలోని బర్సపర స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్స, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, KM ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్
.@IamSanjuSamson wins the toss & @rajasthanroyals will field first in the first ever #TATAIPL match at the Barsapara 🏟️
Tune in to #IPLonJioCinema NOW to watch #RRvPBKS - streaming LIVE and FREE for all telecom operators! #IPL2023 #TATAIPL #JioCinema | @PunjabKingsIPL pic.twitter.com/RMtDInT0iD
— JioCinema (@JioCinema) April 5, 2023
గత మ్యాచ్లో హైదరాబాద్ ను చిత్తుగా ఓడించిన రాజస్తాన్ రాయల్స్ అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నది. ఆ జట్టు నిండా మ్యాచ్ విన్నర్లకు కొదవ లేదు. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో కళ్లు చెదిరే ఆరంభం ఇచ్చిన జోస్ బట్లర్ - యశస్వి జైస్వాల్ లు మరోసారి అలాంటి ప్రారంభాన్ని ఇవ్వాలని రాజస్తాన్ కోరుకుంటున్నది. వన్ డౌన్ లో సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్, షిమ్రన్ హెట్మెయర్, రియాన్ పరాగ్ లతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ దుర్బేధ్యంగా ఉంది. బౌలింగ్ లో కూడా ట్రెంట్ బౌల్ట్ నాయకత్వంలో పేస్ బాధ్యతలు పంచుకుంటున్న కెఎం ఆసిఫ్ సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ఆకట్టుకున్నాడు. స్పిన్నర్లలో అశ్విన్, చహల్ రూపంలో రాజస్తాన్ కు ప్రపంచ స్థాయి బౌలింగ్ యూనిట్ ఉంది.
పంజాబ్ కూడా బ్యాటింగ్ లో శిఖర్ ధావన్, భానుక రాజపక్స వంటి అనుభవజ్ఞులతో పాటు ఏ స్థానంలో వచ్చినా రెచ్చిపోయే ఆడే జితేశ్ శర్మ, సామ్ కరన్, సికిందర్ రజలతో బ్యాటింగ్ లైనప్ బాగానే ఉంది. కోల్కతా తో మ్యాచ్ లో ఆడింది తక్కువ బంతులే అయినా ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఆకట్టుకున్నాడు. ఇక బౌలింగ్ లో అర్ష్‌దీప్ సింగ్, సామ్ కరన్, నాథన్ ఎల్లీస్ లపైనే పంజాబ్ ఆశలు పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment