Photo: IPL Twitter
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ హైదరాబాద్ అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. ఆదివారం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి ఆఖరి వరకు నిలిచి 66 బంతుల్లో 99 పరుగులు చేసిన ధావన్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం ఒంటరిపోరాటం చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.
ఈ క్రమంలో ఒక్క పరుగు దూరంలో సెంచరీ మార్క్‌కు దూరమైనప్పటికి కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా 88 పరుగుల వద్ద పంజాబ్ తొమ్మిదో వికెట్ కోల్పోయాకా ధావన్.. ఆఖరి నెంబర్ బ్యాటర్‌తో కలిసి పదో వికెట్‌కు 55 పరుగులు అజేయంగా జోడించి చరిత్ర సృష్టించాడు.
ఇక ఎస్‌ఆర్‌హెచ్‌పై 99 పరుగుల ఇన్నింగ్స్‌తో ధావన్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన టీమిండియా ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు కోహ్లి ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు 50 సార్లు చేయగా.. తాజాగా ధావన్ కోహ్లి రికార్డును బద్దలుకొట్టి 51వ ఫిఫ్టీ ప్లస్ స్కోరు సాధించాడు.
కాగా కోహ్లి 50- ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేయడానికి 216 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. ధావన్ మాత్రం 206 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇక తొలి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 60 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు.
ఇక తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం ధావన్ మాట్లాడుతూ.. ''హైదరాబాద్ ప్రజలు నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్ అనుకుంటున్నా. ఒకవైపు వికెట్లు పడుతుండడంతో ఒకదశలో ఒత్తిడి అనిపించింది. కానీ ఏమైనా సరే చివరి వరకు నిలబడాలనుకున్నా.. అందుకే వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడాను. సెంచరీ మార్క్ మిస్ అవడం కంటే ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడానన్న సంతోషం ఎక్కువగా ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.
Shikhar Dhawan said, "I'm glad that the Hyderabad crowd still remembers me".
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 9, 2023
Comments
Please login to add a commentAdd a comment