Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ స్టార్.. కింగ్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో కోహ్లి సూపర్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇక ఉప్పల్‌లో మ్యాచ్ అంటే చాలు కోహ్లి చెలరేగిపోతాడు. అంతర్జాతీయ మ్యాచ్ నుంచి ఐపీఎల్ దాకా కోహ్లికి ఉప్పల్ స్టేడియంలో మంచి రికార్డు ఉంది. కోహ్లి ఉప్పల్‌లో ఇప్పటివరకు 12 టి 20 మ్యాచ్‌లు(అంతర్జాతీయ, ఐపీఎల్) ఆడి 592 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో దానిని కంటిన్యూ చేశాడు.కచ్చితంగా గెలవ్సాలిన మ్యాచ్‌లో జూలు విదిల్చిన కోహ్లి 61 బంతుల్లో సెంచరీ సాధించడం విశేషం. కోహ్లికి ఇది ఐపీఎల్‌లో ఆరో శతకం కాగా.. సీజన్‌లో ఆర్‌సీబీకి ఇది తొలి శతకం. దీంతో పాటు ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ మరిన్ని రికార్డులు కొల్లగొట్టింది. అవేంటో ఒకసారి చూద్దాం.
ఈ క్రమంలో కోహ్లి ఐపీఎల్ 16వ సీజన్‌లో 500 పరుగుల మార్క్‌ను పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి 500 ప్లస్ స్కోర్లు చేయడం ఇది ఆరోసారి. టీమిండియా తరపున ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు.
ఆర్‌సీబీ తరపున కోహ్లి 7500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ కలిపి కోహ్లి ఈ మార్క్ సాధించాడు. ఆర్‌సీబీ తరపున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు.
ఇక కోహ్లి-డుప్లెసిస్ ద్వయం ఆర్‌సీబీ తరపున వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇది నాలుగోసారి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక 100 ప్లస్ భాగస్వామ్యాలు నమోదు చేసిన జాబితాలో డేవిడ్ వార్నర్-శిఖర్ ధావన్ జోడి(ఎస్‌ఆర్‌హెచ్, ఆరుసార్లు) తొలి స్థానంలో ఉండగా.. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో(ఎస్‌ఆర్‌హెచ్, ఐదుసార్లు) రెండో స్థానంలో ఉన్నారు. ఇక మయాంక్ అగర్వాల్- కేఎల్ రాహుల్ జోడి(పంజాబ్ కింగ్స్), క్రిస్ గేల్, విరాట్ కోహ్లి జోడి(ఆర్‌సీబీ), కోహ్లి-డుప్లెసిస్(ఆర్‌సీబీ) నాలుగేసి సార్లు వంద ప్లస్ పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశారు.
ఇక ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో ఒక జోడి 800 ప్లస్ పరుగులు జోడించడం ఇది రెండోసారి మాత్రమే. కోహ్లి-డుప్లెసిస్ జోడి ఈ సీజన్‌లో 800 పరుగులు జోడించారు. ఇంతకముందు 2016లో కోహ్లి-డివిలియర్స్ జోడి 800 పరుగులకు పైగా జోడించారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆర్‌సీబీ, కోహ్లి కామన్‌గా ఉండడం విశేషం.
💯 Bow down to the greatness of 👑 #ViratKohli 👏
— JioCinema (@JioCinema) May 18, 2023
He is now tied with Chris Gayle for the most #TATAIPL hundreds 🔥#SRHvRCB #IPLonJioCinema #IPL2023 #EveryGameMatters pic.twitter.com/OGxWztuhk6
చదవండి: నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో మెరిసిన 'కింగ్' కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment