Batting order
-
'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్'.. రూల్స్ ఒప్పుకోవు
వెస్టిండీస్‌తో తొలి టి20లో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. విండీస్ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ విఫలమవడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ 39, సూర్యకుమార్ యాదవ్ 21 పరుగులు ఉన్నంతవరకు మ్యాచ్ టీమిండియావైపే ఉన్నప్పటికి.. స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడం.. ఆ తర్వాత పాండ్యా(19 పరుగులు) వెనుదిరగడంతో టీమిండియా ఓటమి దాదాపు ఖరారైపోయింది. సంజూ శాంసన్, అక్షర్ పటేల్‌లు ఉన్నప్పటికి రాణించడంలో విఫలమయ్యారు. ఇక భారత ఇన్నింగ్స్ చివర్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యజ్వేంద్ర చహల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై చిన్నపాటి కన్ఫ్యూజన్ ఏర్పడింది. వాస్తవానికి 10వ నెంబర్లో ముకేశ్ కుమార్.. చహల్ చివరి స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. కుల్దీప్ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగిన సమయంలో టీమిండియా విజయానికి ఐదు బంతుల్లో 10 పరుగులు కావాలి. ముకేశ్ పొడగరి కాబట్టి విండీస్ బౌలర్లను ఎదుర్కొని ఆడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అతన్ని పదో నెంబర్లో బ్యాటింగ్‌కు పంపాలని భావించింది. కానీ సమన్వయ లోపంతో చహల్ అప్పటికే 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేశాడు. క్రీజులోకి వచ్చేసిన చహల్ స్ట్రైకింగ్ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. కోచ్ ద్రవిడ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యాలు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికి వచ్చి చహల్‌ను వెనక్కి రావాలని పిలుపునిచ్చారు. దీంతో చహల్ మళ్లీ పెవిలియన్ వైపు వెళ్లడానికి సిద్దమయ్యాడు. కానీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లో ఒక బ్యాటర్ మైదానంలో అడుగుపెట్టిన తర్వాత మళ్లీ తిరిగి వెళ్లడానికి ఆస్కారం ఉండదు. ఈ విషయం పాండ్యా, ద్రవిడ్‌లకు లేటుగా తెలియడంతో ఏం చేయలేకపోయారు. కెప్టెన్ పిలుపుతో ఆల్మోస్ట్ బౌండరీ లైన్ దగ్గరికి వచ్చిన చహల్‌ను అంపైర్ వెనక్కి పిలవడంతో మళ్లీ బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. ఈ సమయంలో ముకేశ్ కుమార్ బౌండరీ లైన్ వద్ద బ్యాటింగ్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి చహల్ చర్య మనకు నవ్వు తెప్పిస్తే.. మేనేజ్మెంట్ను మాత్రం గందరగోళానికి గురి చేసింది. ఇక చివరి ఐదు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసిన టీమిండియా నాలుగు పరుగుల తేడాతో మ్యాచ్‌ను విండీస్‌కు అప్పగించింది. Yuzvendra Chahal walked out at No.10, but the Indian team wanted Mukesh Kumar. Chahal walked off and entered again as he took the field already#Yuzvendrachahal😂😂#INDvWI pic.twitter.com/8rWxh30ahh — Md Nayab 786 🇮🇳 (@mdNayabsk45) August 3, 2023 చదవండి: ధోని రనౌట్‌తో పోలుస్తున్నారు.. శాంసన్ కెరీర్ ముగిసినట్లా! -
రోహిత్ చివరగా ఏడో స్థానంలో ఎప్పుడు బ్యాటింగ్‌కు వచ్చాడంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలోనూ ఓపెనర్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. వన్డే, టెస్టులు, టి20లు ఇలా ఏదైనా ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సెహ్వాగ్ తర్వాత ఓపెనింగ్‌లో విధ్వంసం సృష్టించగల బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి రోహిత్ వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఓపెనింగ్ చేయకుండా ఏకంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్లను ఓపెనింగ్ పంపించారు. ఇక మూడో స్థానంలో రావాల్సిన కోహ్లి కూడా బ్యాటింగ్‌కు రాలేదు. వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలమెంత అనేది తెలుసుకోవడంతో పాటు వన్డే స్పెషలిస్ట్‌కు అవకాశం ఇవ్వాలని ఇలా ప్లాన్ చేసినట్లు రోహిత్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. ఇప్పుడంటే ఓపెనింగ్ బ్యాటర్‌గా వస్తున్న రోహిత్ కెరీర్ ఆరంభంలో ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. చివరిసారి 2011 జనవరిలో సౌతాఫ్రికాతో వన్డేలో ఏడో స్థానంలో రోహిత్ బ్యాటింగ్ చేశాడు. ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ ఆ విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు. కొస మెరుపు ఏంటంటే అదే ఏడాది ఏప్రిల్‌లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. కానీ రోహిత్ ఆ వరల్డ్‌కప్‌కు ఎంపిక కాలేదు. "టీమిండియా తరపున అరంగేట్రం చేసినప్పుడు ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడిని. తాజాగా విండీస్‌తో తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ద్వారా మళ్లీ నాకు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి. 2011 నాకు అసలు కలిసి రాలేదు. వరల్డ్ కప్ జట్టులో నేను లేను.దానికి నన్ను నేనే నిందించుకోవాలి. నేను నా ఆటపై దృష్టి సారించాను. యోగా, మెడిటేషన్, ఒంటరిగా ఉండటం నాకు చాలా సాయం చేశాయి. నేను మారాల్సిన అవసరం ఉందని ఒకవేళ నేను మెరుగవ్వకపోతే మళ్లీ క్రికెట్ ఆడలేను అన్న విషయం అర్థమైంది. 2014-15 మధ్య నేను చాలా మారాను. లేదంటే నేను కొనసాగలేనన్న విషయం నాకు అర్థమైంది" అని రోహిత్ అన్నాడు. ఇక తొలి వన్డేలో ఇండియా 5 వికెట్లతో గెలిచి మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే జూలై 29న(శనివారం) బార్బడోస్ వేదికగా జరగనుంది. చదవండి: Major League Cricket 2023: డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఫైనల్లో సీటెల్ ఓర్కాస్ బ్యాటింగ్‌కు రాకపోయినా అరుదైన రికార్డుతో మెరిసిన కోహ్లి -
అరుదైన ఫీట్.. అన్ని స్థానాల్లో బ్యాటింగ్ చేసిన ఒకే ఒక్కడిగా
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్లో ఇంతవరకు ఎవరికి సాధ్యం కాని అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్లో ఒకటో నెంబర్ నుంచి పదో నెంబర్ వరకు అన్ని స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన ఒకే ఒక్కడిగా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటికైతే ఈ రికార్డు యూనిక్‌గా మిగిలిపోనుంది. తాజాగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అశ్విన్ ఓపెనర్‌గా వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే రాజస్తాన్ చేసిన ఈ ప్రయోగం బెడిసికొట్టింది. ఎందుకంటే అశ్విన్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. రాజస్తాన్ ప్రయోగం వికటించినప్పటికి అశ్విన్ మాత్రం చరిత్రకెక్కాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఓపెనర్‌గా ఒకసారి వచ్చిన అశ్విన్.. నెంబర్-3లో నాలుగుసార్లు, నెంబర్-4లో ఒకసారి, నెంబర్-5లో రెండుసార్లు, నెంబర్-6లో ఐదుసార్లు, నెంబర్-7లో 16 సార్లు, నెంబర్-8లో అత్యధికంగా 32 సార్లు, నెంబర్-9లో 11 సార్లు, ఇక చివరగా పదో స్థానంలో నాలుగుసార్లు బ్యాటింగ్‌కు వచ్చాడు. మొత్తానికి బ్యాటింగ్‌లో 76 ఇన్నింగ్స్‌లు ఆడి 648 పరుగులు సాధించాడు. -
'రూట్' దారి తప్పింది.. 'నా రోల్ ఏంటో తెలుసుకోవాలి'
జో రూట్.. ఈతరంలో గొప్ప టెస్టు క్రికెటర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు. కెప్టెన్‌గా ఎన్నో టెస్టుల్లో ఇంగ్లండ్‌కు విజయాలు అందించాడు. టెస్టుల్లో 10వేలకు పైగా పరుగులు చేసిన రూట్ ఖాతాలో 28 సెంచరీలు ఉన్నాయి. మధ్యలో ఇంగ్లండ్ జట్టు రూట్ కెప్టెన్సీలో పాతాళానికి పడిపోయినప్పటికి బ్యాటర్‌గా మాత్రం తాను ఎప్పుడు విఫలమవ్వలేదు. ఇంగ్లండ్ జట్టులో గత పదేళ్లలో స్థిరంగా పరుగులు సాధించిన బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే అది రూట్ మాత్రమే. ఒకానొక దశలో 52 ఉన్న స్ట్రైక్‌రేట్ కాస్త 81.2కు పెరగడం చూస్తే రూట్ ఏ స్థాయిలో ఆడాడన్నది అర్థమవుతుంది. అయితే కొంతకాలంగా రూట్ బ్యాట్ మూగబోయింది. ఒకప్పుడు పరుగులు వెల్లువలా వచ్చిన బ్యాట్ నుంచి ఇప్పుడు కనీసం అర్థసెంచరీ కూడా రాలేకపోతుంది. గత 11 ఇన్నింగ్స్‌లలో కేవలం రెండు ఫిఫ్టీలు మాత్రమే కొట్టి 242 పరుగులు చేసిన రూట్ సగటు 22కు పడిపోయింది. అయితే కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత కొంతకాలం స్థిరంగానే ఆడాడు. అయితే క్రమంగా స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ టెస్టులోనే బలంగా తయారవుతున్న వేళ రూట్ మాత్రం ఫామ్ కోల్పోయాడు. చివరగా టీమిండియాతో జరిగిన రీషెడ్యూల్డ్ ఐదో టెస్టులో సెంచరీ బాదిన రూట్.. ఆ తర్వాత పెద్దగా రాణించలేదు. సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌తో పాటు పాకిస్తాన్ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లోనూ రూట్ పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. అయితే తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఫిఫ్టీ సాధించడం ద్వారా రూట్ ఫామ్‌లోకి వచ్చినట్లే అనిపిస్తున్నాడు. మ్యాచ్‌లో ఇంగ్లండ్ 267 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. స్టోక్స్ నేతృత్వంలో సరికొత్తగా దూసుకెళ్తున్న టెస్టు టీమ్‌లో తన రోల్ ఏంటో తెలుసుకోవాలని ఉందంటూ రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బజ్‌బాల్‌తో సంచలనాలు సృష్టిస్తున్న ఇంగ్లండ్.. కివీస్‌తో మ్యాచ్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించింది. తొలిరోజునే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడంపై విమర్శలు వచ్చినప్పటికి.. స్టోక్స్‌కు తన జట్టు బౌలర్లపై ఉన్న నమ్మకం ఏంటనేది మరుసటి రోజే తెలిసొచ్చింది. అయితే ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ వేగంగా మారుతున్న సమయంలో రూట్ ఏ స్థానంలో రావాలనేది కాస్త డైలమాలో పడింది. తన కెరీర్లో రూట్ ఎక్కువ భాగం మూడో స్థానంలో వచ్చేవాడు. మూడో స్థానంలో వచ్చి ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన రూట్.. ఇవాళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఇదే అంశంపై విజ్డెన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో రూట్ మాట్లాడుతూ.. ''ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్టు జట్టు వేగంగా మారుతోంది. కాలానికి అనుగుణంగా బజ్‌బాల్‌తో స్టోక్స్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. కోచ్ మెక్కల్లమ్- కెప్టెన్ స్టోక్స్‌ల ఆధ్వర్యంలో ఎలా బ్యాటింగ్ చేయాలనేది పరిశీలిస్తున్నా. కెప్టెన్సీ బాధ్యతల నుంచి బయటపడ్డాకా కాస్త రిలీఫ్ అనిపించింది. అయితే ఇప్పుడు జట్టులో నా రోల్ ఏంటనేది తెలుసుకోవాలి. వినడానికి సిల్లీగా అనిపిస్తున్నప్పటికి ఇది నిజం. గత కొన్ని మ్యాచ్‌లుగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నా. ఎంత సీనియర్ క్రికెటర్ అయినా పరుగులు చేయలేకపోతే జట్టులో స్థానం పోతుంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో రివర్స్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో వికెట్ సమర్పించుకున్నా. ఇది గమనించిన మెక్కల్లమ్.. ఏం కాదులే మరోసారి ప్రయత్నించు.. అంటూ మద్దతిచ్చాడు. అయితే రివర్స్ స్కూప్ ఆడడంలో తాను ఒకప్పుడు సిద్ధహస్తుడిని.. ఇప్పుడు ఆ 'రూట్' దారి తప్పింది. తిరిగి దానిని అందుకోవాలి'' అంటూ ముగించాడు. చదవండి: Team India: సూర్య తప్ప.. స్వస్థలాలకు టీమిండియా క్రికెటర్లు BGT 2023 IND VS AUS: ఆసీస్‌కు బిగ్ షాక్.. మరో వికెట్ డౌన్ -
'నాలుగో నెంబర్ ఇక నాదే.. ఎవరికి ఇవ్వను'
సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం టీమిండియాకు దొరికిన ఒక ఆణిముత్యం. రాబోయే టి20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ కీలకం కానున్నాడు. టీమిండియా నాలుగో స్థానంలో సూర్యను తప్ప మిగతావారిని ఊహించికోవడం కష్టమనేలా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే సూర్యకుమార్ బ్యాటింగ్ చేసే స్థానం గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎందుకంటే కెరీర్ ఆరంభం నుంచి మిడిలార్డర్లో బ్యాటింగ్ వచ్చిన సూర్య.. మధ్యలో కొన్నిసార్లు ఓపెనింగ్ స్థానంలోనూ వచ్చాడు. దీంతో పలువురు మాజీలు సూర్య ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుందని చర్చ జరిపారు. తాజాగా ఒక చానెల్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన సూర్య.. తనకు నాలుగో స్థానం బెస్ట్ అని అభిప్రాయపడ్డాడు."నేను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలను. 1, 3, 4, 5 ఇలా ఎక్కడైనా రాణించగలను. అయితే వ్యక్తిగతంగా నాకు నాలుగో స్థానం ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నా. నేను బ్యాటింగ్ వెళ్లే ఆ స్థానం ఆటను నేను నియంత్రించేలా చేస్తుంది. నేను 7 నుంచి 15 ఓవర్ల మధ్య బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆటను ఆస్వాదించాను. ఆ దశలో నేను సానుకూలంగా ఉండటానికి ప్రయత్నిస్తా. నేను గొప్ప పవర్ ప్లే, స్ట్రాంగ్ ఫినిషింగ్ చేసిన చాలా టీ20 మ్యాచ్‌లు చూశాను. కానీ టీ20ల్లో 8 నుంచి 14వ ఓవర్ వరకు చాలా కీలకం. ఆ సమయంలో మెరుగైన స్కోరు కోసం గట్టిగా ప్రయత్నించాలి. నేను ఆ సమయంలో ఎక్కువ రిస్కీ షాట్లు ఆడటానికి ప్రయత్నించను. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు తాను ఓవర్ కవర్లో ఆడటానికి ప్రయత్నిస్తా. ముఖ్యంగా నాలుగో నెంబర్లో బ్యాటింగ్ చేయడం సవాలుతో కూడుకున్న స్థానం అని పేర్కొన్నాడు. చదవండి: 'అక్క మరణం నా జీవితాన్ని తలకిందులు చేసింది' -
మూడో స్థానం అంటే చాలా ఇష్టం.. అవకాశమొస్తే
Mitchel Marsh Comments On Batting At No. 3.. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ తన బ్యాటింగ్ స్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మూడోస్థానంలో బ్యాటింగ్ అంటే చాలా ఇష్టమని.. అవకాశమిస్తే మాత్రం చెలరేగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నాడు. వాస్తవానికి మార్ష్ ఇటీవలే వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనల్లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ రెండు సిరీస్‌ల్లోనూ మూడోస్థానంలో వచ్చిన మార్ష్ 10 మ్యాచ్‌లాడి 375 పరుగులు చేశాడు. ఇక రాబోయే టి20 ప్రపంచకప్‌లో ఆసీస్ బ్యాటింగ్‌లో కీలకపాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో మార్ష్ ప్రపంచకప్ సన్నాహాలపై ఇంటర్య్వూ చేసింది. చదవండి: టీ20 వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..? ''టి20 ప్రపంచకప్ ప్రిపరేషన్ బాగానే ఉంది. జట్టు కోసం ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు ఇష్టపడతా. కానీ మూడోస్థానంలో బ్యాటింగ్‌కు వస్తే కొంచెం సౌకర్యంగా అనిపిస్తుంది. గత రెండు సిరీస్‌ల్లో ఇదే స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మంచి ప్రదర్శన కనబరిచా. గత కొన్ని నెలలుగా మంచి ఫామ్ కొనసాగిస్తున్నా.. రానున్న టి20 ప్రపంచకప్‌లోనూ అదే జోరును కొనసాగించాలని అనుకుంటున్నా. స్పెషల్ ప్లాన్స్ అంటూ ఏమిలేవు. ఇక నా బ్యాటింగ్ మెరుగుపరుచుకోవడానికి స్పిన్నర్ల బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. మార్కస్ స్టోయినిస్ లాంటి ఆటగాళ్లు క్రీజులో ఉండి కొట్టే భారీషాట్లు నన్ను ఆకట్టుకుంటున్నాయి. క్రీజులోనే వెనక్కి జరిగి డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్‌లు కొట్టడం సూపర్‌గా అనిపిస్తుంది. ఇలాంటి షాట్స్ ఆడేందుకు నేనే ప్రయత్నిస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆస్ట్రేలియా టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో మొదటి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 23న అబుదాబి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. చదవండి: T20 World Cup: అతడితో కలిసి ఓపెనింగ్ చేయడం ఖాయం: పాక్ కెప్టెన్ -
'అప్పటి ధోనివి కాదు.. బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకో'
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో నేడు సీఎస్కేతో పంజాబ్ కింగ్స్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ధోని బ్యాటింగ్ ఆర్డర్‌పై కీలక సూచనలు చేశాడు. ''ధోని తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకుంటే బాగుంటుంది. ఇన్నింగ్స్ సమయంలో తనకు తాను బ్యాటింగ్‌లో ప్రమోషన్ కల్పించుకొని జట్టును ముందుకు నడిపిస్తే బాగుంటుంది. ప్రస్తుతం ధోని వస్తున్న ఏడో స్థానం కర్టెక్ట్ కాదు.. ఎందుకంటే ఇప్పుడు అతను నాలుగైదేళ్ల క్రితం ధోని ఎంత మాత్రం కాదు.. ఒకప్పుడు మ్యాచ్ ఫినిషర్‌గా ఆరు, ఏడు స్థానాల్లో దుమ్ముదులిపిన అతను ఇప్పుడు మాత్రం పరుగులు తీయడానికే ఇబ్బంది పడుతున్నాడు. నా అంచనా ప్రకారం ధోని నాలుగు.. ఏదో స్థానాల్లో వచ్చి ఆడితే బాగుంటుంది'' అని సలహా ఇచ్చాడు. కాగా గతేడాది సీజన్లో ధోని ఏడో స్థానంలో వచ్చి మ్యాచ్‌లు గెలిపించకపోగా స్ట్రైక్ రొటేట్ చేయడంలో విఫలమై విమర్శల పాలయ్యాడు. ఆ సీజన్లో 14 మ్యాచ్‌లాడిన ధోని 200 పరుగులు సాధించాడు. ఫలితం.. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే జట్టు తొలిసారి ప్లేఆఫ్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సీఎస్కే 189 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. తమ బౌలర్ల వైఫల్యంతో సీఎస్‌కు భారీ మూల్యం చెల్లించుకుంది. చదవండి: ఆరుగురు భారత క్రికెటర్లు.. ఒక్కడే విదేశీ క్రికెటర్ పంత్ రనౌట్.. పరాగ్ డ్యాన్స్.. వీడియో వైరల్ -
అది నా ప్రాక్టీస్‌పై ప్రభావం చూపింది: ధోని
దుబాయ్: రాజస్థాన్ రాయల్స్‌పై 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ ధోని 7వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాను ఆ స్థానంలో రావడానికి గల కారణాలను వివరించాడు. నేను చాలా కాలంగా బ్యాటింగ్ చేయలేదు. ఇక్కడి వచ్చాక 14 రోజుల క్వారంటైన్ నిబంధన కూడా నా ప్రాక్టీస్‌పై ప్రభావం చూపింది. విభిన్నంగా ప్రయత్నించడంలో భాగంగానే సామ్ కరన్‌కు అవకాశం ఇవ్వాలని అనుకున్నాను. ఇది సక్సెస్ కాకపోతే మన బలంపై మనం దృష్టిపెట్టొచ్చు. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో మంచి శుభారంభం అవసరం. రాజస్థాన్ జట్టులో స్టీవ్ స్మిత్, సంజు శాంసన్ బాగా ఆడారు. ఆఖర్లో ఆర్చర్ కూడా అద్భుతంగా ఆడాడు. బౌలర్లు కూడా బాగా రాణించారు. అయితే మా బౌలర్లు ఎక్కువగా పుల్ లెంగ్త్ బంతులు వేశారు. రాజస్థాన్‌ను 200లోపు కట్టడి చేసుంటే పరిస్థితి మరోలా ఉండేదని ధోని వివరించారు. (అటు ధోని... ఇటు అంపైర్లు! ) అయితే.. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సంజూ శాంసన్(74).. మరోవైపు స్టీవ్ స్మిత్(69) పరుగులతో దూకుడును ప్రదర్శించగా.. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ 8 బంతుల్లో 27 పరుగులు చేయడంతో రాజస్థాన్ జట్లు చెన్నై ముందు 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 16 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. అయితే చెన్నై జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో ఓపెనర్లు షేన్ వాట్సన్, మురళీ విజయ్ శుభారంభాన్ని అందించినా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రాణించ లేకపోయారు. రన్‌రేట్ పెరుగుతున్న తరుణంలో ధోని బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకొని 7వ స్థానంలో రావడం విమర్శలకు దారితీసింది. -
టైటిల్ నిలబెట్టుకుంటాం
అబుదాబి: ఐపీఎల్లో ఈ సీజన్లోనూ దూసుకెళ్తామని, టైటిల్ నిలబెట్టుకుంటామని డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ సారి కూడా ఓపెనర్‌గానే బ్యాటింగ్‌కు దిగుతానని చెప్పాడు. ఇక్కడ ఆడటం తమ వాళ్లకు కొత్త కావడంతో పరిస్థితులకు అలవాటు పడటం సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై తలపడుతుంది. ఈ నేపథ్యంలో రోహిత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘గతేడాది మొత్తం నేను ఓపెనర్‌గా ఆడాను. ఇప్పుడూ అదే కొనసాగిస్తాను. ముంబైకే కాదు... టీమిండియాకు ఆడేటపుడు కూడా నేను జట్టు మేనేజ్మెంట్కు స్పష్టంగా చెబుతాను. జట్టు కోసం ఎక్కడైనా ఆడతాను. అయితే అసలు సమస్యే లేనప్పుడు దాని బాగు చేయాలని ప్రయత్నించడంలో అర్థం లేదు’ అని చెప్పాడు. ఇక్కడి పరిస్థితులతో పెను సవాళ్లు తప్పవని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ‘ముఖ్యంగా పిచ్‌ను అర్థం చేసుకుంటేనే మానసికంగా సన్నద్ధం కాగలం. బ్యాటింగ్ అయినా... బౌలింగ్ అయినా... వికెట్ అర్థమైతే అందుకు తగ్గ ప్రణాళికతో అడుగు వేయొచ్చు. గతంలో ఇక్కడి ప్రదర్శనతో ఇప్పుడైతే ఓ అంచనాకు రాలేం’ అని రోహిత్ వివరించాడు. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 2014లో ఇక్కడ జరిగిన ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ప్లే–ఆఫ్స్‌కు వెళ్లింది. ఆసియా కప్‌లో టీమిండియాకు ఎదురైన అనుభవాలు తనకు తెలుసని, ఆట మొదలైనప్పుడు ఉండే పిచ్ ముగిసే సమయానికి ఎలా మారుతుందో ఇప్పుడు ఐపీఎల్లో కూడా అలాగే మారొచ్చని చెప్పాడు. కృనాల్ పాండ్యా, రాహుల్ చహర్, బల్వంత్రాయ్, అనుకూల్ రాయ్‌లతో కూడిన స్పిన్ విభాగంపై రోహిత్ ఆశలు పెట్టుకున్నాడు. వీళ్లందరికీ దేశవాళీ క్రికెట్లో మంచి అనుభవాన్ని గడించారని అది ఇక్కడ అక్కరకు వస్తుందని అన్నాడు. తొలిమ్యాచ్ ప్రత్యర్థి చెన్నై సూపర్‌కింగ్స్‌పై మాట్లాడుతూ మేటి జట్ల మధ్య ఆసక్తికర సమరం జరుగుతుందన్నాడు. లంక స్పీడ్‌స్టర్, సీనియర్ బౌలర్ మలింగ లేకపోవడం తమకు లోటేనని హిట్‌మ్యాన్ చెప్పాడు. ముంబై విజయాల్లో అతని పాత్ర ఎంతో ఉందన్నాడు. మలింగ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమే అయినా ఇతర పేసర్లు ప్యాటిన్సన్, ధావల్ కులకర్ణి, మొహసిన్ ఖాన్లు సత్తా చాటుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. కోచ్ మహేలా జయవర్ధనే మాట్లాడుతూ... ‘గాయం నుంచి కోలుకొని సుదీర్ఘ కాలం తర్వాత బరిలోకి దిగుతున్న హార్దిక్ పాండ్యాపై అనవసర ఒత్తిడి పెంచబోం, విజయవంతమైన ఫినిషర్లుగా మారెందుకు చాలా మందికి ఇప్పుడు అవకాశాలున్నాయి. క్రిస్ లిన్ రూపంలో నాణ్యమైన డాషిం గ్ ఓపెనర్ ఉన్నప్పటికీ ఈ సారి కూడా రోహిత్–డికాక్ జోడీనే ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తుంది’ అని స్పష్టం చేశాడు. -
కోహ్లిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ క్రికెటర్
ముంబై : మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘోర పరాభవం మూట గట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై మాజీ ఆటగాళ్లు పెదవి విరుస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఆటగాడు మాథ్యూ హేడెన్ కోహ్లిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రసుత్తం హెడెన్ కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. 'విరాట్ కోహ్లి ఇప్పటివరకు 243 మ్యాచ్‌లు ఆడగా అందులో 180 ఇన్నింగ్స్‌ల్లో మూడో స్థానంలో ఆడి 63.09 స్ర్టైక్ రేట్‌తో 10వేల పరుగులకు పైగా సాధించాడు. అతనికి అచ్చి వచ్చిన స్థానం నుంచి కోహ్లి ఎందుకు తప్పుకోవాలి. అందరూ భారత ఓటమి గురించే మాట్లాడుతున్నారు గానీ ఎవరు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కేఎల్ రాహుల్ కోసం కోహ్లి తన స్థానాన్ని వదులుకోవడం నాకు నచ్చలేదు. కోహ్లి మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిందే' అంటూ హేడెన్ పేర్కొన్నాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో రోహిత్‌కు విశ్రాంతి కల్పించడంతో ధావన్,రాహుల్‌లు ఓపెనింగ్‌లో రాగా కోహ్లి మూడో స్థానంలో వచ్చాడు. అయితే లంకతో జరిగిన సిరీస్‌లో రాహుల్‌తో పాటు జట్టులో పునరాగమనం చేసిన ధావన్ కూడా బాగా ఆకట్టుకున్నాడు. దీంతో ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో రాహుల్, ధావన్‌లలో ఎవరికి చోటు కల్పించాలనేదానిపై సెలక్టర్లకు తలనొప్పిగా మారింది. ఇక చేసేదేంలేక కోహ్లి తన మూడో స్థానాన్ని రాహుల్‌కు ఇచ్చేసి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే కోహ్లి ఇప్పటివరకు 38 ఇన్నింగ్స్‌ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 1751 పరుగులు చేశాడు. దీంట్లో 7 శతకాలు, 8అర్థశతకాలు ఉన్నాయి. 2015 నుంచి 6సార్లు నాలుగోస్థానంలో బరిలోకి దిగిన కోహ్లి అంతగా ఆకట్టుకోలేదు. ఈ ఆరు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 9,4, 3, 11, 12, 7, 16 పరుగులు చేశాడు. -
అందుకే నా బ్యాటింగ్ ఆర్డర్ అలా: ధోని
ముంబై: ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్న చెన్నై.. చివరకు టైటిల్‌తో ఘనంగా ముగింపునిచ్చింది. తుది పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పైచేయి సాధించిన ధోని అండ్ గ్యాంగ్.. టైటిల్‌ను ముద్దాడింది. ఈ టైటిల్‌ను సాధించడంలో కెప్టెన్ ధోని కీలక పాత్ర పోషించాడు. ప్రధానంగా బ్యాటింగ్‌లో ముఖ్య పాత్ర పోషించి చెన్నైకు ముచ్చటగా మూడో టైటిల్‌ను అందించాడు. కాకపోతే, ఐపీఎల్-11 సీజన్లో బ్యాటింగ్ ఆర్డర్‌ను పదేపదే మార్చుకోవడంపై ధోని స్పందించాడు. ‘నేను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్న సమయంలోనే ఫిట్నెస్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఐపీఎల్‌కు ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. ఈ సీజన్లో ఐపీఎల్ జట్టు కోసం చర్చించాల్సిన సందర్భంలో నా బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకోవాలనే ఆలోచనకు వచ్చా. అందుకు నా వయసు ఒక కారణం. ఓవరాల్ ఐపీఎల్లో నా బ్యాటింగ్ ఆర్డర్లో కింది స్థానాల్లో వచ్చిన సమయాల్లో నేను పెద్దగా రాణించలేదు. అందుకు ఈ సీజన్లో సాధ్యమైనంత వరకూ బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రావాలని ఫిక్సయ్యా. నాకు మా జట్టు గెలవడమే ముఖ్యం. దానిలో భాగంగానే ప్రణాళికలు సిద్దం చేసుకున్నాం. ముఖ్యంగా గేమ్‌లో ఓవర్ల ఆధారంగా నా బ్యాటింగ్ ఆర్డర్‌ను 3,4,5 స్థానాలకు మార్చుకుంటూ వచ్చా. మా జట్టు దిగువ స్థాయి బ్యాటింగ్‌ను కూడా సమతూకంగా ఉండేలా చూసుకున్నాం. దాంతో నా బ్యాటింగ్ ఆర్డర్‌ను ముందుకు తీసుకురావడానికి చాన్స్ దొరికింది’ అని ధోని తెలిపాడు. -
నాలుగు నచ్చింది
ఆర్డర్ మార్చి ఫలితం సాధించిన ధోని ఒత్తిడికి దూరంగా స్వేచ్ఛగా బ్యాటింగ్ భారత్‌కు అద్భుత విజయాలు అందించిన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని సాధించిన కీర్తి అపారం. దీంతో పాటు వన్డేల్లో తన బ్యాటింగ్‌తోనూ సత్తా చాటిన అతను సుదీర్ఘకాలంగా ‘ఫినిషర్’ అనే పదానికి అసలైన అర్థంగా మారిపోయాడు. ముందుగా బ్యాటింగ్ అరుుతే చివరి ఓవర్లలో మెరుపు షాట్లతో స్కోరు బోర్డును పరుగెత్తించడం, లక్ష్యాన్ని ఛేదించే సమయంలోనైతే కావాల్సిన వేగంతో పాటు సరిగ్గా లెక్క వేసుకొని అతను గెలిపించిన మ్యాచ్‌లు ఎన్నో. ఇక సిక్సర్‌తో మ్యాచ్ ముగించిన క్షణాలు అభిమానులందరి మనసుల్లో ముద్రించుకుపోయారుు. అరుుతే అలాంటి ఫినిషర్ ఇప్పుడు ‘ఫినిష్’ కావాలని అతనే భావిస్తున్నాడు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడాలని కోరుకుంటున్నాడు. సాక్షి క్రీడా విభాగం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ధోని ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే సమయానికి భారత్ విజయం కోసం 31.2 ఓవర్లలో 171 పరుగులు చేయాల్సి ఉంది. రన్‌రేట్ కూడా ఆరు లోపే ఉంది. ముగ్గురు టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అప్పటికే వెనుదిరిగిన దశలో ధోని మ్యాచ్‌ను గెలిపిస్తాడని అభిమానులు ఆశించడంలో తప్పు లేదు. కానీ ఇబ్బందిగా ఆడిన ధోని చివరకు 65 బంతుల్లో 39 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఇది సహజంగానే అందరినీ నిరాశలో ముంచెత్తింది. సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా ధోని ఫినిషర్ అనేది ముగిసిపోరుున గతంగా చాలా మంది వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒకసారి ఇలాంటి చర్చే వచ్చినప్పుడు ‘నేనొక్కడినే ఫినిష్ చేయాలా, మిగతావారు జట్టు సభ్యులు కారా’ అంటూ ఒకింత ఆగ్రహంతోనే ధోని జవాబిచ్చాడు. కానీ ఈసారి అతను మరో సారి చర్చకు అవకాశం ఇవ్వలేదు. ఆ స్థానంలో తన సహజమైన ఆటతీరును కోల్పోతున్నానని, అందుకే నాలుగో స్థానానికి మారుతున్నానని కచ్చితంగా చెప్పేశాడు. గెలుపులో భాగమై... మొహాలీ వన్డేలో 9వ ఓవర్లోనే ధోని క్రీజ్‌లోకి వచ్చాడు. 41 పరుగులకే జట్టు 2 వికెట్లు కోల్పోరుున దశలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి బాధ్యతాయుతంగా ఆడాడు. తగినన్ని ఓవర్లు ఉండటంతో అతను వచ్చీ రాగానే షాట్లకు పోకుండా కుదురుగా ఆడే అవకాశం దక్కింది. మొదటి 30 బంతుల్లో 20 పరుగులే చేసినా ఆ తర్వాత మెల్లగా దూకుడు పెంచి మంచి స్ట్రైక్‌రేట్‌ను అందుకున్నాడు. ఇప్పుడు ఇదే తరహా ఆటను అతను ఇష్టపడుతున్నాడు. క్రీజ్‌లో ఎక్కువ సేపు గడపాలని భావిస్తున్నట్లు అతనే స్వయంగా చెప్పుకున్నాడు ‘అప్పటికే 2 వికెట్లు మాత్రమే కోల్పోరుు ఉంటాము పెద్దగా ఒత్తిడి ఉండదు. ఇది జట్టు కోసం కాకుండా నా కోసం తీసుకున్న నిర్ణయం. చాలా కాలంగా దీని గురించి ఆలోచిస్తున్నాను. ఈ మ్యాచ్‌లో పరుగులు సాధించడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఇన్నింగ్స మరిన్ని ఆడాలని కోరుకుంటున్నా’ అని ధోని వ్యాఖ్యానించాడు. ఒక దశలో సెంచరీ చేస్తాడనిపించి విఫలమైనా... ఈ ఇన్నింగ్స చూసినవారు అతని ఆటను ప్రశంసించకుండా ఉండలేరు. వాస్తవంగా కూడా మూడో వన్డేలో ధోని ముందుగా రాకుండా పాండే గానీ జాదవ్ గానీ వచ్చి ఉంటే పరిస్థితి ఇంత మెరుగ్గా ఉండకపోయేదేమో. ఆ సమయంలో మరో వికెట్ పడితే మళ్లీ ధోనిపైనే ముగించాల్సిన ఒత్తిడి, ఫలితం మారే ప్రమాదం కూడా ఉండేది. కానీ ఇలాంటిది లేకుండా అతను స్వేచ్ఛగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగలిగాడు. ఐదునుంచి ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగినప్పుడు వచ్చీ రాగానే మిగిలిన 10-12 ఓవర్లలో భారీ షాట్లు కొట్టాలని ప్రయత్నించడం, అటు వైపు చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మన్ లేక మొత్తం భారం తనపైనే పడటం వల్ల తన స్ట్రరుుక్ రొటేట్ చేసే సామర్థ్యం కోల్పోరుునట్లు ధోని అంగీకరించాడు. అరుుతే జట్టు అవసరాల దృష్ట్యా మరో అనుభవజ్ఞుడైన ఆటగాడు లేక ఫినిషింగ్ బాధ్యతను అతను తీసుకున్నాడు. ఇక ముందూ కొనసాగాలి వన్డేల్లో మధ్య ఓవర్లలో జాగ్రత్తగా ఆడుతూనే మధ్య మధ్యలో భారీ షాట్లు కొట్టగల నైపుణ్యం కీలకం. విరాట్ కోహ్లి ఇందులో మాస్టర్ కాగా మరో వైపునుంచి కూడా అదే స్థారుు ఆటగాడు ఉంటే భారత్‌కు తిరుగుండదు. దానికి ధోనిని మించిన బ్యాట్స్‌మన్ ఎవరూ ఉండరు. 3, 4 స్థానాల్లో కోహ్లి, ధోని ఆడే జట్టును దెబ్బ తీయడం ఏ ప్రత్యర్థికీ అంత సులువు కాదు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో సగంకంటే ఎక్కువ ఓవర్లు (27.1) క్రీజ్‌లో కలిసి ఆడటంతో మ్యాచ్ దిశను మార్చడం సాధ్యమైంది. వీరిద్దరు కలిసి 151 పరుగులు జోడించడంతోనే మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చింది. వీరిద్దరి మధ్య ఉండే సమన్వయం జట్టు పనిని సులువు చేస్తుందనడంలో సందేహం లేదు. ‘నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగితే నాకు విరాట్‌తో కలిసి ఆడే అవకాశం వస్తుంది. మేమిద్దరం వికెట్ల మధ్య చాలా వేగంగా పరుగెత్తుతాం. పరుగు లేని చోట సింగిల్, సింగిల్ అనుకున్న చోట రెండు పరుగులు తీసి అత్యుత్తమ ఫీల్డర్లపై కూడా ఒత్తిడి పెంచగలం. మధ్య ఓవర్లలో వందకుపైగా పరుగులు భాగస్వామ్యం ఒకటి నమోదైతే ఆ తర్వాతి బ్యాట్స్‌మెన్ పని సులువవుతుంది’ అని మహి విశ్లేషించాడు. నాలుగో స్థానంలో ఆడినప్పుడు కూడా అతని రికార్డు అద్భుతంగానే ఉంది. 24 వన్డేల్లో ధోని 61.63 సగటుతో 1171 పరుగులు సాధించాడు. ఒక వైపు ధోని కెరీర్ చివరి దశలో ఉండగా, మరో వైపు 2019 వరల్డ్ కప్ జట్టును నిర్మించే ప్రయత్నాలు సాగుతున్నారుు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత కూడా అతనిపై ఉంది. మ్యాచ్‌లో నాలుగో స్థానంతో బరిలోకి దిగినప్పుడు ఇతర ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా లభిస్తుంది. రైనాను ఇక నమ్మలేని పరిస్థితి ఉండటంతో ధోనికి నాలుగు సరైన స్థానంగా కనిపిస్తోంది. అదే కొనసాగితే ఇక భారత్ మరో ఫినిషర్‌ను వెతుక్కోవాల్సి వస్తుంది. అది పాండేనా, పాండ్యానా, మరొకరా అనేది త్వరలో తేలుతుంది! -
అందుకే 'ముందుకు' వచ్చా: ధోని
మొహాలి: బ్యాటింగ్ లో తన సత్తా చాటేందుకు నాలుగో స్థానమే సరైందని టీమిండియా వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోని అభిప్రాయపడ్డాడు. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడం వల్ల తానేంటో నిరూపించుకోవడానికి కష్టపడాల్సి వస్తోందని అన్నాడు. ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో ధోని నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి అర్థసెంచరీ(80)తో రాణించాడు. ధోనికి తోడు కోహ్లి సెంచరీతో చెలరేగడంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని మీడియాతో మాట్లాడాడు. తన సత్తా చాటేందుకే బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చినట్టు తెలిపాడు. 'నేనేంటో చెప్పడానికే నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాను. సత్తా చాటాను. నాలుగు స్థానంలో బ్యాటింగ్ దిగితే తప్పనిసరిగా పెద్ద షాట్లు ఆడాలి. నేనేంటో నిరూపించుకోవడానికి ఈ స్థానమే కరెక్ట్. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కు దిగడం వల్ల ఎక్కువసేపు ఆడడటానికి అవకాశం ఉండట్లేదు. అందుకే బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చాను. ఎక్కువసేపు క్రీజ్ లో ఉంటే బాగా ఆడతాననే నమ్మకం ఉంద'ని ధోని అన్నాడు. ఈ మ్యాచ్ లో ధోని 9 వేల పరుగుల మైలురాయిని దాటాడు. సెంచరీ వీరుడు విరాట్ కోహ్లి గురించి మాట్లాడుతూ... 'క్రికెట్ ఇప్పుడు చాలా మారిపోయింది, దీన్ని పోల్చడం కష్టం. బ్యాట్సమన్లను ఒకరితో ఒకరిని పోల్చడం అసంబద్దంగా ఉంటుంది. గొప్ప ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకడు. అతడు ఆడుతున్నప్పుడు చూడడం నాకెంతో ఇష్టమ'ని మిస్టర్ కూల్ పేర్కొన్నాడు. -
బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు ఉండకపోవచ్చు
న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఉండకపోవచ్చని పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ అన్నాడు. భారత జట్టుకు నిలకడైన బ్యాటింగ్ లైనప్ ఉందని ధోనీ అభిప్రాయపడ్డాడు. భారత టి-20, వన్డే జట్లకు ధోనీ, టెస్టు జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌లో జరిగే టెస్టు సిరీస్‌లో కోహ్లి సారథ్యంలో టీమిండియా బరిలో దిగుతోంది. భారత బ్యాటింగ్ లైనప్‌లో టాప్-6 ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారని, ఉపఖండం ఆవల ఆడిన అనుభవం ఉందని ధోనీ చెప్పాడు. తుది జట్టులోకి ఒకర్నో ఇద్దర్నో కొత్తగా తీసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. జట్టుకు అవసరమైనంతమంది బౌలర్లు అందుబాటులో ఉన్నారని చెప్పాడు. వెస్టిండీస్‌లో వికెట్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్నాడు. భారత్, విండీస్‌ల మధ్య గురువారం నుంచి తొలిటెస్టు జరగనుంది. 2011లో వెస్టిండీస్‌కు భారత్ వెళ్లినపుడు ధోనీ 1-0తో సిరీస్‌ను గెలిపించాడు. -
ధోనీ ఎందుకంత కసిగా కొట్టాడు?
సాధారణంగా భారత్ - పాక్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఫ్యాన్స్‌తో సహా ప్రతి ఒక్కరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆటగాళ్లు కూడా క్రికెట్ ఆడుతున్నట్లు కాక యుద్ధం చేస్తున్నట్లు ఉంటారు. కానీ, ఆదివారం మిర్పూర్లో బంగ్లాదేశ్- భారత్ జట్ల మధ్య జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ మాత్రం అంతకంటే ఎక్కువగానే అనిపించింది. సాధారణంగా బ్యాటింగ్ ఆర్డర్లో ఏడో స్థానంలో వచ్చే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ నాలుగో నెంబరులో వచ్చాడు. వస్తూ వస్తూనే బంగ్లా బేబీల మీద విరుచుకుపడ్డాడు. కేవలం ఆరు బంతుల్లో 20 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు. అందులో రెండు భారీ సిక్సర్లు కూడా ఉన్నాయి. ధోనీ ఎందుకంత కసిగా కొట్టాడు... ఎందుకు ముందు వరుసలోకి ప్రమోట్ చేసుకుని వచ్చాడు? ఈ ప్రశ్నలకు టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి సమాధానం చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే ప్రజంటేషన్ సెర్మనీలో హర్షా భోగ్లే అడిగినప్పుడు రవిశాస్త్రి చెప్పిన విషయం చాలామంది టీమిండియా ఫ్యాన్స్ గుండెలను హత్తుకుంది. ''ఫైనల్ మ్యాచ్ ఎంజాయ్ చెయ్యమని మా వాళ్లకు చెప్పాను. అయితే, గతంలో బంగ్లాదేశ్ జట్టు సిరీస్ గెలిచినప్పుడు వాళ్లు చేసుకున్న సంబరాలను మాత్రం గుర్తుంచుకోవాలని తెలిపాను. ఇప్పుడు వెళ్లి, చితక్కొట్టాలని సూచించాను'' అన్నాడు. ఆ కసి మొత్తం ధోనీ బ్యాటింగ్‌లో ప్రస్ఫుటంగా కనిపించింది. అంతేకాదు.. బంగ్లాదేశ్ వీరాభిమాని ఒకరు అత్యుత్సాహంతో బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్... టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తల పట్టుకుని వెళ్తున్నట్లు ఓ మార్ఫింగ్ ఫొటోను రూపొందించి, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో అప్పటికే ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. విజయానికి 121 పరుగులు చేయాల్సిన టీమిండియా.. చివర్లో 14 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటివరకు వీరవిహారం చేసిన శిఖర్ ధవన్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో విరాట్ కోహ్లీ.. అప్పటికే కుదురుకున్నా, భారీషాట్లు మాత్రం రావడం లేదు. అప్పటికే యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హార్దిక్ పాండ్యా ముగ్గురూ ప్యాడ్లు కట్టుకుని, బ్యాట్లు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. బంగ్లా అభిమానులు గోళ్లు కొరుక్కుంటూ కొందరు, దేవుడికి ప్రార్థనలు చేస్తూ మరికొందరు కనిపించారు. ఇంతలో కెమెరాలు క్రీజ్ వైపు తిరిగాయి. అక్కడ బ్యాటింగ్ ఎండ్‌లో చూస్తే.. ధోనీ!! అంతా ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ ఏడో స్థానంలో వచ్చే ధోనీ.. ఏకంగా నాలుగో స్థానానికి రావడం ఏంటనుకున్నారు. ఎందుకు వచ్చాడో పది నిమిషాల తర్వాత తెలిసింది. అప్పటికే విధ్వంసం జరిగిపోతోంది. 14వ ఓవర్ తొలిబంతిని 105 మీటర్ల దూరానికి సిక్సర్ కొట్టాడు. ఒక్కసారిగా స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అక్కడక్కడ పల్చగా ఉన్న భారత అభిమానులు మాత్రం జెండాలు ఎగరేస్తూ గెంతుతున్నారు. అదే ఓవర్లో మరో ఫోర్, ఇంకో సిక్సర్.. అంతే, ఆసియా కప్ భారత్‌కు వచ్చేసింది. దీంతో.. చిన్నపిల్లలు నిప్పుతో ఆటలు ఆడుకోకూడదని, అలా ఆడుకుంటే చేతులు కాలక తప్పదని భారత అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు. -
'టీమిండియా బ్యాటింగ్ కష్టాలు తొలగాలంటే..'
టెస్టు క్రికెట్లో టీమిండియా బ్యాటింగ్ కష్టాలు తొలగాలంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో మూడోస్థానంలో వస్తున్న రహానె రాణిస్తున్నాడని, అయితే కోహ్లీ వన్ డౌన్లో వస్తే భారత్ బ్యాటింగ్ కష్టాలన్నీతొలగిపోతాయని చెప్పాడు. బ్యాటింగ్ ఆర్డర్లో కోహ్లీ తర్వాత రహానె, రోహిత్ శర్మ ఆడితే మంచిదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం సాధించాలంటే.. మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం దూకుడుగా ఆడి టీ సమయానికి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలని సూచించాడు. తద్వారా లంకను ఆలౌట్ చేసేందుకు భారత బౌలర్లకు తగిన సమయం ఇవ్వాలని సన్నీ చెప్పాడు. -
కోహ్లి మారలేడా!
లక్ష్యం ఎంతున్నా కోహ్లి జట్టులో ఉన్నాడంటే భారత్‌కు ఎప్పుడైనా గెలుపుపై భరోసా ఉంటుంది. తను 19 సెంచరీలు చేస్తే 17 సార్లు భారత్ గెలిచింది. అలాంటి కోహ్లి బ్యాట్ ఇప్పుడు మొండికేస్తోంది. ఒక్కో పరుగు కోసం ఈ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ తంటాలు పడుతున్నాడు. ఆ ప్రభావం జట్టుపై కూడా పడుతోంది. అన్నింటికి మించి అతను అవుటవుతున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇన్నాళ్లుగా విజయానికి చిరునామాగా మారిన విరాట్ పదే పదే అవే తప్పులతో పెవిలియన్ చేరుతున్నాడు. మరి దీనికి పరిష్కారం లేదా! * పదే పదే అవే తప్పులు * వరుసగా విఫలమవుతున్న స్టార్ బ్యాట్స్‌మన్ * ఏడు నెలల పాటు అర్ధ సెంచరీ లేదు * సాంకేతిక సమస్యతో ఇబ్బందులు సాక్షి క్రీడా విభాగం: ఇంగ్లండ్ సిరీస్‌లో కోహ్లి అవుటైన దృశ్యాలు చూస్తే అవి ఏ మ్యాచ్వో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే అచ్చుగుద్దినట్లు అవన్నీ ఒకలాగే కనిపిస్తాయి. ఆఫ్‌స్టంప్‌పై వచ్చిన బంతిని శరీరానికి దూరంగా బ్యాట్ ఉంచి ఆడబోయి స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చిన రీప్లేలు లెక్కలేనన్ని సార్లు వచ్చాయి. ఇంగ్లండ్ పరిస్థితుల్లో స్వింగ్ అయ్యే బంతి కాబట్టి అలా జరిగిందేమో అనుకోవచ్చు. కానీ భారత గడ్డపై కూడా అదే తరహాలో అవుటైతే ఏమనాలి. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై కోహ్లి సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఏడు నెలల్లో ఏడు ఇన్నింగ్స్‌లలో అతను ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. 2009నుంచి భారత జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారాక కోహ్లి ఇంత పేలవంగా ఎప్పుడూ ఆడలేదు. 139 వన్డేల తర్వాత కూడా అతను ఇప్పటికీ 50 సగటు కొనసాగిస్తున్నాడు. అయితే తాజా ప్రదర్శన మాత్రం ఆందోళన రేకెత్తిస్తోంది. టెక్నిక్ సమస్య ఇంగ్లండ్‌లో వైఫల్యం తర్వాత కోహ్లి... సచిన్ టెండూల్కర్‌ను కలిసి సలహాలు తీసుకున్నాడు. ఆ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీలోనూ తీవ్ర సాధన చేశాడు. కానీ అండర్సన్ బదులు టేలర్ బౌలింగ్‌లో అవుట్ కావడం మినహా కోహ్లి ఆటలో వచ్చిన మార్పేమిటో కొచ్చిలో మాత్రం కనిపించలేదు. అదే షాట్... అదే స్లిప్... అదే తరహాలో అవుట్! ‘కోహ్లి సమస్య మానసికమైంది కాదు. అది టెక్నికల్ లోపంగా చెప్పవచ్చు. అతను బ్యాట్ పట్టుకునే యాంగిల్ కారణంగానే ఒకే తరహాలో అవుటవుతున్నాడు. దీనిని కోహ్లి స్వయంగా సరిదిద్దుకోవాలి’ అని తొలి వన్డే అనంతరం మాజీ ఆటగాడు మైకేల్ హోల్డింగ్ విశ్లేషించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కోహ్లి మళ్లీ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. స్థానం మారతాడా! మరో వైపు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు కోహ్లి సమస్యను దూరం చేయవచ్చని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయ పడ్డారు. ఆఫ్‌స్టంప్‌పై పడి బయటికి వెళుతున్న కొత్త బంతులతోనే విరాట్‌కు సమస్య వస్తోందని, మిడిలార్డర్లో ఆడితే ఆ ఇబ్బంది తప్పుతుందని ఆయన అన్నారు. ‘వరుసగా సెంచరీలు కొట్టిన ఆటగాడు ఇప్పుడు 10-20 పరుగులు చేయలేకపోవడం ఆందోళన కలిగించే విషయమే. కొత్త బంతితో అతని లోపాలు మరీ బయట పడిపోతున్నాయి. కాబట్టి కొన్ని మ్యాచ్‌లు అతను ఐదో స్థానంలో బరిలోకి దిగితే బాగుంటుంది. అప్పుడు పరుగులు చేయడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది’ అని సన్నీ వ్యాఖ్యానించారు. డెరైక్టర్ ఏం చేయబోతున్నారు? వెస్టిండీస్‌తో సిరీస్‌లో కూడా కోహ్లి విఫలమైనా ఇప్పటికిప్పుడు జట్టుకు వచ్చిన సమస్య ఏమీ లేదు. జట్టులో అతని స్థానానికీ ఢోకా లేదు. అయితే దీని తర్వాత మనం ఆడబోయేది ఆస్ట్రేలియా గడ్డపైనే. ముక్కోణపు సిరీస్‌తో పాటు ఆ తర్వాత ప్రపంచకప్‌కు సన్నద్ధం కావాల్సి ఉంది. ఆలోగా కోహ్లి ఈ లోపాన్ని అధిగమించాలి. అందుకు మిగిలిన నాలుగు వన్డే మ్యాచ్‌లను ఉపయోగించుకోవాలి. లేదంటే ఇంగ్లండ్ తరహా వికెట్లను పోలి ఉండే ఆస్ట్రేలియాలో కూడా ఇదే సమస్య కొనసాగుతుంది. అప్పుడు మార్పులు చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి కూడా సమయం ఉండదు. ఇంగ్లండ్‌లో వన్డే సిరీస్ సమయంలో రైనా, రహానే, ధావన్...ఇలా ఎవరు బాగా ఆడినా తమ సక్సెస్నంతా టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రికి ఆపాదించారు. మరి శాస్త్రి... కోహ్లి విషయంలో ఏమీ చేయలేదా! భారత్ ప్రపంచ కప్ విజయావకాశాల్లో కోహ్లి ఎంత కీలకమో చెప్పనవసరం లేదు. అలాంటప్పుడు ఇప్పుడైనా కోహ్లి సమస్యను చక్కబెట్టేందుకు శాస్త్రి దృష్టి పెట్టాలేమో. కొత్త బంతితో కోహ్లి లోపాలు మరీ బయట పడిపోతున్నాయి. కాబట్టి కొన్ని మ్యాచ్‌లు అతను ఐదో స్థానంలో బరిలోకి దిగితే బాగుంటుంది. అప్పుడు పరుగులు చేయడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది’ - గవాస్కర్ -
సెహ్వాగ్, గంభీర్.. అదే తీరు
షిమోగ: ఓపెనర్‌గా విఫలమయ్యాక బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకుని మిడిలార్డర్లో దిగినా డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ (13 బంతుల్లో 7; 1 ఫోర్)కు పరిస్థితులు అనుకూలించడం లేదు. తనకు తోడుగా పేలవ ఫామ్‌తో తంటాలు పడుతున్న ఓపెనర్ గౌతం గంభీర్ (44 బంతుల్లో 11; 1 ఫోర్) కూడా మెరుగు పడడం లేదు. వెస్టిండీస్ ‘ఎ’తో ఇక్కడ జరుగుతున్న రెండో అనధికార టెస్టులోనూ ఈ ఇద్దరూ విఫలమయ్యారు. మ్యాచ్‌లో రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 191 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న ఓపెనర్ జగదీశ్ (172 బంతుల్లో 79 బ్యాటింగ్; 8 ఫోర్లు), అభిషేక్ నాయర్ (38 బంతుల్లో 56 బ్యాటింగ్; 7 ఫోర్లు; 1 సిక్స్) నిలకడగా ఆడుతున్నారు. అభిషేక్ నాయర్ టి20 తరహా ఆటతీరుతో రెచ్చిపోయాడు. 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. కెప్టెన్ పుజారా (90 బంతుల్లో 25; 1 ఫోర్) ఆకట్టుకోలేకపోయాడు. పెరుమాల్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు 283/6 ఓవర్‌నైట్ స్కోరుతో తమ రెండో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్ ‘ఎ’ జట్టు... భార్గవ్ భట్ (7/113) ధాటికి తమ తొలి ఇన్నింగ్స్‌ను 406 పరుగుల వద్ద ముగించింది.