దుబాయ్: రాజస్థాన్ రాయల్స్‌పై 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ ధోని 7వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాను ఆ స్థానంలో రావడానికి గల కారణాలను వివరించాడు. నేను చాలా కాలంగా బ్యాటింగ్ చేయలేదు. ఇక్కడి వచ్చాక 14 రోజుల క్వారంటైన్ నిబంధన కూడా నా ప్రాక్టీస్‌పై ప్రభావం చూపింది. విభిన్నంగా ప్రయత్నించడంలో భాగంగానే సామ్ కరన్‌కు అవకాశం ఇవ్వాలని అనుకున్నాను. ఇది సక్సెస్ కాకపోతే మన బలంపై మనం దృష్టిపెట్టొచ్చు.
భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో మంచి శుభారంభం అవసరం. రాజస్థాన్ జట్టులో స్టీవ్ స్మిత్, సంజు శాంసన్ బాగా ఆడారు. ఆఖర్లో ఆర్చర్ కూడా అద్భుతంగా ఆడాడు. బౌలర్లు కూడా బాగా రాణించారు. అయితే మా బౌలర్లు ఎక్కువగా పుల్ లెంగ్త్ బంతులు వేశారు. రాజస్థాన్‌ను 200లోపు కట్టడి చేసుంటే పరిస్థితి మరోలా ఉండేదని ధోని వివరించారు.
(అటు ధోని... ఇటు అంపైర్లు! )
అయితే.. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సంజూ శాంసన్(74).. మరోవైపు స్టీవ్ స్మిత్(69) పరుగులతో దూకుడును ప్రదర్శించగా.. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ 8 బంతుల్లో 27 పరుగులు చేయడంతో రాజస్థాన్ జట్లు చెన్నై ముందు 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 16 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. అయితే చెన్నై జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓపెనర్లు షేన్ వాట్సన్, మురళీ విజయ్ శుభారంభాన్ని అందించినా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రాణించ లేకపోయారు. రన్‌రేట్ పెరుగుతున్న తరుణంలో ధోని బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకొని 7వ స్థానంలో రావడం విమర్శలకు దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment