షిమోగ: ఓపెనర్‌గా విఫలమయ్యాక బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకుని మిడిలార్డర్‌లో దిగినా డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ (13 బంతుల్లో 7; 1 ఫోర్)కు పరిస్థితులు అనుకూలించడం లేదు. తనకు తోడుగా పేలవ ఫామ్‌తో తంటాలు పడుతున్న ఓపెనర్ గౌతం గంభీర్ (44 బంతుల్లో 11; 1 ఫోర్) కూడా మెరుగు పడడం లేదు. వెస్టిండీస్ ‘ఎ’తో ఇక్కడ జరుగుతున్న రెండో అనధికార టెస్టులోనూ ఈ ఇద్దరూ విఫలమయ్యారు. మ్యాచ్‌లో రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 191 పరుగులు చేసింది.
క్రీజులో ఉన్న ఓపెనర్ జగదీశ్ (172 బంతుల్లో 79 బ్యాటింగ్; 8 ఫోర్లు), అభిషేక్ నాయర్ (38 బంతుల్లో 56 బ్యాటింగ్; 7 ఫోర్లు; 1 సిక్స్) నిలకడగా ఆడుతున్నారు. అభిషేక్ నాయర్ టి20 తరహా ఆటతీరుతో రెచ్చిపోయాడు. 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. కెప్టెన్ పుజారా (90 బంతుల్లో 25; 1 ఫోర్) ఆకట్టుకోలేకపోయాడు. పెరుమాల్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు 283/6 ఓవర్‌నైట్ స్కోరుతో తమ రెండో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్ ‘ఎ’ జట్టు... భార్గవ్ భట్ (7/113) ధాటికి తమ తొలి ఇన్నింగ్స్‌ను 406 పరుగుల వద్ద ముగించింది.
సెహ్వాగ్, గంభీర్.. అదే తీరు
Published Fri, Oct 4 2013 1:52 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
Advertisement