
Courtesy : Chennai Super Kings
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్‌లో నేడు సీఎస్‌కేతో పంజాబ్ కింగ్స్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ధోని బ్యాటింగ్ ఆర్డర్‌పై కీలక సూచనలు చేశాడు.
''ధోని తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకుంటే బాగుంటుంది. ఇన్నింగ్స్ సమయంలో తనకు తాను బ్యాటింగ్‌లో ప్రమోషన్ కల్పించుకొని జట్టును ముందుకు నడిపిస్తే బాగుంటుంది. ప్రస్తుతం ధోని వస్తున్న ఏడో స్థానం కర్టెక్ట్ కాదు.. ఎందుకంటే ఇప్పుడు అతను నాలుగైదేళ్ల క్రితం ధోని ఎంత మాత్రం కాదు.. ఒకప్పుడు మ్యాచ్ ఫినిషర్‌గా ఆరు, ఏడు స్థానాల్లో దుమ్ముదులిపిన అతను ఇప్పుడు మాత్రం పరుగులు తీయడానికే ఇబ్బంది పడుతున్నాడు. నా అంచనా ప్రకారం ధోని నాలుగు.. ఏదో స్థానాల్లో వచ్చి ఆడితే బాగుంటుంది'' అని సలహా ఇచ్చాడు.
కాగా గతేడాది సీజన్‌లో ధోని ఏడో స్థానంలో వచ్చి మ్యాచ్‌లు గెలిపించకపోగా స్ట్రైక్ రొటేట్ చేయడంలో విఫలమై విమర్శల పాలయ్యాడు. ఆ సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన ధోని 200 పరుగులు సాధించాడు. ఫలితం.. ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే జట్టు తొలిసారి ప్లేఆఫ్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సీఎస్‌కే 189 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. తమ బౌలర్ల వైఫల్యంతో సీఎస్‌కు భారీ మూల్యం చెల్లించుకుంది.
చదవండి: ఆరుగురు భారత క్రికెటర్లు.. ఒక్కడే విదేశీ క్రికెటర్
పంత్ రనౌట్.. పరాగ్ డ్యాన్స్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment