సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం టీమిండియాకు దొరికిన ఒక ఆణిముత్యం. రాబోయే టి20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ కీలకం కానున్నాడు. టీమిండియా నాలుగో స్థానంలో సూర్యను తప్ప మిగతావారిని ఊహించికోవడం కష్టమనేలా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే సూర్యకుమార్ బ్యాటింగ్ చేసే స్థానం గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎందుకంటే కెరీర్ ఆరంభం నుంచి మిడిలార్డర్‌లో బ్యాటింగ్ వచ్చిన సూర్య.. మధ్యలో కొన్నిసార్లు ఓపెనింగ్ స్థానంలోనూ వచ్చాడు. దీంతో పలువురు మాజీలు సూర్య ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుందని చర్చ జరిపారు.
తాజాగా ఒక చానెల్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన సూర్య.. తనకు నాలుగో స్థానం బెస్ట్ అని అభిప్రాయపడ్డాడు."నేను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలను. 1, 3, 4, 5 ఇలా ఎక్కడైనా రాణించగలను. అయితే వ్యక్తిగతంగా నాకు నాలుగో స్థానం ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నా. నేను బ్యాటింగ్ వెళ్లే ఆ స్థానం ఆటను నేను నియంత్రించేలా చేస్తుంది. నేను 7 నుంచి 15 ఓవర్ల మధ్య బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆటను ఆస్వాదించాను. ఆ దశలో నేను సానుకూలంగా ఉండటానికి ప్రయత్నిస్తా.
నేను గొప్ప పవర్ ప్లే, స్ట్రాంగ్ ఫినిషింగ్ చేసిన చాలా టీ20 మ్యాచ్‌లు చూశాను. కానీ టీ20ల్లో 8 నుంచి 14వ ఓవర్ వరకు చాలా కీలకం. ఆ సమయంలో మెరుగైన స్కోరు కోసం గట్టిగా ప్రయత్నించాలి. నేను ఆ సమయంలో ఎక్కువ రిస్కీ షాట్లు ఆడటానికి ప్రయత్నించను. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు తాను ఓవర్ కవర్‌లో ఆడటానికి ప్రయత్నిస్తా. ముఖ్యంగా నాలుగో నెంబర్‌లో బ్యాటింగ్ చేయడం సవాలుతో కూడుకున్న స్థానం అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment