టీమిండియా నయావాల్‌గా పేరుగాంచిన చతేశ్వర్ పూజారాకు షాక్ తగిలిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఫామ్‌లో లేక సతమతమవుతున్న పుజారాను విండీస్‌తో టెస్టు సిరీస్‌కు పక్కనబెట్టారు. ఇది పుజారా కెరీర్‌కు ఎండ్‌లా కనిపిస్తుందని సోషల్ మీడియాలో హోరెత్తుతున్నప్పటికి తాను మాత్రం పట్టించుకోలేదు. మళ్లీ ఎలాగైనా జట్టులోకి తిరిగి రావాలని ప్రయత్నంలో పూజరా కీలక నిర్ణయం తీసుకున్నాడు.
తనపై వేటు వేయడంతో అసంతృప్తికి గురైన అతను దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఓకే చెప్పాడు. త్వరలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో సత్తా చాటాలని తహతహలాడుతున్నాడు. ఈ టోర్నీలో అతను వెస్ట్ జోన్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. పూజరాతో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా అదే జట్టులో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆరు జట్లు పాల్గొంటున్న దులీప్ ట్రోఫీ బెంగళూరు వేదికగా జూన్ 28న మొదలవ్వనుంది. విండీస్‌తో టెస్టులకు ఎంపిక్వని సూర్య.. వన్డే జట్టుతో మాత్రం కలవనున్నాడు.
కౌంటీల్లో రాణించి…
ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో పూజారా తీవ్రంగా నిరాశ పరిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో తక్కువ స్కోర్‌కే వెనుదిరిగాడు. అంతకు ముందు ఇంగ్లండ్ గడ్డపై కౌంటీల్లో అద్భుతంగా రాణించి సెంచరీల మీద సెంచరీలు సాధించాడు. ఏ ఇంగ్లండ్‌లో అయితే చెలరేగాడో అదే గడ్డపై డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రం చేతులెత్తేశాడు.
ఇప్పటివరకు పుజారా 103 టెస్టుల్లో 43.60 సగటు, 19 సెంచరీలతో పుజారా 7195 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సార్లు టెస్టు సిరీస్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించడం అతని కెరీర్‌లో అత్యుత్తమ క్షణాలు. ఇక వెస్టిండీస్ టూర్‌కు టెస్టు, వన్డేలకు 16 మందితో కూడిన బృందాన్ని ఈరోజు కమిటీ ప్రకటించింది. భారత జట్టు విండీస్ గడ్డపై 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టి20 ఆడనుంది.
చదవండి: #CheteshwarPujara: కెరీర్ ముగిసినట్లే! ..'కొత్త గోడ'కు సమయం ఆసన్నం
Comments
Please login to add a commentAdd a comment