
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్లో వెస్ట్ జోన్ బ్యాటర్ పృథ్వీ షా అర్ధ శతకంతో మెరిశాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 101 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 65 పరుగులతో రాణించాడు ఈ ఓపెనర్. అయితే, మిగతా బ్యాటర్ల నుంచి పృథ్వీ షాకు సహకారం లభించలేదు.
8 పరుగులకే అవుట్
మరో ఓపెనర్, కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ 11 పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ హర్విక్ దేశాయ్ 21 పరుగులు చేయగలిగాడు. ఇక నాలుగో స్థానంలో దిగిన టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా పోరాడుతుండగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన మరో భారత స్టార్ సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా నిరాశపరిచాడు.
6 బంతులు ఎదుర్కొన్న ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. సౌత్ జోన్ బౌలర్ విధ్వత్ కవెరప్ప బౌలింగ్‌లో కెప్టెన్ హనుమ విహారికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్‌ను కవెరప్ప వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు.
తిలక్, విహారి ఇన్నింగ్స్‌తో
ఇలా కీలక బ్యాటర్లు విఫలం కావడంతో వెస్ట్ జోన్ 119 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్ రెండో రోజు ఆటను వెలుతురులేమి కారణంగా నిలిపివేసే సమయానికి పుజారా 7, అతిత్ సేత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ(40), హనుమ విహారి(63) ఆదుకోవడంతో సౌత్ జోన్ 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. వెస్ట్ జోన్ ప్రస్తుతం 94 పరుగులు వెనుకబడి ఉంది.
ఇలాగైతే..
కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో విఫలమైన కారణంగా పుజారా టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు.
ఇక వన్డే, టీ20 జట్లలో స్థానం సంపాదించిన సూర్యకుమార్ యాదవ్‌కు కూడా టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పుజారా, సూర్య దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించడం గమనార్హం. ఇక దులిప్ ట్రోఫీ ముగిసిన తర్వాత సూర్య కరేబియన్ దీవికి పయనం కానున్నట్లు తెలుస్తోంది.
చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే
అతడికి టెస్టుల్లో అవకాశం ఇవ్వండి.. మార్క్‌వుడ్ మాదిరే: మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment