ముంబై: ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్న చెన్నై.. చివరకు టైటిల్‌తో ఘనంగా ముగింపునిచ్చింది. తుది పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పైచేయి సాధించిన ధోని అండ్ గ్యాంగ్.. టైటిల్‌ను ముద్దాడింది. ఈ టైటిల్‌ను సాధించడంలో కెప్టెన్ ధోని కీలక పాత్ర పోషించాడు. ప్రధానంగా బ్యాటింగ్‌లో ముఖ్య పాత్ర పోషించి చెన్నైకు ముచ్చటగా మూడో టైటిల్‌ను అందించాడు. కాకపోతే, ఐపీఎల్-11 సీజన్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌ను పదేపదే మార్చుకోవడంపై ధోని స్పందించాడు.
‘నేను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున‍్న సమయంలోనే ఫిట్‌నెస్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఐపీఎల్‌కు ఫిట్‌నెస్ అనేది చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో ఐపీఎల్ జట్టు కోసం చర్చించాల్సిన సందర్భంలో నా బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకోవాలనే ఆలోచనకు వచ్చా. అందుకు నా వయసు ఒక కారణం. ఓవరాల్ ఐపీఎల్‌లో నా బ్యాటింగ్ ఆర్డర్‌లో కింది స్థానాల్లో వచ్చిన సమయాల్లో నేను పెద్దగా రాణించలేదు. అందుకు ఈ సీజన్‌లో సాధ్యమైనంత వరకూ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు రావాలని ఫిక్సయ్యా. నాకు మా జట్టు గెలవడమే ముఖ్యం. దానిలో భాగంగానే ప్రణాళికలు సిద్దం చేసుకున్నాం. ముఖ్యంగా గేమ్‌లో ఓవర్ల ఆధారంగా నా బ్యాటింగ్ ఆర్డర్‌ను 3,4,5 స్థానాలకు మార్చుకుంటూ వచ్చా. మా జట్టు దిగువ స్థాయి బ్యాటింగ్‌ను కూడా సమతూకంగా ఉండేలా చూసుకున్నాం. దాంతో నా బ్యాటింగ్ ఆర్డర్‌ను ముందుకు తీసుకురావడానికి చాన్స్ దొరికింది’ అని ధోని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment